'పాస్తా'.. ఇటలీ ఆహారశైలిలో ఒకటి. అయితేనేమి ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల ప్రజలు ఈ వంటకాన్ని తింటారు. ఎన్నో రూపాల్లో.. విభిన్నమైన రుచుల్లో.. దొరికే పాస్తాను ఒక్కసారి తింటే మళ్లీ వదిలిపెట్టరు. అటువంటి పాస్తా మన దేశంలోనూ వివిధ రుచులతో సందడి చేస్తోంది. ప్రస్తుతం సీ ఫుడ్ పాస్తా(seafood pasta recipe)కు మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో దీనిని ఎలా తయారు చేసుకోవాలో(seafood pasta recipe make simple) చూద్దాం.
కావాల్సిన పదార్థాలు (తగిన మోతాదులో తీసుకోండి)
వెన్న(బటర్), ఉల్లిపాయ ముక్కలు, పుట్టగొడుగులు, వెల్లుల్లి, మిక్స్డ్ హర్బ్స్, మైదా పిండి -1 స్పూన్, చికెన్ స్టాక్ (చికెన్ ముక్కలు ఉడకబెట్టుకున్న నీళ్లు), ఫ్రెష్ క్రీమ్, ఉప్పు, మిరియాల పొడి, రొయ్యలు, ఛీజ్, నిమ్మరసం, పాస్తా.
తయారీ విధానం
ముందుగా ఓ బౌల్లో బటర్ వేడి చేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పుట్టగొడుగులు, వెల్లుల్లి, మిక్స్డ్ హర్బ్స్ వేసి ఒకసారి కలపాలి. తర్వాత మైదా పిండి, చికెన్ స్టాక్, ఫ్రెష్ క్రీమ్ వేసి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, రొయ్యలు వేసి మరి కాసేపు ఉడికించి, ఛీజ్, నిమ్మరసం, పాస్తా వేసి మరో 5 నిమిషాలు ఉడికించుకుంటే సీ ఫుడ్ పాస్తా రెడీ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: క్యాప్సికం- పల్లీలతో కొత్త రెసిపీ.. ట్రై చేయండిలా!