ETV Bharat / priya

నోరూరించే 'చేప బిర్యానీ'.. చేసుకోండిలా

బిర్యానీ అందరికీ ఫేవరేట్​. అయితే.. ఎప్పుడూ చికెన్​, మటన్​లతోనేనా? అందుకే ఈసారి చేపలతో ట్రై చేద్దాం. పోషకాలందిస్తూనే నోరూరించే 'చేప బిర్యానీ'ని ఇంట్లోనే తయారు చేసి ఆస్వాదిద్దాం.

recipe of healthy and tasty fish biryani
నోరూరించే 'చేప బిర్యానీ'.. చేసుకోండిలా
author img

By

Published : Jan 9, 2021, 12:41 PM IST

'చేప బిర్యానీ'ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

కావల్సినవి:

చేప ముక్కలు - అరకేజీ, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - సరిపడా, పసుపు - చెంచా, గరం మసాలా - టేబుల్‌ స్పూను, మొక్కజొన్న పిండి - చెంచా (నీళ్లతో పేస్టులా కలుపుకోవాలి), గుడ్లు - రెండు.

బిర్యానీ కోసం..

నెయ్యి - అరకప్పు, హోల్‌ గరం మసాలా - టేబుల్‌ స్పూను (బజార్లో దొరుకుతుంది), ఉల్లిపాయలు - మూడు, అల్లం, వెల్లుల్లి పేస్టు - రెండు టేబుల్‌ స్పూన్లు చొప్పున, టొమాటో - ఒకటి, కొత్తిమీర - రెండు కట్టలు, పెరుగు - అరకప్పు, బాస్మతీ బియ్యం - అరకేజీ (పదిహేను నిమిషాల ముందు నానబెట్టుకోవాలి), నూనె - వేయించేందుకు సరిపడా, జీలకర్ర - రెండు చెంచాలు, క్యాప్సికం - పెద్దది, జీడిపప్పు, కిస్‌మిస్‌ - రెండూ కలిపి పావుకప్పు, గులాబీ నీరు - రెండు చెంచాలు.

తయారీవిధానం..

చేప ముక్కలపై సరిపడా ఉప్పు, మిరియాల పొడి, పసుపు, గరంమసాల, మొక్కజొన్న పిండి, గుడ్ల సొన వేసి అన్నింటినీ బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి, అడుగు మందంగా ఉన్న గిన్నెలో నెయ్యి కరిగించి హోల్‌ గరంమసాల, సగం ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి కలిపి చేసిన పేస్టు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక టొమాటొ ముక్కటు, కొత్తిమీర తరుగు, పెరుగు వేయాలి. కాసేపటికి ఇది గ్రేవీలా అవుతుంది. అప్పుడు దింపేయాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని కడిగి, సరిపడా నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాలి. ఈ బియ్యం ముప్పావు వంతు ఉడికిందనుకున్నాక దింపేయాలి. ఓ బాణలిలో చేప ముక్కలు వేయించేందుకు సరిపడా నూనె వేసి వాటిని వేయించుకుని తీసుకోవాలి.

మరో బాణలిలో రెండు మూడు చెంచాల నూనె వేడి చేసి జీలకర్ర వేయాలి. అవి వేగాక మిగిలిన ఉల్లిపాయముక్కలు, క్యాప్సికం ముక్కలు వేయాలి. అవి కూడా వేగాక ముందుగా చేసుకున్న పెరుగు గ్రేవీని ఇందులో వేసి మంట తగ్గించాలి. కాసేపటికి గ్రేవీలోని నూనె పైకి తేలుతుంది. అప్పుడు వేయించి పెట్టుకున్న చేప ముక్కలు వేసి రెండు నిమిషాల తరవాత దింపేయాలి. అన్నంపై గులాబీనీరు వేసుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి అడుగు మందంగా ఉన్న గిన్నె అడుగున అన్నం పరవాలి. దానిపై చేప ముక్కల మసాలా సగం వేయాలి. తరవాత మిగిలిన అన్నం, కూర మసాలా వేసి చివరగా వేయించిన జీడిపప్పూ, కిస్‌మిస్‌ వేసి గట్టి మూత పెట్టి.. పావుగంట సేపు పొయ్యి మీద ఉంచి దింపేస్తే సరిపోతుంది.

ఇదీ చూడండి:చవులూరించే 'చందువా'.. చేసుకోండిలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.