లడ్డూ.. ఈ పదం వింటేనే నోరూరుతుంది కదూ! పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీనిని ఇష్టంగా తింటారు. రుచితో పాటు, ఆరోగ్యాన్నీ పెంపొందించే 'రాగి ఓట్స్ లడ్డూ' తయారీ విధానం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..
కావాల్సినవి..
రాగి పిండి, ఓట్స్, ఖర్జూరం, పాలు, తేనె, నెయ్యి, యాలకుల పొడి, నువ్వులు, కొబ్బరి పొడి, జీడిపప్పు
తయారీ విధానం..
ముందుగా ఖర్జూరం మిక్సీ పట్టి పక్కన పెట్టాలి. ఇప్పుడు పాన్లో నెయ్యి వేసి జీడిపప్పు, నువ్వులు విడివిడిగా వేయించుకోవాలి. అదే ప్యాన్లో రాగిపిండి, ఓట్స్ పొడి, ఎండు కొబ్బరి పొడి విడివిడిగా వేయించాలి. ఆ తర్వాత ఓ గిన్నెలో.. వేయించిన నువ్వులు, వేయించిన రాగి పిండి, ఓట్స్ పొడి, ఎండు కొబ్బరి పొడి, కాస్త యాలకుల పొడి, ఖర్జూరం పేస్ట్ వేసి కొన్ని పాలు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేతుల్లో లడ్డూల్లాగా చేసుకోవాలి. ఆపై వేయించిన జీడిపడ్డును లడ్డూలపై ఉంచితే.. రుచితో పాటు ఆరోగ్యాన్ని పెంచే రాగి ఓట్స్ లడ్డూ రెడీ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి:పంచదార లేకున్నా.. మధురంగా లడ్డూ!