ETV Bharat / priya

హలీమ్.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..! - మటన్​ హలీమ్ తయారీ

రంజాన్ మాసం అనగానే అందరికీ మొదటగా గుర్తొచ్చేది హలీమ్. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే ఈ మాసం ప్రారంభం నుంచే ఎక్కడ, ఎవర్ని చూసినా హలీమ్ లాగించేస్తుంటారు. అది అంత రుచిగా ఉంటుంది మరి! రుచే కాదు.. బోలెడంత ఆరోగ్యాన్నీ ప్రసాదిస్తుందీ వంటకం. రంజాన్‌ మాసం ప్రారంభమైన నేపథ్యంలో ఇంట్లోనే మటన్ హలీమ్‌ను ఎలా తయారు చేసుకోవచ్చు? దానివల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకుందాం రండి...

mutton haleem
మటన్​ హలీమ్​
author img

By

Published : Apr 18, 2021, 7:37 PM IST

రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ప్రసాదించే మటన్ హలీమ్​ తయారీ విధానం చూసేద్దాం..

కావాల్సినవి

* బోన్‌లెస్ మటన్ - కిలో

* అల్లం పేస్ట్ - 2 టీస్పూన్లు

* మినప్పప్పు - కప్పు

* కారం - టీస్పూన్

* పెరుగు - 2 కప్పులు

* జీడిపప్పు - అరకప్పు

* మిరియాలు - అరటీస్పూన్

* నెయ్యి - అరకప్పు

* పుదీనా ఆకులు - అరకప్పు

* బరకగా పట్టించిన గోధుమలు (క్రష్డ్ వీట్) - 3 కప్పులు

* వెల్లుల్లి పేస్ట్ - 2 టీస్పూన్లు

* శెనగపప్పు - కప్పు

* పసుపు - పావు టీస్పూన్

* ఉల్లిపాయ ముక్కలు - కప్పు (గోధుమ వర్ణం వచ్చే వరకు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి)

* గరం మసాలా పొడి - టీస్పూన్

* దాల్చినచెక్క - 1

* కొత్తిమీర తరుగు - కప్పు

* పచ్చిమిర్చి - 6

* ఉప్పు - రుచికి సరిపడా

* నిమ్మకాయ ముక్కలు - 2 (గార్నిష్ కోసం)

తయారీ

* ముందుగా బరకగా పట్టించిన గోధుమల్ని (క్రష్డ్ వీట్) బాగా కడిగి అరగంట పాటు నీటిలో నానబెట్టాలి. ఆలోపు మటన్‌ని ఖీమాలా చితక్కొట్టి పక్కన పెట్టుకోవాలి.

* ఈ మటన్‌కు అర టేబుల్‌స్పూన్ అల్లం పేస్ట్, అర టేబుల్‌స్పూన్ వెలుల్లి పేస్ట్, అర టీస్పూన్ ఉప్పు, కారం, అర టీస్పూన్ గరం మసాలా పొడి, కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుక్కర్‌లో పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. ఆపై మరో ఇరవై నిమిషాల పాటు సిమ్‌లో పెట్టి ఉడికించుకొని, దించి పూర్తిగా చల్లారే వరకూ పక్కన పెట్టుకోవాలి.

* ఇప్పుడు గోధుమల్లో మినప్పప్పు, శెనగపప్పు, మిగిలిన అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, మూడు పచ్చిమిరపకాయలు, కొన్ని మిరియాలు వేసి పది కప్పుల నీళ్లు పోసి.. ఇవన్నీ పూర్తిగా ఉడికేంత వరకూ ఉడికించుకోవాలి. ఈ క్రమంలో మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.

* ఆపై ఒక బౌల్‌లో నూనె వేసి అది వేడెక్కాక మటన్ మిశ్రమం, మిగిలిన పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసి ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. ఆ తర్వాత ఈ మిశ్రమానికి పెరుగు కలిపి మరో పదిహేను నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మరో మూడు కప్పుల నీళ్లు పోయాలి.

* ఇది కొద్ది సేపు ఉడికిన తర్వాత దీనికి ముందుగా ఉడికించి పెట్టుకున్న గోధుమ మిశ్రమం, నెయ్యి కలుపుకొని స్టౌ సిమ్‌లో పెట్టి అరగంట పాటు ఉడికించుకోవాలి. అంతే.. ఎంతో రుచిగా ఉండే మటన్ హలీమ్ ఆరగించడానికి సిద్ధం!

* దీన్ని ఒక అందమైన బౌల్‌లోకి తీసుకొని దానిపై వేయించిన ఉల్లిపాయ ముక్కలు, నిమ్మ చెక్కలు, కొత్తిమీర-పుదీనా తరుగుతో గార్నిష్ చేసుకొని అతిథులకు సర్వ్ చేస్తే వారు యమ్మీ యమ్మీగా లాగించేస్తారు.

mutton haleem
నోరూరించే రుచితో

ఆరోగ్యదాయిని!

రంజాన్ మాసంలో అందరూ ఎంతో ఇష్టంగా లాగించే హలీమ్‌లో ఎన్నో పోషకాలు దాగున్నాయి. అవి అందించే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.

mutton haleem
పోషకాల హలీమ్​
  • హలీమ్ తయారీలో మనం ఉపయోగించే జీడిపప్పు, శెనగపప్పు, మినప్పప్పు.. వంటి వాటిలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని కండరాల్ని, కణజాలాల్ని మరింత దృఢంగా మారుస్తాయి.
  • ఈ వంటకం తయారీలో వాడే గోధుమల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపరచడంలో దోహదం చేస్తుంది. అంతేకాదు.. పీచు వల్ల ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది.. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కటి ఆహారం.
  • ఇక హలీమ్ తయారీలో వాడే అల్లం, వెల్లుల్లి, పసుపు.. వంటి వాటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. హైబీపీ, కిడ్నీ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడంలో పొటాషియం సహకరిస్తుంది. అలాగే ఇది గుండె సంబంధిత సమస్యల్ని దూరం చేసి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఆందోళన, ఒత్తిళ్లు కూడా మాయమవుతాయి.
  • మధుమేహంతో బాధపడుతోన్న వారికి ఇది చక్కటి ఆహారం అని చెబుతున్నారు నిపుణులు.
  • ఇందులో ఉండే సోడియం నాడీ వ్యవస్థను పటిష్ఠపరుస్తుంది.

అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయముంది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఈ వంటకంలో ఉప్పు, నూనె తగ్గించుకొని తయారుచేసుకోవాలి.

హలీమ్‌ను ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలి? దానివల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటి? వంటి వివరాలన్నీ తెలుసుకున్నారుగా! మరి హలీమ్‌ని టేస్ట్ చేయండి. అటు రుచికి రుచితో పాటు ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోండి.

ఇదీ చదవండి: కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చండి: కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.