లాక్డౌన్లో చాలామంది వంటింట్లో ప్రయోగాలు చేశారు. అలానే ఓ యువకుడు సృష్టించిన 'మ్యాగీ పానీపూరి' వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
పానీపూరిలో సాధారణంగా బటానీ కూర, ఉల్లిపాయ ముక్కలు వేస్తారు. కొత్తిమీర, పుదీనా కలిపిన నీరు వేసి తింటారు. కానీ కొత్త ప్రయోగం అంటూ పానీపూరిలో మ్యాగీ న్యూడిల్స్ వేశాడు ఓ ఘనుడు.
ఇలా చేయడంపై చాలా మంది పానీపూరి అభిమానులు అసహ్యాన్ని వ్యక్తం చేశారు. ఆ ప్రయోగం 2020 ఏడాది(కరోనా సంక్షోభం) కంటే దారుణంగా ఉందని కామెంట్ చేస్తున్నారు.
ఇదీ చూడండి: దిల్లీ మెచ్చిన 'కచాలు చాట్'.. ఆహా ఏమి రుచి