ETV Bharat / priya

DATES: వర్షాకాలంలో డేట్స్‌ ఎందుకు తినాలో తెలుసా? - రక్తహీనత తగ్గాలంటే ఏం చేయాలి

వర్షాకాలం వ్యాధుల కాలం అంటుంటారు. సాధారణంగానే ఈ కాలంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీనికి తోడు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఈ కాలంలో ఇన్ఫెక్షన్లు, వివిధ రకాల అనారోగ్యాలు చుట్టుముట్టడం ఖాయం. మరి, వీటితో సమర్థంగా పోరాడే శక్తిని శరీరానికి అందించడం మన చేతుల్లోనే ఉంది. ఈ క్రమంలో వివిధ రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం మనకు అలవాటే. అయితే వాటిలో ఖర్జూర పండ్లకు మొదటి ప్రాధాన్యమివ్వమంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్‌ రుజుతా దివేకర్‌. ఫలితంగా వానాకాలపు వ్యాధుల్ని దూరం చేసుకోవడంతో పాటు ఆరోగ్యపరంగా బోలెడన్ని ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు అవేంటంటే..

DATES BENEFITS
ఖర్జూర పండ్లు
author img

By

Published : Jul 21, 2021, 4:57 PM IST

ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ వంటి విషయాల్లో అందరిలో స్ఫూర్తి నింపుతుంటారు రుజుత దివేకర్. ఈ క్రమంలో సీజనల్‌ పండ్లు, కాయగూరల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలతో పాటు మహిళల ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలను సైతం ఎప్పటికప్పుడు ఇన్​స్టాలో పోస్ట్‌ల రూపంలో పంచుకుంటారు. అంతేకాదు.. విభిన్న వ్యాయామాలతో అందరికీ ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్పే రుజుత.. తాజాగా ఖర్జూర పండ్లలో దాగున్న ఆరోగ్య రహస్యాలను మన ముందుకు తెచ్చారు.

ఇన్ఫెక్షన్లకు విరుగుడుగా..!

‘సీజన్లను బట్టి మనం కొన్ని రకాల ఆహార పదార్థాల్ని తీసుకుంటుంటాం.. వాతావరణ మార్పుల్ని తట్టుకుంటూ మన శరీరాన్ని వ్యాధుల బారిన పడకుండా అవి అడ్డుకోవడమే ఇందుకు ప్రధాన కారణం! ఇలాగే వర్షాకాలంలో ఖర్జూర పండ్లు తినడానికీ కొన్ని కారణాలున్నాయి.. అవేంటంటే..!

  • ముఖ్యంగా ఈ కాలంలో ఎదురయ్యే ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, ఇతర అనారోగ్యాలతో పోరాడేందుకు అవసరమైన పోషకాలు ఇందులో మిళితమై ఉంటాయి.
  • శరీరంలో శక్తి స్థాయుల్ని, హెమోగ్లోబిన్‌ స్థాయుల్ని మెరుగుపరచడంలో డేట్స్‌ ముందుంటాయి.
  • నిద్రలేమి సమస్యకు ఇది విరుగుడుగా పని చేస్తుంది.
  • ఈ కాలంలో వాతావరణ పరిస్థితుల రీత్యా శారీరక శక్తి తగ్గిపోయి వ్యాయామం చేయడానికి శరీరం సహకరించదు. అలాంటప్పుడు డేట్స్‌ తీసుకుంటే ఫలితం ఉంటుంది.
  • ఖర్జూరాల్లో పీచు అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకం, ఎసిడిటీ.. వంటి జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్‌ పెడుతుంది.
  • రుచిలో తిరుగులేని ఖర్జూరాలను తీసుకోవడం వల్ల చర్మ సౌందర్యం కూడా ఇనుమడిస్తుంది.
ఎవరైనా తినొచ్చు

ఇలా చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది తెలుసా..?

అయితే వీటిని ఎవరు, ఎప్పుడు తీసుకోవాలంటే..

  • ఎవరైనా సరే.. పరగడుపున తీసుకోవచ్చు..
  • అదే రక్తహీనత (హెమోగ్లోబిన్‌ స్థాయులు తక్కువగా ఉంటే) ఉన్నవారు మధ్యాహ్నం భోజనం చేశాక తినాలి.
  • పిల్లలు అందులోనూ యుక్తవయసులోకి చేరువవుతోన్న వారు వీటిని మిడ్‌ మీల్‌ స్నాక్‌ (ఉదయం 11.30 నుంచి 12.30 మధ్యలో)గా తీసుకోవడం మరీ మంచిది.
  • వీటిని ఒకసారి కొనుగోలు చేశామంటే.. ఆ గింజలతో ఇంట్లోనే డేట్స్‌ మొక్కని పెంచుకోవచ్చు..’ అంటున్నారు రుజుత.

ఎన్నెన్నో ప్రయోజనాలు!

ఖర్జూరంలో B6 అధికంగా ఉంటుంది
  • వర్షాకాలంలో అధిక హ్యుమిడిటీ వల్ల పలు చర్మ సమస్యలు తలెత్తుతాయి. జుట్టు గడ్డిలా మారుతుంది. ఇందుకు శరీరంలో విటమిన్‌ బి6 లోపమే కారణమట! అందుకే ఈ విటమిన్‌ అధికంగా ఉండే ఖర్జూరాలను ఆహారంలో భాగం చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.
  • క్యాల్షియం, మెగ్నీషియం.. ఈ రెండు ఖనిజాలు శరీరంలోని అనవసర కొవ్వుల్ని కరిగించి చక్కటి శరీరాకృతిని మన సొంతం చేయడానికి తోడ్పడతాయి. అందుకే బరువు తగ్గి నాజూగ్గా మారాలనుకునే వారు ఈ రెండు పోషకాలు ఉన్న డేట్స్‌ని ఆహారంలో చేర్చుకోవాలంటున్నారు.
  • నెలసరి సమయంలో మూడ్‌ బాగోలేక చిరుతిళ్లు తినాలని మనసు ఆరాటపడుతుంది. ఇలాంటప్పుడు డేట్స్‌ తీసుకోవడం వల్ల అటు ఆరోగ్యంతో పాటు ఇటు నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం పొందచ్చు.
  • డేట్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని డ్యామేజ్‌ చేసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి క్యాన్సర్‌, గుండె సంబంధిత సమస్యలు.. వంటి దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి మనల్ని కాపాడతాయి.
  • ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే శక్తి ఖర్జూరాలకు ఉందని పలు అధ్యయనాల్లో సైతం రుజువైంది.
  • ప్రసవానికి చేరువవుతోన్న మహిళలు డేట్స్‌ తీసుకోవడం వల్ల గర్భాశయ ముఖ ద్వారం సులభంగా తెరుచుకుంటుందని, తద్వారా సుఖ ప్రసవం అయ్యే అవకాశాలు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు.
  • గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండే ఖర్జూరాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయని, టైప్‌-1 మధుమేహంతో బాధపడే వారూ నిస్సందేహంగా వీటిని తీసుకోవచ్చని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు. అయితే ఇతరత్రా ఆరోగ్య కారణాల రీత్యా ఈ విషయంలో ఎవరికి వారు తమకు చికిత్స చేసే వైద్యులను సంప్రదించడం మంచిది.

బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాల్ని అందిస్తున్నాయి కదా అని డేట్స్‌ని మరీ ఎక్కువగా కాకుండా పరిమితంగా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. తద్వారా ఆ రోజుకు సరిపడా పోషకాలు అందుతాయంటున్నారు.

ఇదీ చూడండి: వహ్వా హల్వా.. తియ్యటి వేడుకకు తయారా!

ఇది తెలుసా.. ఖర్జూర పోషకాల ఖజానా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.