ETV Bharat / priya

కరివేపాకు మిరియాలతో చికెన్​ కబాబ్​.. ఇలా చేసేయండి

చికెన్​తో ఎన్నో వెరైటీలు చేసుకొని ఉంటారు. మరి ఎప్పుడైనా కరివేపాకు, మిరియాలతో 'చికెన్​ కబాబ్​' ట్రై చేశారా? రుచికరమైన ఈ వంటను ఎలా చేయాలో చూసేయండి మరి.

karvepaku chicken kebab recipe
కరివేపాకు మిరియాలతో చికెన్​ కబాబ్​
author img

By

Published : Oct 30, 2021, 2:50 PM IST

నాన్​వెజ్​ ప్రియులకు చికెన్​ అంటే మహా ఇష్టం. చాలా మందికి ఆదివారం చికెన్​ లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. చికెన్​తో రకరకాల వంటలు వండుకుని ఆరగిస్తారు. మరి మీరు ఎప్పుడైనా 'కరివేపాకు, మిరియాలతో 'చికెన్​ కబాబ్​' ట్రై చేశారా? రుచికరమైన ఈ కబాబ్​ను ఎలా చేయాలో తెలుసుకొని వెంటనే ట్రై చేసేయండి..

కావాల్సిన పదార్థాలు..

  • చికెన్​
  • ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్​
  • ఉల్లిపాయ, టమాట, పచ్చిమిర్చి, జీడిపప్పు
  • కారప్పొడి, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి

ఇలా చేసేయండి..

ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి, చికెన్​ ముక్కలు వేసి, ఉప్పు వేసి, 6-7 నిమిషాల వరకు చిన్నగా కుక్​ చేసుకోవాలి. తర్వాత చికెన్​ ముక్కలు తీసేసి, అదే నీళ్లల్లో ఉల్లిపాయ, టమాట, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్​, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారప్పొడి, గరం మసాలా వేసి బాయిల్​ చేయాలి. చివర్లో మిరియాలు వేసి, కరివేపాకు వేసి ఇంకొంచెం సేపు కుక్​ చేసుకోవాలి. తర్వాత దాన్ని తీసి మిక్సీలో వేసి పేస్ట్​ చేసుకోవాలి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆ తర్వాత పేస్ట్​ను చికెన్​ ముక్కలకు అంటించాలి. అనంతరం పెనంపై వెన్న, నూనె వేసి రెండు పక్కలా కుక్​ చేసి వేడివేడిగా వడ్డించుకుని తింటే.. కరివేపాకు, మిరియాలతో చేసిన చికెన్​ కబాబ్​ను ఆహా! అనాల్సిందే. ఆలస్యం ఎందుకు? మీరు ట్రై చేసేయండి.

ఇదీ చూడండి:- రెస్టారెంట్​ స్టైల్​లో డ్రాగన్​ చికెన్​.. ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.