ETV Bharat / priya

మిక్స్​డ్​ వెజిటేబుల్ పన్నీర్​ కడాయి సబ్జీని చేసుకోండిలా!

శాకాహారులకు పన్నీర్​తో (Paneer Special) చేసే స్పెషల్​ వంటకాలు బాగా నచ్చుతాయి. దానికి తోడు మరిన్ని వెజిటేబుల్స్​ వేసి చేస్తే ఇక అద్భుతః అని అంటారు. అలాంటి వంటకమే మిక్స్​డ్ వెజి​టేబుల్​ పన్నీర్​ కడాయి సబ్జీ. ఉత్తర, దక్షిణ భారతదేశంలో ఉండే వారందరూ తినే ఈ స్పెషల్​ వంటకం ఎలా తయారు చేస్తారో చూద్దాం.

mix veg paneer kadai sabzi
మిక్స్​డ్​ వెజిటేబుల్ పన్నీర్​ కడాయి సబ్జీ
author img

By

Published : Sep 28, 2021, 6:10 PM IST

మిక్స్​డ్​ వెజిటేబుల్​ పన్నీర్​ కడాయి సబ్జీని ఉత్తర, దక్షిణ భారత దేశాల్లో ఎంతో ఇష్టంగా తింటారు. కూరగాయలు ఎక్కువగా ఉండి.. పన్నీర్​ (Paneer Special) కూడా ఉండడం వల్ల ఎన్నో పోషక విలువలు దీనిలో ఉంటాయి. అయితే దీనిని రొట్టెలతో కానీ బిర్యానీతో కానీ తింటే చాలా బాగుంటుంది. దీనిని ఎలా తయారు చేయాలో ఓ సారి చూద్దాం.

మిక్స్​డ్​ వెజిటేబుల్ పన్నీర్​ కడాయి సబ్జీ తయారీ విధానం..

మిక్స్​డ్​ వెజిటేబుల్ పన్నీర్​ కడాయి సబ్జీని తయారు చేయడానికి ముందుగా స్టవ్​ ఆన్ చేసుకుని గిన్నె పెట్టాలి. దానిలో కొంచెం నూనె వేసి వేడి చేయాలి. ముందుగా కట్​ చేసుకున్న ఉల్లిపాయలతో పాటు సరిపడినంత ఉప్పు వేసుకుని దోరగా వేగించాలి. అందులో పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద, టొమోటో జ్యూస్​, జీడిపప్పు పేస్ట్​ వేసి చక్కగా ఉడికించుకోవాలి. దానిలో నుంచి నూనె బయటకు వచ్చిన తరువాత బంగాళదుంప, క్యారెట్​ ముక్కలు, తెల్ల మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్రపొడి, గరంమసాలా, తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. బాగా వేడి చేశాక అందులో పన్నీర్, పచ్చి బఠానీ, చిటికెడు పంచదార, కసూరి మేతి, వెన్న కూడా వేసి దాన్ని కుక్​ చేసుకోవాలి. చివర్లో ఒక్కనిమిషం ఉన్నప్పుడు క్యాప్సికం, కొంచెం క్రీమ్​ కూడా వేసి వేడివేడిగా ఓ సర్వింగ్​ బౌల్​లోకి తీసుకొని.. రొట్టెలతో వడ్డించుకుంటే వాహ్వా అనిపిస్తుంది. దీనిని బిర్యానీతో కలిపి తీసుకున్నా చాలా బాగుంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కావాల్సిన పదార్థాలు..

  • నూనె
  • ఉల్లిపాయలు
  • ఉప్పు
  • బంగాళాదుంప
  • క్యారెట్​
  • క్యాప్సికం
  • పసుపు
  • అల్లంవెల్లులి
  • కసూరి మేతి
  • వెన్న
  • టొమోటో జ్యూస్​
  • జీడిపప్పు పేస్ట్​
  • నీళ్లు
  • కారం లేక మిరియాలు పొడి
  • ధనియాల పొడి
  • జీలకర్ర పొడి
  • గరం మసాలా పొడి
  • పచ్చి బఠానీ
  • పంచదార
  • పన్నీర్​

ఇదీ చదవండి: Kaddu Ki Kheer: హైదరాబాద్​ స్టైల్​లో​ 'కద్దూ కీ ఖీర్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.