ETV Bharat / priya

ఆకుకూరల్లో పోషకాలు పోకుండా ఉండాలంటే ఇలా చేయండి!

ఆరోగ్యం కోసం మనలో చాలా మంది ఆకుకూరలను ఎక్కువగా తీసుకుంటారు. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన నైట్రేట్లు లభిస్తాయి. అలాగే వీటిలో చాలా పోషక పదార్థాలు కూడా ఉంటాయి. అయితే మనం ఈ కూరల్ని వండేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పోషకాల్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అలాంటపుడు ఈ చిట్కాలు పాటించండి.

not destroy nutrients present in green food
ఆకుకూరల్లో పోషకాలు పోకుండా
author img

By

Published : Sep 16, 2021, 4:32 PM IST

ఆకుకూరల్లో మానవుని శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ప్రోటీన్లు, ఇతర పోషక పదార్థాలు ఉంటాయి. అందుకే ఇలాంటి పదార్థాల్ని ఎక్కువగా తీసుకోవాలి. అయితే వీటిని వండేటపుడు కొన్ని సులభ పద్దతులు పాటించడం వల్ల అందులో ఉన్న పోషక విలువలను మనం నష్టపోకుండా ఉంటాము. ముఖ్యంగా ఆకుకూరల్లో పోషక పదార్థాలు పోకుండా ఉండాలి అంటే వండేటప్పుడు చింతపండు, నిమ్మరసం, వేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అవి వేయకుండా ఉండడం వల్ల ఆకుకూరల్లో పోషక పదార్థాలు అలానే ఉంటాయి.

మరిన్ని టిప్స్​ను తెలుసుకుందాం..

  • పండ్లను శుభ్రం చేయకుండా ఫ్రిడ్జ్​లో ఉంచితే.. అవి ఎక్కువకాలం నిల్వ ఉంటాయి.
  • నిమ్మకాయలను ఫ్రిడ్జ్​లో పెట్టే ముందు వాటికి కొంచెం నూనె రాసి పెడితే.. అవి 20 నుంచి 24 రోజుల వరకు నిల్వ ఉంటాయి.
  • మార్కెట్​ నుంచి తెచ్చిన పండ్లు, కూరగాయలను ఉప్పు, పసుపు కలిపిన నీటిలో ఒక నిమిషం పాటు ఉంచి కడిగితే వాటికి ఉన్న రసాయనాలు తొలగిపోతాయి.
  • పాలను రెండు, మూడు రోజులు నిల్వ ఉంచాల్సిన అవసరం వచ్చినప్పుడు వాటిలో కొంచెం బేకింగ్​ సోడా వేస్తే విరిగిపోకుండా ఉంటాయి.
  • ఉల్లిపాయలు కోసిన తరువాత చేతులు వాసన రాకుండా ఉండాలి అంటే ఒక బంగాళాదుంప ముక్కను చేతులకు రాసుకొని శుభ్రం చేసుకుంటే చేతులు ఉల్లి వాసన రాకుండా ఉంటాయి.
  • పచ్చికొబ్బరి చిప్పల లోపల నిమ్మరసం రాస్తే కొబ్బరి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
  • ఎండుకొబ్బరిని సులభంగా తురమాలంటే.. దానిపై నీళ్లు చల్లి ఫ్రిడ్జ్​లో పెట్టి రెండు నిమిషాల తరువాత సులభంగా తురుముకోవచ్చు.
  • అరటి కాయలు కట్​ చేసినప్పుడు.. ఆ ముక్కలను మజ్జిగతో కలిపిన నీటిలో వేస్తే ముక్కలు నల్లగా రాకుండా ఉంటాయి.
  • దొండకాయలు త్వరగా ఉడకాలి అంటే వాటిలో కొంచెం వంటసోడా వేస్తే అవి త్వరగా ఉడుకుతాయి.
  • టమోటాలు ఎక్కువ ధర ఉన్నప్పుడు పప్పు లాంటి వంటకాల్లో వాటికి బదులుగా చింతపండుగానీ, మామిడికాయ గానీ, లేదా చింత చిగురు గానీ వేసుకుని చేసుకుంటే వంట రుచిగా ఉంటుంది.
  • గోధుమ రవ్వ పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఆ రవ్వ ఉంచిన డబ్బాలో కొంచెం ఉప్పును మూట కట్టి వేయాలి. ఇలా చేయడం ద్వారా రవ్వ పురుగు పట్టకుండా ఉండదు.

ఇదీ చూడండి: Dosa Recipe: దోశలందు ఈ దోశ వేరయా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.