ETV Bharat / priya

నోరూరించే 'మసాలా చేప కూర'- చేసుకోండి ఇలా..

నాన్​ వెజ్​ ఐటమ్స్​లో చేపలతో ఎప్పుడూ తినే వంటకాలు బోర్​ కొడుతున్నాయా? ఇంట్లోనే కొత్తగా ఏదైనా చేసుకోవాలనుందా? అయితే.. ఇంకెందుకు ఆలస్యం.. నోరూరిస్తూ ఘుమఘుమలాడే మసాలా చేపకూరను చేసుకోండిలా...

MAKING SPICY FISH CURRY SIMPLE RECIPE
నోరూరించే 'మసాలా చేప కూర' సింపుల్​ రెసిపీ
author img

By

Published : Nov 7, 2020, 1:21 PM IST

శరీరానికి మంచి పోషకాలనిచ్చే చేపలతో ఎప్పుడూ తినే వంటకాలే కాకుండా కొత్తగా ప్రయత్నిస్తే అద్భుతంగా 'మసాలా చేపకూర' తయారుచేసుకోవచ్చు. ఇంట్లో వంటకాలతోనే భిన్నమైన రుచిని ఆస్వాదించవచ్చు. అదెలాగంటారా? ఇదిగో తయారీ విధానం మీకోసం..

కావల్సినవి:

  • ఏదైనా ఒక రకం చేప - ఒకటి
  • నిమ్మకాయ - ఒకటి
  • ఉప్పు - రుచికి తగినంత
  • ఎండుమిర్చి - పది
  • లవంగాలు - ఆరేడు
  • దాల్చినచెక్క - చిన్నవి రెండు
  • ఆకుపచ్చ యాలకులు - ఐదు
  • జీలకర్ర, నల్ల మిరియాలు - పావు చెంచా
  • అల్లం ముక్కలు - రెండు
  • వెల్లుల్లి, ఉల్లిపాయ - ఒక్కోటి చొప్పున
  • నూనె - టేబుల్‌స్పూను
  • పంచదార - చెంచా
  • వెనిగర్‌ - కొద్దిగా

తయారీ విధానం:

ఎండుమిర్చి, లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, జీలకర్ర, మిరియాలను కాసిని నీటిలో నానబెట్టాలి. అల్లం, వెల్లుల్లిని వెనిగర్‌లో నానబెట్టాలి. ఆ తరవాత వీటన్నింటినీ మిశ్రమంలా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో చెంచా నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కల్ని వేయించి పంచదార చల్లాలి. రెండు నిమిషాలయ్యాక ఉల్లిపాయ ముక్కల్ని సిద్ధం చేసుకున్న మసాలా మిశ్రమానికి కలపాలి. చేపను శుభ్రం చేసి విడిపోకుండా ముక్కల్లా తరగాలి. ఇందులో తయారు చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని కూరి సరిపడా ఉప్పు, నిమ్మరసం చేపకు పట్టించి ఫ్రిజ్‌లో ఉంచాలి. గంటయ్యాక తీసి పెనంపై మిగిలిన నూనె వేడి చేసి వేయించాలి. బంగారువర్ణంలోకి వచ్చేదాకా రెండువైపులా కాల్చితే సరిపోతుంది. దీన్ని బ్రెడ్‌ లేదా రొట్టెలతో కలిపి తింటే ఆ రుచే వేరు.

ఇదీ చదవండి: ఆహా! అనిపించే 'తోటకూర చికెన్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.