ETV Bharat / priya

'కోకోనట్‌ రైస్‌ పుడ్డింగ్‌' సింపుల్​ రెసిపీ

ఎప్పుడూ బయట తినే బేకరీ ఐటమ్స్​తో విసుగొచ్చిందా? ఇంట్లోనే ఏదైనా వెరైటీస్​ చేసుకోవాలనుందా? అయితే.. కోకోనట్​ రైస్​ పుడ్డింగ్​ను సింపుల్​గా తయారుచేసుకోండిలా..

author img

By

Published : Oct 23, 2020, 2:55 PM IST

COCONUT RICE FOODING SIMPLE RECIPE
కోకోనట్‌ రైస్‌ ఫుడ్డింగ్

బేకరీ ఐటమ్స్​ అంటే ఇష్టపడని వారు అరుదు. అయితే.. కరోనా కాలంలో బయట ఏది తినాలన్నా.. ఆలోచించాల్సిన పరిస్థితి. అలాగని నోటిని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరమూ లేదు. ఇంట్లో లభించే పదార్థాలతో సింపుల్​గా కోకోనట్​ రైస్​ పుడ్డింగ్​ చేసుకోవచ్చు. అదెలాగంటే..

కావల్సినవి:

  • పంచదార-కప్పు
  • పచ్చి కొబ్బరి తురుము-ముప్పావు కప్పు
  • అన్నం-కప్పు
  • వెన్న- టేబుల్‌ స్పూను
  • యాలకుల పొడి- టీ స్పూను
  • కోడి గుడ్లు- రెండు

తయారీ విధానం:

  1. ఓ గిన్నె తీసుకొని అందులో అన్నం, కొబ్బరి తురుము, పంచదార, యాలకుల పొడి, గుడ్ల సొన వేసి బాగా కలుపుకోవాలి.
  2. ఇప్పుడు ఓ కేకు పాత్రకు వెన్న రాసి దానిలోకి ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకుని ఓవెన్‌లో 180 డిగ్రీల వద్ద 20 నిమిషాల పాటు బేక్‌ చేసుకుంటే సరి. కోకోనట్‌ రైస్‌ పుడ్డింగ్‌ సిద్ధం.

ఇదీ చదవండి: కన్నడ స్వీట్​ 'బెళగావి కుంద' సింపుల్ రెసిపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.