ఏ ఆనందమొచ్చినా.. కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం ఈ తరం ఆనవాయితీ. మరి ఆ కేక్‌ను ఆరోగ్యంగా మార్చుకుంటే పోలా..? అందుకే హెల్దీ క్యారెట్ కేక్‌ను ఇంట్లోనే తయారు చేసుకోండిలా....
కావాల్సిన పదార్థాలు
- బాదం పిండి - ఒకటిన్నర కప్పు
- ఉప్పు - అరటీస్పూన్
- బేకింగ్‌సోడా - అరటీస్పూన్
- దాల్చిన చెక్క పొడి - టీస్పూన్
- జాజికాయ పొడి - అరటీస్పూన్
- అల్లం పొడి - అరటీస్పూన్
- గుడ్లు - మూడు
- తేనె - రెండు టేబుల్‌స్పూన్స్
- కొబ్బరి నూనె లేదా నెయ్యి లేదా బటర్ - కప్పులో ఎనిమిదో వంతు
- క్యారట్ తురుము - ఒకటిన్నర కప్పులు
- వేయించిన పల్లీలు - అరకప్పు
- అవిసె గింజలు - టేబుల్‌స్పూన్
- నారింజ తొక్కలు - అరటీస్పూన్
- ఖర్జూరం - 2-3
తయారీ
ముందుగా ఓ పెద్ద గిన్నె తీసుకుని అందులో పైన తెలిపిన పదార్థాలను ఒక్కొక్కటిగా కలుపుకుంటూ చక్కని బ్యాటర్‌లా తయారుచేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఓ బేకింగ్ ట్రేలో పోసుకుని 180 డిగ్రీల వద్ద 30-35 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే రుచికరమైన క్యారట్ కేక్ సిద్ధమవుతుంది.
ఇదీ చదవండి: బేక్ చేయకుండా కేక్ చేసుకోండిలా...