కొర్రలను ఎప్పుడూ ఒకే రకంగా (tasty millet upma) ఉడికించి తింటే బోరే కదా..! ఆరోగ్యాన్నిచ్చే కొర్రలను రుచికరంగా (Korrala upma recipe) మార్చుకోవాలంటే.. కొర్రల ఉప్మాను ఓ సారి ట్రై చేయాల్సిందే..
కావల్సిన పదార్థాలు:
- కొర్రలు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, అల్లం, ఎండు మిరపకాయలు, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు.
తయారీ విధానం:
కొర్రలను ముందుగా డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. (Korrala upma recipe) ఇప్పుడు కడాయిలో నూనె బాగా వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, పల్లీలు, అల్లం, ఎండు మిరపకాయలు తర్వాత పచ్చి మిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు జోడించి కాసేపు వేగనివ్వాలి. ఒక కప్పు నీళ్లుపోసి మరిగిన తరువాత అందులో ముందుగా డ్రైరోస్ట్ చేసి పెట్టుకున్న కొర్రలు ఆ మిశ్రమానికి కలపాలి. ఆ మిశ్రమాన్ని 10-15 నిమిషాలు చిన్న మంటలో ఉడికించుకుంటే కొర్రల ఉప్మా రెడీ అవుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి:'బ్రెడ్ ఉప్మా' ఓసారి ట్రై చేయాల్సిందే సుమా!