ETV Bharat / priya

kerala chicken: కేరళ స్టైల్ చికెన్ కర్రీ- తింటే మైమరచిపోవాల్సిందే! - చికెన్ గ్రేవీ కర్రీ

నాన్​వెజ్ ప్రియులు.. కోడి కూర అంటే పడిచచ్చిపోతారు. ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్ కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే చికెన్​తో ఎన్నో వెరైటీలు ట్రై చేస్తుంటారు. కేరళ స్టైల్​లో ఓసారి చికెన్​ కర్రీ (kerala chicken) చేసి చూడండి. దీనిని రొట్టెలతో తింటే ఆహా అనాల్సిందే!

kerala chicken
చికెన్ కర్రీ
author img

By

Published : Sep 5, 2021, 7:01 AM IST

కేరళ వంటకాలకు ఉండే ప్రత్యేకతే వేరు. అందులోనూ వారు చేసే చికెన్ కర్రీ (kerala chicken) చూస్తుంటూనే నోరూరిపోతుంది. దాంతో పాటు వెన్నపూసిన రొట్టె తిన్నారంటే.. ఆహా అంచూ మైమరిచిపోవాల్సిందే. మరి ఈ రుచికరమైన కేరళ స్టైల్ చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా?

కావాల్సిన పదార్థాలు:

చికెన్ (బోన్​/బోన్​లెస్​), టమాటా, కొబ్బరినూనె, ఆవాలు, గరం మసాలా, సోంపు, బిర్యానీ ఆకు, లవంగాలు, ఎండుమిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం పొడి, జీలకర్ర పొడి, పచ్చి కొబ్బరి, పుదీనా, మిరియాల పొడి

తయారు చేసుకునే విధానం:

స్టవ్​ వెలిగించి, కడాయి పెట్టి ముందుగా కొబ్బరినూనె వేయాలి. అది వేడెక్కాక అందులో ఆవాలు వేసి, అది చిటపటలాడిన తర్వాత హోల్ గరం మసాలా, సోంపు, ఎండు మిరపకాయలు, పచ్చి మిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి చక్కగా కలుపుకోవాలి. తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు వేసి దాంట్లో ధనియాల పొడి, కారం పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చికెన్ ముక్కలు కూడా వేసి కుక్​ చేసుకోవాలి.

ఎప్పుడైతే చికెన్​ టమాటాలతో పాటు ఉడుకుతుందో అప్పుడు పచ్చి కొబ్బరి పేస్ట్​ వేసుకొని మరి కొద్దిసేపు కుక్​ చేసుకోవాలి. కావాల్సినంత గ్రేవీ వచ్చాక అందులో పుదీనా, మిరియాల పొడి వేసి స్టవ్ ఆఫ్​ చేసేయాలి.

రొట్టె ఇలా ట్రై చేయండి..

మైదా పిండితో కాస్తా నూనె, వెన్నె, బేకింగ్ పౌడర్​తో రొట్టె చేసుకొని, గసగసాలతో కోటింగ్ చేయాలి. దానిని రెండు వైపులా చక్కలా కాల్చి చికెన్ కర్రీతో తింటే చాలా టెస్టీగా ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: కండరాలు బలంగా ఉండాలంటే ఇవి తినండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.