ETV Bharat / priya

అదిరే కల్యాణ రసం ఆరగించేద్దాం! - కల్యాణ రసం

కరోనా అందర్ని ఇళ్లకే పరిమితం చేసేసింది. బయటకు వెళ్లలేకపోవడం వల్ల నచ్చిన ఆహారం తినలేక రోజూ ఒకే రకం వంటకాలను తింటూ విసుగు చెందుతున్నారా? ఈసారి కాస్త కొత్తగా ట్రై చేయండి. 'కల్యాణ రసం' తయారు చేసి వేడి వేడి అన్నంతో ఆరగించేయండి..

kalyana rasam
అదిరే కల్యాణ రసం ఆరగించేద్దాం!
author img

By

Published : Apr 16, 2020, 4:29 PM IST

పప్పు అంటే చాలామందికి ఇష్టం. అయితే రోజూ ఒకేలా చేసి తినడానికి విసుగు చెందుతుంటారు. ఇలాంటి వారు కాస్త వెరైటీగా రసం కంటే కాస్త ఎక్కువగా పప్పు కంటే కాస్త తక్కువగా ఓ కొత్త వంటకాన్ని రుచి చూసేయండి. ఇంతకీ ఇది ఏమిటని ఆలోచిస్తున్నారా? అదే కల్యాణ రసం. మరి దీన్ని ఎలా చేస్తారో తెలుసా!

తయారు చేసేందుకు కావల్సిన పదార్థాలు

రసం తయారీకి..

  • కంది పప్పు - 3 టేబుల్​ స్పూన్లు
  • టమాటా - ఒకటి
  • చింతపండు - నిమ్మకాయంత పరిమాణంలో
  • వెల్లుల్లి రెబ్బలు - 4
  • మిరియాలు - ఒక టీస్పూను
  • జీలకర్ర - ఒక టీ స్పూను
  • పసుపు - ఒక టీస్పూను
  • ఉప్పు - సరిపడా
  • మంచినీళ్లు - తగినన్ని

పొడికోసం

  • కందిపప్పు - ఒక టేబుల్​స్పూను
  • దనియాలు - ఒక టేబుల్​ స్పూను
  • మిరియాలు - ఒక టేబుల్​ స్పూను
  • జీలకర్ర - ఒకటిన్నర టీస్పూను
  • ఎండుమిర్చి - రెండు
  • నూనె - టీస్పూను

తాలింపు కోసం..

  • నూనె - ఒకటిన్నర టీస్పూను
  • ఆవాలు - ఒక టీస్పూను
  • జీలకర్ర - అరటీస్పూను
  • కరివేపాకు - 4 రెబ్బలు
  • ఇంగువ - చిటికెడు
  • కొత్తిమీర - ఒక కట్ట

తయారు చేసే విధానం

  1. అరకప్పు గోరువెచ్చని నీళ్లలో చింతపండు వేసి నానబెట్టాలి.
  2. విడిగా ఓ పాన్​లో టీస్పూను నూనె వేసి పొడి కోసం తీసుకున్నవన్నీ వేసి వేయించాలి. చల్లారాక పొడి చేయాలి.
  3. టమాటా ముక్కలుగా కోసి అరకప్పు నీళ్లు పోసి మెత్తగా పిసికి రసం పిండాలి.
  4. కుక్కర్​లో కందిపప్పు, పసుపు వేసి ఉడికించాలి. తరువాత మెత్తగా మెదిపి టమాటా రసం, చింతపండు రసం, ఉప్పు వేసి కలపాలి.
  5. వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర మెత్తగా నూరాలి.
  6. మందపాటి గిన్నెలో టీస్పూను నూనె వేసి వెల్లుల్లి మిశ్రమం వేసి వేగాక పప్పు, టమాటా, చింతపండు రసం వేసి సిమ్​లో మరిగించాలి. తరువాత రసం పొడి వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ మరికాసేపు మరిగించాలి.
  7. చిన్న బాణీలో నూనె వేసి తాలింపు దినుసులన్నీ వేసి రసంలో కలపాలి. చివరగా కొత్తిమీర వేస్తే 'కల్యాణ రసం' రెడీ.

ఇదీ చదవండి: కరోనాపై పోరు: మే 3 వరకు లాక్​డౌన్​లోనే దేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.