Jonna Perugu Upma: తృణధాన్యాలైన జొన్నలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే పెరుగు కూడా జీర్ణక్రియను మెరుగుపరచటంలో ఎంతో సహకరిస్తుంది. మరి ఈ రెండింటి మిశ్రమంతో జొన్నపెరుగు ఉప్మా ఎప్పుడైనా ట్రై చేశారా..? ఇంకెందుకు ఆలస్యం.. తయారీ విధానం తెలుసుకోండి..
కావాల్సిన పదార్థాలు
జొన్నరవ్వ, జీలకర్ర, అల్లం ముక్కలు, పల్లీలు, ఉల్లిపాయముక్కలు, మినపప్పు, పచ్చిమిర్చీ, పెరుగు, ఆవాలు, ఉప్పు, కరివేపాకు, నూనె
తయారీ విధానం
- ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి రెండు స్పూన్ల నూనె వేసి.. నూనె వేడయ్యాక ఆవాలు, మినపప్పు, జీలకర్ర, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పల్లీలు, ఒక్కొక్కటిగా వేస్తూ వేయించుకోవాలి.
- అవి వేగాక కరివేపాకు, 1/2 కప్పు జొన్న రవ్వ వేసి కాసేపు వేయించుకోవాలి.
- మరోవైపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి బాగా బీట్ చేసుకుని సరపడా ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరోసారి బీట్ చేసి.. దాన్ని జొన్నరవ్వ మిశ్రమంలో పోసి చిన్నమంటలో మూతపెట్టి ఉడికించుకోవాలి.
- జొన్నరవ్వ దగ్గరయ్యాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే జొన్న పెరుగు ఉప్మా రెడీ...
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: చిరుధాన్యాలతో వంటకాలు... ఆరోగ్య సిరులు!