నోరూరించే జపనీస్ ఆనియన్ సూప్ ఇంట్లోనే సులభంగా ఎలా చేసుకోవాలో ఓ లుక్కేయండి....
కావాల్సినవి
- చికెన్ బోన్: ఒకటి,
- ఉల్లిపాయ: ఒకటి,
- క్యారెట్: ఒకటి(పలుచని స్లైసులుగా కోయాలి),
- సెలెరీ కాడలు: రెండు,
- అల్లం తురుము: ఒకటిన్నర టీస్పూన్లు,
- మంచినీళ్లు: 3 కప్పులు,
- ఉప్పు: తగినంత.
తయారుచేసే విధానం
చికెన్ బోన్, కూరగాయల ముక్కలు అన్నీ కుక్కర్‌లో వేసి నీళ్లు పోసి ఉడికించాలి. రెండుమూడు విజిల్స్ వచ్చిన తరవాత సిమ్‌లో పెట్టి మరో పది నిమిషాలు ఉంచాలి.
తరవాత మూత తీసి ఈ నీటిని పలుచని క్లాత్‌లో వడబోయాలి. ముక్కలన్నీ తీసేసి సూప్‌లో తగినంత ఉప్పు వేసి వేడివేడిగా అందించాలి.
ఇదీ చదవండి: నోరూరించే 'ఎగ్ సలాడ్'తో ఆరోగ్యం దరిచేరుతుంది!