షుగర్ వ్యాధి ఉన్నవారు ఏం తినాలనుకున్నా ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిందే. పచ్చళ్లు తినాలంటే ఉప్పుకారం సమపాళ్లలో ఉండాలి. ఇలాంటి వారికోసమే ఈ కొత్త రెసిపీ 'ఇన్సులిన్ ఆకు పచ్చడి'. ఎంతో రుచికరంగా ఉండే ఈ పచ్చడి తయారు చేసుకోవడం చాలా సులభం. కేవలం నిమిషాల వ్యవధిలో పూర్తయిపోతుంది.
కావాల్సిన పదార్థాలు
ఇన్సులిన్ ఆకు, కొత్తిమీర, కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, నిమ్మరసం.
తయారీ విధానం
ముందుగా ఇన్సులిన్ ఆకు కాడలు, కొత్తిమీర కాడలు పూర్తిగా తొలగించుకోవాలి. ఆ తర్వాత మిక్సీలో ఈ రెండింటితో పాటు కొబ్బరిముక్కలు, పసుపు, నిమ్మరసం, ఉప్పు వేసుకుని బాగా గ్రైండ్ చేస్తే సరి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేసే 'ఇన్సులిన్ ఆకు పచ్చడి' రెడీ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: