ఆమ్లెట్ అంటే కేవలం బ్రెడ్ ఆమ్లెట్ మాత్రమే కాదు. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ ఆమ్లెట్‌ను ఎప్పుడైనా తిన్నారా..? మరికెందుకు ఆలస్యం ఇప్పుడే చేసుకోండి పన్నీర్ ఆమ్లెట్..
కావాల్సిన పదార్థాలు
- పన్నీర్
- కోడిగుడ్డు
- పసుపు
- కారం
- ఉప్పు
- కొత్తిమీర
- నూనె
- టమాటో సాస్
- రెడ్‌చిల్లీ సాస్
తయరీ విధానం :
ముందుగా ఓ మిక్సింగ్ బౌల్లో కోడిగుడ్డు సొన.. కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి అందులో పన్నీర్ ఉంచి, కలిపి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్‌లాగా వేసుకోవాలి. దానిపై కొత్తిమీర, టామాటో సాస్, రెడ్‌చిల్లీ సాస్, కొద్దిగా నూనె వేయాలి.
మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. అలా ఉడికించిన ఆమ్లెట్‌ను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చిన్నచిన్న ముక్కలుగా పిల్లలకు పెట్టాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: నోరూరించే చికెన్ ఆమ్లెట్ తిన్నారా..!