చేపలు తింటే కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు. చేపలతో ఎక్కువగా పులుసు లేదా ఫ్రై చేసుకుంటుంటారు. కాస్త వెరైటీగా, రుచిగా కావాలనుకుంటే మాత్రం 'ఫిష్ మసాలా ఫ్రై' ట్రై చేయాల్సిందే. దీనిని ఎలా తయారు చేస్తారో తెలుసుకోండి..
కావాల్సినవి
చేపలు(అందుబాటులో ఉన్నవి), ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కరివేపాకు, నిమ్మరసం, నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొబ్బరిపొడి.
తయారీ విధానం
ముందుగా చేపలను బాగా కడిగి ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత ఓ ప్లేటులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కరివేపాకు, నిమ్మరసం, నూనె వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ముందుగా కోసుకున్న చేప ముక్కలకు పట్టించాలి. అలా 15 నిమిషాల పాటు ఉంచి.. తర్వాత చేప ముక్కలకు ఎక్కువ మసాలా లేకుండా తీసేయాలి. నూనె వేయకుండా.. ఉన్న నూనెతోనే చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటిని తీసేయాలి. ఆ ప్యాన్లోనే కొద్దిగా నెయ్యి, ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేయించాలి. తర్వాత కొబ్బరి పొడి వేసి వేయించాలి. కాస్త రంగు మారిన తర్వాత కొత్తిమీర, మిగిలిన మసాలా మిశ్రమంలో తగినన్ని నీళ్లు పోయాలి. ఈ మిశ్రమాన్ని మూడు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత అందులో ముందుగా వేయించిన చేప ముక్కలు వేసి ఉడికిస్తే.. ఫిష్ మసాలా ఫ్రై రెడీ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: సండే స్పెషల్ 'మండీ' బిర్యానీని ఇంట్లో చేసుకోండిలా.