ETV Bharat / priya

పెరుగు పులిసిపోకుండా.. రుచిగా ఉండాలంటే.! - పెరుగు కమ్మగా ఉండాలంటే

పెరుగంటే ఇష్టపడని వారుండరు. షడ్రుచులతో భోజనం చేసినా చివర్లో పెరుగుతో ఒక ముద్ద అయినా తిననిది ఆ భోజనం సంతృప్తిగా అనిపించదు. అలా అని ఆ పెరుగు పుల్లగా ఉంటే తినలేం. తియ్యగా ఉంటేనే ఓ రెండు ముద్దలు ఎక్కువ లాగించేస్తాం. మరి ఎండాకాలంలో పెరుగు పులిసిపోకుండా రుచిగా ఉండాలంటే ఈ చిట్కా పాటించండి.

how to make curd tasty
పెరుగు రుచిగా ఉండాలంటే
author img

By

Published : Apr 26, 2021, 12:55 PM IST

పెరుగు లేకుండా భోజనం పూర్తికాదు చాలామందికి. ఈ కాలంలో త్వరగా పులిసిపోతుంది. అలాకాకుండా ఉండాలంటే...

పెరుగు కమ్మగా...
పెరుగు కమ్మగా...

* పాలను బాగా మరిగించాలి. తోడు వేయడానికి ఉపయోగించే పెరుగు పుల్లగా లేకుండా చూసుకోవాలి. వేడి పాలల్లో కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే పెరుగు కలిపి మూత పెట్టాలి. దీన్ని మరీ స్టౌకి దగ్గరగా పెట్టొద్దు. పెరుగును మట్టిపాత్రలో లేదా సిరామిక్‌ గిన్నెలో తోడు పెడితే...గట్టిగా తోడుకుంటుంది. కమ్మగానూ ఉంటుంది.
* సాధారణంగా మర్నాడు తినడానికి రాత్రి, మధ్యాహ్నానికి ఉదయాన్నే తోడు పెడతారు. అలాకాకుండా భోజనం తినేవేళకు ఐదారు గంటల ముందు ఇలా చేస్తే సరి. ఆపై వెంటనే ఫ్రిజ్‌లో పెడితే రుచి మారదు. పెరుగు గిన్నెపై మూత తప్పనిసరి. మూత లేకపోతే మిగతా పదార్థాల వాసనలు పెరుగులో కలిసిపోయి కూడా త్వరగా పులిసిపోయే అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండి: కొవిడ్​ బాధితులకు ముచ్చెమటలు పట్టిస్తున్న విద్యుత్​ కోతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.