ఉలవలు.. వీటి గురించి తెలియని వారుండరు. వీటిలో ఉష్ణగుణం కాస్త ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇవి తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఉలవలను వివిధ పద్ధతుల్లో ఆహారంగా తీసుకోవచ్చు. పొడిలా తయారు చేసి కూడా ఆహారంలో భాగంగా వీటిని తీనవచ్చు. మరి ఉలవల పొడి ఎలా తయారు చూద్దామా..?
కావాల్సినవి
ఉలవలు, నువ్వులు, శొంఠిపొడి, కొబ్బరిపొడి, సోంపు, బెల్లం
తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1 కప్పు ఉలవలు, వేసి వేయించాలి. రెండు స్పూన్లు నువ్వులు, సోంపు వేసి మరోసారి వేయించాలి. తర్వాత మిక్సీజార్లోకి తీసుకుని అరకప్పు బెల్లం, ఒక స్పూన్ శొంఠి పొడి, 2 స్పూన్లు కొబ్బరిపొడి వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకుంటే ఉలవల పొడి రెడీ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: కొబ్బరిపాల పాయసాన్ని ఇలా చేశారంటే.. ఇక వదలరు!