ఆహార అలవాట్లు రోజురోజుకూ మారుతున్నాయి. ఆరోగ్యంగా ఉండేందుకు కూరగాయలతో చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. పిల్లలకు, పెద్దవారికి ఇట్టే జీర్ణం అయ్యే వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటువంటి వాటిలో ప్రధానమైంది కిచిడి. ఎక్కువ కూరగాయులు వేసి చేయడం వల్ల పోషక విలువలు బాగా లభిస్తాయి. అందుకే చాలా మంది గృహిణులు పొద్దున పూట అల్పహారంగా దీనికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే దీనిని చాలా సింపుల్‌గా, తక్కువ సమయంలో ఎలా తయారు చేసుకోవాలో ఓ సారి చూద్దాం.
వెజిటేబుల్ కిచిడి తయారీ విధానం..
ముందుగా ఓ ప్రెషర్ కుక్కర్లో కట్ చేసిన బీన్స్, క్యారెట్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, క్యాబేజీ తురుము, వంకాయ ముక్కలు, ముందుగా ఉడికించిన శనగలు, పెసరపప్పు, నానపెట్టుకున్న బియ్యం, కొత్తిమేర, నీళ్లు, ఉప్పు వేసి మూతపెట్టి 6 నుంచి 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత కుక్కర్లో మూత తీసేసి కొంచెం నీళ్లుపోసి తగినంత ఉప్పు వేసి కలుపుకొని చిన్న మంటలో ఉడికించుకోవాలి. తరువాత ఒక పాన్‌లో నెయ్యి వేడెక్కాక అందులో జీలకర్ర, మిరియాలు, వాము, కరివేపాకు, ఇంగువ, పసుపు, కొంచెం అల్లం, పచ్చిమిర్చి వేసి తాళింపు చేసుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న కిచిడి మిశ్రమంలో తాళింపు వేసి పచ్చి బఠాణీ వేసి ఉడికించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పై నుంచి కొత్తిమేర, నెయ్యితో గార్నిష్ చేసుకుంటే వెజిటేబుల్ కిచిడీ రెడీ..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కావాల్సిన పదార్థాలు...
- పెసరపప్పు
- బీన్స్
- క్యారెట్
- బంగాళాదుంప
- క్యాబేజ్
- వంకాయి
- శనగలు
- బియ్యం
- కొత్తిమేర
- తగినంత ఉప్పు
- నెయ్యి
- కరిపేపాకు
- ఇంగువ
- జీలకర్ర
- వాము
- పుసుపు
ఇదీ చూడండి: కర్ణాటక స్పెషల్ బిసిబెలా బాత్‌ను వండేయండిలా!