ETV Bharat / priya

చవులూరించే 'చందువా'.. చేసుకోండిలా.. - చేపల వంటకాలు

చేపలతో ఎప్పుడూ తినే వంటకాలు బోర్​ కొడుతున్నాయా? ఇంట్లోనే కొత్తగా ఏదైనా చేసుకోవాలనుందా? అయితే.. ఇంకెందుకు ఆలస్యం.. చందువా చేపతో ఘుమఘుమలాడే చేపలకూరను ఇలా వండేయండి..

fish curry recipe
చవులూరించే 'చందువా'- చేసుకోండిలా..
author img

By

Published : Jan 3, 2021, 12:57 PM IST

ఏ కాలంలో తిన్నా శరీరానికి సరిపడా పోషకాలనందిస్తాయి చేపలు. వీటిలో కొవ్వు శాతం తక్కువ కాబట్టి ఎక్కువగా తిన్నా ఇబ్బందులు తక్కువ. అందుకే.. ఈసారి 'చందువా' చేపతో కూర వండి ఆ రుచిని ఆస్వాదించండి.

కావల్సినవి:

చందువా చేప - అరకిలో, ఉల్లిపాయలు - రెండు, అజినోమోటో - చెంచా, ఉప్పు, కారం, - తగినంత, పసుపు - చెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద - యాభై గ్రా, నిమ్మకాయలు - రెండు, కొత్తిమీర - కట్ట, నూనె - తగినంత, కేసరి రంగు - చిటికెడు, గరం మసాలా పొడి - రెండు చెంచాలు, నూనె - వేయించడానికి సరిపడా.

తయారీ:

చేపను బాగా శుభ్రం చేసి ముక్కలుగా కోయాలి. వాటికి ఉప్పు, నిమ్మరసం పట్టించాలి. గంటసేపటి తర్వాత.. బాణలిలో నూనె వేడిచేసి ముక్కల్ని వేయించి పెట్టుకోవాలి. ఉల్లిపాయల్ని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మరో బాణలిలో ఐదుచెంచాల నూనెను వేడిచేసి ఉల్లిపాయ మిశ్రమాన్ని పచ్చివాసన పోయే దాకా వేయించాలి. నూనె పైకి తేలాక అల్లంవెల్లుల్లి ముద్ద చేర్చాలి. రెండు నిమిషాలయ్యాక తగినంత ఉప్పు, కారం, పసుపు, అజినోమోటో, కేసరి రంగు, మసాలాపొడి కలపాలి. ఇప్పుడు కప్పు నీరు, వేయించిన చేపముక్కల్ని చేర్చి మూత పెట్టేయాలి. చేపముక్కలు ఉడికాక.. కొత్తిమీర చల్లి దింపేస్తే చాలు. నోరూరించే చేపకూర సిద్ధం.

ఇదీ చూడండి:ఆహా! అనిపించే 'ఆవిరిపై చేపలకూర'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.