దంపుడు బియ్యంలో పోషకాలు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. వరిపొట్టుకింద ఉండే తవుడు పొరలో విటమిన్లు, ఖనిజాలు దండిగా ఉంటాయి. పాలిష్ పట్టినప్పుడు తవుడుతోపాటు ఇవన్నీ తొలగిపోతాయి. అందుకే తెల్లబియ్యం కన్నా దంపుడు బియ్యం మంచివని.. పరిశోధకులు చాలా కాలంగా చెబుతున్నారు.
వారానికి ఐదు లేదా అంతకంటే ఎక్కువసార్లు తెల్లబియ్యం తీసుకోవటం వల్ల మధుమేహం పెరుగుతున్నట్లు హార్వర్డ్ స్కూల్ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు గుర్తించారు.
దంపుడు బియ్యంతో లాభాలివే..
- తెల్లబియ్యం స్థానంలో 50 గ్రాముల దంపుడు బియ్యాన్ని చేర్చుకుంటే మధుమేహం ముప్పు 16శాతం తగ్గుతుందని పరిశోధనలో తేలింది.
- రక్తపోటు పెరగటానికి దోహదంచేసే సోడియం కూడా దంపుడు బియ్యంలో తక్కువే
- నియాసిన్, విటమిన్-బీ3 పోషకాలు దంపుడు బియ్యంలో ఎక్కువ
- దంపుడు బియ్యంలోని మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుంది. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి తోడ్పడే సెలీనియం కూడా ఈ బియ్యంలో అధికంగా ఉంటుంది.
- వీటిలోని పిండిపదార్థం నెమ్మదిగా జీర్ణం అవుతుంది. అందువల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అంత వేగంగా పెరగవు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: JUNK FOOD: చిరుతిళ్లతో చిన్నారులకు ప్రమాదం.. ఆదర్శంగా 'ఈట్ రైట్' నినాదం