తెరపై మల్టీ స్టారర్ మూవీ చూస్తే ఎంత కిక్కు ఉంటుందో.. కలగలుపు కూరల్లోనూ అంతే. రెండు రుచులు కలగలిసి (goongura matton recipe) సరికొత్త రుచిని చూపిస్తాయి కదా!. మరి మటన్‌లో గోంగూర కలిపి వండితే (special non veg recipes) ఆ మజానే వేరు. అలాగే.. చికెన్‌తో చుక్కకూర కలిపి తింటే ఆ రుచే వేరు. మరి అవి ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా?
మేథీ ముర్గ్
కావాల్సినవి: చికెన్- అరకేజీ, మెంతికూర- మూడు కట్టలు, పసుపు- అర టీస్పూన్, ఉప్పు- సరిపడా, కారం- టేబుల్‌స్పూన్, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి- రెండు, ధనియాలపొడి- టీస్పూన్, తుంచిన కరివేపాకు- రెండు రెమ్మలు, అల్లంవెల్లుల్లి పేస్టు- టేబుల్‌స్పూన్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు- రెండు, చిన్నగా కోసిన టొమాటో- ఒకటి, జీలకర్ర- అరటీస్పూన్, గరంమసాలా పొడి- టీస్పూన్, కసూరీ మేథి- టీస్పూన్, కొత్తిమీర తరుగు- గుప్పెడు.
తోటకూర పచ్చి రొయ్యలు
కావాల్సినవి: రొయ్యలు- అరకేజీ, తోటకూర తరుగు- కప్పు, తరిగిన ఉల్లిపాయ, టొమాటో- ఒక్కోటి చొప్పున, చీల్చిన పచ్చిమిర్చి- నాలుగు,, పసుపు- అర టీస్పూన్, గరంమసాల, ధనియాలు, జీలకర్రపొడి, అల్లంవెల్లుల్లి పేస్టు- టీస్పూన్ చొప్పున, కారం, ఉప్పు- రుచికి సరిపడా, కొత్తిమీర- కొద్దిగా.
తయారీ: పచ్చిరొయ్యలను శుభ్రంగా కడిగి పక్కన (special fish recipe) పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేడిచేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీంట్లో కొంచెం ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించాలి. తర్వాత కొంచెం నీళ్లు పోయాలి. దీంట్లో పసుపు, ధనియాల పొడి, జీలకర్రపొడి, గరంమసాల వేయాలి. ఇప్పుడు రొయ్యలు వేసి (prawns curry) బాగా కలపాలి. చిన్న రొయ్యలను ఎంచుకుంటే రుచిగా ఉంటాయి. రొయ్యలు బాగా ఉడికిన తర్వాత తోటకూర తురుము, ఉప్పు వేసి మూత పెట్టి కాసేపు మగ్గించాలి. ఇలాగే ఎండు రొయ్యలతోనూ వండుకోవచ్చు.
గోంగూర మటన్
కావాల్సినవి: మటన్- అరకేజీ, గోంగూర- మూడు కట్టలు, సన్నగా (goongura mutton recipe) కోసిన ఉల్లిపాయలు- మూడు, అల్లంవెల్లుల్లి పేస్టు- రెండు టీస్పూన్లు, చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు- నాలుగు, పసుపు- పావు టీస్పూన్, గరం మసాలా- టీస్పూన్, ఉప్పు- రుచికి సరిపడా, కారం- రెండు టీస్పూన్లు, ధనియాల పొడి- టీస్పూన్, కొత్తిమీర తరుగు - కొద్దిగా.