ETV Bharat / priya

Health tip: వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోండి.. వ్యాధి నిరోధక శక్తి పెంచుకోండి! - health tips in telugu

చిన్న సమస్య వస్తే చాలు యాంటీ బయోటిక్స్‌ వేసుకుంటారు చాలామంది. కానీ వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకుంటే.. వ్యాధి నిరోధక శక్తి మెరుగవుతుంది. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. అవేంటో చూద్దాం.

వెల్లుల్లితో ఆరోగ్యం
వెల్లుల్లితో ఆరోగ్యం
author img

By

Published : Jun 1, 2021, 11:20 AM IST

జలుబు, శ్వాస సమస్యలతో బాధపడేవారు వెల్లుల్లిని తీసుకోవడం మేలు. వెల్లుల్లిలో ఉండే ‘అల్లిసిన్‌’ అనే అమైనో యాసిడ్‌కి ఔషధ గుణాలు ఎక్కువ. ఆస్తమా బాధితులు వెల్లుల్లి రెబ్బలను ఉడికించి పాలతో కలిపి తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
* ఈ కాలంలో ఆహార పదార్థాలు వేగంగా జీర్ణమవ్వడానికి, జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడానికి వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లిలో ఉండే విటమిన్‌ సి, సెలీనియం, క్వర్సెటైన్‌ వ్యాధినిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.
* ఒత్తిడితో బాధపడేవారు ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకుంటే మేలు. రక్తనాళాల పని తీరును మెరుగు పరిచే శక్తి వెల్లుల్లికి ఉంది. అధికరక్తపోటుని నియంత్రణలో ఉంచుతుంది. దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్స్‌ వంటి వాటి నుంచి తప్పించుకోవచ్చు.

ఇదీ చూడండి: ఇంట్లోని వస్తువులతోనే ఒంటికి సొబగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.