ఉపవాసం చేస్తున్నారా..? అయితే ఈ పోషకాలు తీసుకోండి..! - మహాశివరాత్రి
మహాశివరాత్రి రోజున... ఉపవాసం ఉండి, జాగారం చేసే భక్తులు పాలూ, పండ్లూ తీసుకోవడం తెలిసిందే. కానీ రోజంతా వాటితోనే ఉండలేనివారు ఇలాంటి పదార్థాలను ఎంచుకుంటే... అవసరమైన పోషకాలతోపాటూ శక్తి కూడా అందుతుంది. అవేంటో మీరూ ట్రై చేయండి...
food items which should take after fast
By
Published : Mar 11, 2021, 11:02 AM IST
పైనాపిల్ మిల్క్‌షేక్
పైనాపిల్ మిల్క్‌షేక్
కావలసినవి: పైనాపిల్ ముక్కలు: రెండు కప్పులు, చల్లని పాలు: ఒకటింబావుకప్పు, చక్కెర: మూడు టేబుల్‌స్పూన్లు, జీడిపప్పు పలుకులు: పావుకప్పు (ముందుగా నానబెట్టుకోవాలి), యాలకులపొడి: అరచెంచా, డ్రైఫ్రూట్స్ పలుకులు: కొన్ని. తయారీ విధానం: డ్రైఫ్రూట్స్ పలుకులు తప్ప మిగిలిన పదార్థాలన్నీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మిల్క్‌షేక్‌ని గ్లాసుల్లో పోశాక డ్రైఫ్రూట్స్ పలుకుల్ని అలంకరిస్తే సరి.
సగ్గుబియ్యంభేల్
సగ్గుబియ్యంభేల్
కావలసినవి: సగ్గుబియ్యం: అరకప్పు (నాలుగైదు గంటల ముందు నానబెట్టుకోవాలి), ఉడికించిన బంగాళాదుంప: ఒకటి, కారం: చిటికెడు, పల్లీలు: టేబుల్‌స్పూను, జీడిపప్పు పలుకులు: కొన్ని, కొత్తిమీర తరుగు: టేబుల్‌స్పూను, చాట్‌మసాలా: అరచెంచా, నూనె: రెండు చెంచాలు, నిమ్మరసం: చెంచా, ఉప్పు: తగినంత. తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి సగ్గుబియ్యాన్ని వేయించి... చాలా కొద్దిగా నీళ్లు చల్లి స్టౌని సిమ్‌లో పెట్టాలి. సగ్గుబియ్యం మెత్తగా అయ్యాక ఉడికించిన బంగాళాదుంప ముక్కలతోపాటూ మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలిపి నిమిషం తరువాత దింపేయాలి.
పల్లీ-కొబ్బరి చాట్
పల్లీ-కొబ్బరి చాట్
కావలసినవి: నానబెట్టి ఉడికించిన పల్లీలు: కప్పు, కొబ్బరి తురుము: అరకప్పు, కీరా తరుగు: పావుకప్పు, కరివేపాకు రెబ్బలు: రెండు, నిమ్మరసం: చెంచా, ఆవాలు: అరచెంచా, మినప్పప్పు: చెంచా, ఉప్పు: తగినంత, జీలకర్రపొడి: అరచెంచా, కొత్తిమీర తరుగు: కొద్దిగా, కారం: చిటికెడు. తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేయించి... ఉడికించిన పల్లీలు వేయాలి. అయిదు నిమిషాలయ్యాక తగినంత ఉప్పు, కొబ్బరి తురుము, జీలకర్రపొడి వేసి కలిపి దింపేసి మిగిలిన పదార్థాలు వేసి ఓసారి కలిపితే చాట్ తయారైనట్లే.
ఖర్జూర శ్రీఖండ్
ఖర్జూర శ్రీఖండ్
కావలసినవి నీళ్లు పూర్తిగా వడకట్టిన గట్టి పెరుగు: అరకప్పు, గింజల్లేని ఖర్జూరాలు: పన్నెండు, బాదంపలుకులు: కొన్ని, గోరువెచ్చని పాలు: పావుకప్పు, బెల్లం తరుగు: టేబుల్‌స్పూను. తయారీ విధానం: పాలల్లో ముప్పావు వుంతు ఖర్జూరాలను నానబెట్టుకుని అరగంటయ్యాక మిక్సీలో వేసి పాలతో సహా మెత్తని గుజ్జులా చేసుకోవాలి. పెరుగులో ఈ మిశ్రమంతోపాటూ, బెల్లం తరుగు కూడా వేసి గిలకొట్టినట్లుగా కలిపి రెండుగంటలపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. తినేముందు మిగిలిన ఖర్జూర ముక్కలు, బాదంపలుకుల్ని అలంకరించాలి.
కొబ్బరి పాయసం
కొబ్బరి పాయసం
కావలసినవి: కొబ్బరి తురుము: కప్పు, బెల్లం తరుగు: అరకప్పు, పాలు: నాలుగుకప్పులు, డ్రైఫ్రూట్ పలుకులు: కొన్ని, యాలకులపొడి: చెంచా, కుంకుమపువ్వు రేకలు: అలంకరణకోసం. తయారీ విధానం: ముందుగా పావుకప్పు నీళ్లు, బెల్లం తరుగు ఓ గిన్నెలో వేసి స్టౌమీద పెట్టాలి. బెల్లం కరిగి పాకంలా అవుతున్నప్పుడు దింపేయాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నెలో పాలు పోసి స్టౌమీద పెట్టాలి. అవి మరుగుతున్నప్పుడు కొబ్బరి తురుము వేసి స్టౌని సిమ్‌లో పెట్టాలి. ఇది చిక్కగా అవుతున్నప్పుడు డ్రైఫ్రూట్స్ పలుకులూ, యాలకుల పొడి వేసి దింపేయాలి. పాయసం వేడి తగ్గాక బెల్లం, కుంకుమపువ్వు పాకం వేసి బాగా కలిపితే సరిపోతుంది.