రోజూ తీసుకునే ఉపాహారాలకు బదులు బాదంను తింటే గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ముఖ్యంగా మానసిక ఆందోళనకు గురైనప్పుడు గుండె వేగ వ్యత్యాసం (హెచ్‌ఆర్‌వీ) పడిపోవడాన్ని ఇది నిరోధిస్తుందని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ జర్నల్ ఓ అధ్యయనాన్ని ప్రచురించింది.
గుండెలో రెండు వరుస చప్పుళ్ల మధ్య వ్యవధినే హెచ్‌ఆర్‌వీ అంటారు. మనం తీసుకునే ఆహారం, శారీరక వ్యాయామమే హెచ్‌ఆర్‌వీని నిర్ధరిస్తాయి. ఎక్కువ హెచ్‌ఆర్‌వీ ఉంటే మానసిక, పరిసర సవాళ్లను గుండె సమర్థంగా ఎదుర్కొంటుంది. తక్కువ ఉంటే గుండె నాళాలు ఒత్తిడిని ఎదుర్కొంటాయి. ఆరువారాల పాటు బాదంను ఉపాహారంగా తీసుకుంటే మంచి ఫలితాలు వచ్చాయని... దీన్ని తీసుకున్న వారిలో హృదయ స్పందనలు బాగున్నాయని అధ్యయనాన్ని ప్రచురించిన లండన్ కింగ్స్ కాలేజ్ పరిశోధనకర్త వెండీ హాల్ చెప్పారు.
ఇదీ చూడండి: పోషకాలే మన అభివృద్ధికి సోపానాలు!