ETV Bharat / priya

రొయ్యలతో వెరైటీగా ఇలా చేస్తే.. టేస్ట్​ అదిరిపోతుంది!

author img

By

Published : Aug 27, 2021, 9:37 AM IST

రొయ్యలతో కాస్త వినూత్న వంటకం ఏమైనా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఈ రెసీపీ చేసేయండి.

dosakaya prawns curry telugu
దోసకాయ రొయ్యల కూర

ఎప్పుడు చికెన్, మటన్, ఫిష్ తినడమే కాదు అప్పుడప్పుడు రొయ్యలతోనూ వెరైటీలు ప్రయత్నించి చూడండి. దోసకాయతో దీని కాంబినేషన్​ను ట్రై చేసేయండి. అలా చేసిన వంటకమే ఇది. ఇంకెందుకు ఆలస్యం గెట్ రెడీ..

కావాల్సిన పదార్థాలు

రొయ్యలు, దోసకాయ, దోసకాయ గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ధనియా-జీలకర్ర పొడి, గరం మసాలా, జీడిపప్పు, కొత్తిమీర

తయారీ విధానం

ముందు స్టవ్​ వెలిగించి, ఓ కడాయి పెట్టి అందులో నూనె పోసుకోవాలి. కొంచెం సేపు తర్వాత ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత రొయ్యలు వేసి బాగా కలపాలి. కొద్దిసేపటి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలపి, 5 నిమిషాల పాటు మూతపెట్టి మగ్గనివ్వాలి.

ఆ తర్వాత కొంతసేపటికి దోసకాయ ముక్కలు, టమాట ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అనంతరం ఉప్పు, పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి. కాస్త నీరు, జీడిపప్పు-దోస గింజల పేస్ట్ కలుపుకొని మూతపెట్టి బాగా మగ్గనివ్వాలి. చివరగా కొత్తిమీర వేసి బౌల్​లోకి తీసుకుంటే సరి. ఎంతో రుచికరమైన 'దోసకాయ రొయ్యల కూర' రెడీ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.