ETV Bharat / priya

బేకింగ్​ పౌడర్​ Vs బేకింగ్​ సోడా - ఈ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసా? - బేకింగ్​ పౌడర్​ బేకింగ్​ సోడా తేడా

Differences of Baking Powder and Baking Soda: బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్​.. ఈ రెండిటినీ వంటలలో వాడుతుంటారు. అయితే.. చాలా మంది ఈ రెండూ ఒకటే అనుకుంటారు. కానీ.. నిజానికి ఈ రెండు వేర్వేరు పదార్ధాలు! మరి.. వీటి మధ్య ఉన్న తేడాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.

Differences of Baking Powder and Baking Soda
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2024, 1:37 PM IST

Baking Powder Vs Baking Soda: "ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు.. చూడ చూడ రుచుల జాడ వేరు" అన్నాడు వేమన. అంటే.. ఉప్పు, కర్పూరం చూడటానికి ఒకేలా ఉంటాయనీ.. కానీ వాటి మధ్య తేడా ఏంటన్నది టేస్ట్ చేస్తేనే తెలుస్తుందని అర్థం. అదేవిధంగా.. బేకింగ్​ సోడా, బేకింగ్​ పౌడర్​ మధ్య కూడా ఇలాంటి తేడానే ఉంటుంది. ఇవి రెండూ చూడటానికి ఒకే విధంగా ఉంటాయి. కానీ.. అవి జరిపే రసాయన చర్యలు మాత్రం వేరు. అంతేకాకుండా రుచులు కూడా వేరే. మరి ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

ఉపవాసంతో ముసలితనం వెనకడుగు - ఈ లింక్ మీకు తెలుసా!

బేకింగ్ సోడా: బేకింగ్ సోడాను సోడియం బైకార్బోనేట్ లేదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని అంటారు. అలాగే.. దీనిని సోడా, తినే సోడా, వంట సోడా, బేకింగ్ సోడా అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. సోడియం బైకార్బోనేట్ అనేది ఆల్కలీన్ ఉప్పు. ఇది కార్బన్ డయాక్సైడ్ వాయువును విడుదల చేయడానికి ఆమ్లాలతో చర్య జరుపుతుంది. కేకుల్లాంటివి స్పాంజీలా ఉండటానికి బేకింగ్‌ సోడా ఉపయోగపడుతుంది. దుస్తుల్ని శుభ్రం చేసే సోడియం కార్బొనేట్‌లోని కార్బాక్జిలిక్‌ ఆమ్ల అయానుకు ఒక హైడ్రోజన్‌ కలిస్తే ఏర్పడే పదార్థాన్ని సోడియం హైడ్రోజన్‌ కార్బొనేట్‌ అంటారు.

బ్రేక్​ ఫాస్ట్​కు సరైన ముహూర్తం ఇదే - దాటితే గుండెపోటు గండం!

నీటిలో కరిగిన సోడియం కార్బొనేటుకి ఎక్కువ మోతాదులో కార్బన్‌డయాక్సైడును పంపడం ద్వారాగానీ.. సోడియం హైడ్రాక్సైడ్​ ద్రావణంలోకి కార్బన్‌డయాక్సైడును పంపడం ద్వారాగానీ.. సోడియం బైకార్బొనేట్‌ (బేకింగ్‌ సోడా)ను తయారు చేస్తారు. రొట్టెలు, అప్పడాలు, కేకులు, బిస్కెట్ల తయారీకి వాడే పిండిలో బేకింగ్‌సోడాను కలుపుతారు. అప్పుడు అక్కడున్న కొన్ని ఆమ్ల లక్షణ పదార్థాలతో బేకింగ్‌ సోడా రసాయనిక చర్య జరుపుతుంది. దీంతో కార్బన్‌ డయాక్సైడ్‌ వాయువు మెల్లమెల్లగా విడుదల అవుతుంది. ఈ వాయు బుడగలు సన్నసన్నగా పిండిలోకి విస్తరించడం వల్ల ఆహార పదార్థాలు పొంగుతాయి. స్పాంజీలాగా మెత్తగా అవుతాయి. బేకింగ్ సోడాను చల్లని ప్రదేశంలో నిల్వ చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.

గోళ్లు అందంగా లేవా? - ఈ బెస్ట్ టిప్స్ మీకోసమే!

బేకింగ్ పౌడర్: సాధారణంగా ఇది ఒక రకమైన యాసిడ్. బేకింగ్ పౌడర్ అనేది మొక్కజొన్న పిండి, బేకింగ్ సోడా కలయిక వలన వచ్చే మిశ్రమం. బేకింగ్ పౌడర్​ను డైరెక్ట్ గానే ఉపయోగించవచ్చు. నిజానికి బేకింగ్ పౌడర్ కంటే బేకింగ్ సోడానే నాలుగు రెట్లు శక్తివంతమైనది. మీరు 1 టీస్పూన్ బేకింగ్ పౌడర్ ఉపయోగిస్తే.. పావు టీస్పూన్ మాత్రమే బేకింగ్ సోడాను ఉపయోగించాలి. బేకింగ్ పౌడర్ తేమను తాకిన వెంటనే రియాక్షన్ చూపిస్తుంది. బేకింగ్ పౌడర్ 3 నెలల నుంచి ఒక సంవత్సరం వరకు మాత్రమే నిల్వ ఉంటుంది.

రోజూ ఈ వ్యాయామాలు చేస్తే - మీ బ్రెయిన్ పవర్ ఓ రేంజ్​లో పెరుగుతుంది!

డైలీ ఈ పొరపాట్లు చేస్తున్నారా? - అయితే మీ చర్మం దెబ్బతినడం ఖాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.