ETV Bharat / priya

ఘుమఘుమలాడే 'సుర్మయి ఓమండ్‌' సింపుల్​ రెసిపీ

చేపల వేపుడు, చేపల పులుసు... అనగానే చాలామందికి నోట్లో నీళ్లూరతాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలనిచ్చే చేపతో కొత్తగా ట్రై చేయాలనుందా? అయితే.. సింపుల్​గా 'సుర్మయి ఓమండ్​'ను చేసుకోండి ఇలా..

author img

By

Published : Nov 28, 2020, 2:40 PM IST

Updated : Nov 28, 2020, 7:44 PM IST

COOKING SURMAI OMANDS WITH FISH
సుర్మయి ఓమండ్‌

శరీరానికి మంచి పోషకాలనిచ్చే చేపలతో ఎప్పుడూ తినే వంటకాలే కాకుండా కొత్తగా చేయాలనుందా? అయితే.. 'సుర్మయి ఓమండ్​'ను సింపుల్​ రెసిపీను చేసుకోండిలా..

కావాల్సినవి:

  • పెద్ద చేప ముక్కలు - ఎనిమిది
  • తాజా కొబ్బరి తురుము - ముప్పావుకప్పు
  • ఉల్లిపాయలు - రెండు(తరిగినవి)
  • పచ్చిమిర్చి -మూడు
  • అల్లం - పెద్ద ముక్క(తరిగినది)
  • వెలుల్లి - ఎనిమిది రెబ్బలు
  • ఎండుమిర్చి - నాలుగు(నీళ్లల్లో నానబెట్టినవి)
  • మిరియాలు - చెంచా
  • ధనియాలు - ఒకటిన్నర చెంచా
  • పసుపు - అరచెంచా
  • నెయ్యి - చెంచా
  • ఆవాలు - చెంచా
  • ఉప్పు - తగినంత
  • నూనె - రెండు టేబుల్‌స్పూన్లు

తయారీ విధానం:

చేపముక్కల్ని శుభ్రంగా కడిగి వాటికి పసుపు, ఉప్పు పట్టించి పక్కన పెట్టేయాలి. కొబ్బరితురుము, నానబెట్టిన ఎండుమిర్చి, మిరియాలు, ధనియాలు, అల్లం, వెల్లుల్లి ముక్కలు మిక్సీలో తీసుకుని మెత్తని పేస్టులా చేసుకుని పెట్టుకోవాలి. బాణలిలో నెయ్యిని కరిగించి ఆవాలు వేయించుకోవాలి. అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయముక్కలు వేయాలి. అవి వేగాక ముందుగా చేసుకున్న మసాలా పేస్టూ, నూనె వేసి మంట తగ్గించాలి. మసాలా వేగి నూనె పైకి తేలుతున్నప్పుడు కాసిని నీళ్లు, చేపముక్కలు వేసి మూత పెట్టేయాలి. కాసేపటికి చేపముక్కలు ఉడికి కూర సిద్ధమవుతుంది. అప్పుడు దింపేసి అన్నంతో కలిపి వడ్డించాలి.

ఇదీ చదవండి: నోరూరించే 'మసాలా చేప కూర'- చేసుకోండి ఇలా..

Last Updated : Nov 28, 2020, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.