ETV Bharat / priya

చాక్లెట్ సమోసా.. రుచి చూస్తే వారెవ్వా! - చాక్లెట్ సమోసా తయారీ విధానం

సమోసా అంటే కొందరికి మహా ఇష్టం. ఉల్లిపాయ సమోసా, ఆలు సమోసాలు మనం చాలాసార్లు తినుంటాం. మరి చాక్లెట్ సమోసా(chocolate samosa recipe) ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే ఇలా చేసుకోండి.

chocolate samosa
చాక్లెట్ సమోసా
author img

By

Published : Oct 14, 2021, 7:03 AM IST

కావాల్సినవి: బయటి పిండి కోసం.. మైదా- కిలో, నెయ్యి- 35 గ్రా., యాలకులు- ఐదు.

ఫిల్లింగ్‌ కోసం.. చాక్లెట్‌- 500 గ్రా., బాదం, జీడిపప్పు- 250 గ్రా. చొప్పున, పిస్తా- 100 గ్రా., పంచదార- కేజీ, నూనె- వేయించడానికి సరిపడా.

తయారీ విధానం

మైదాలో నెయ్యి, యాలకుల పొడి వేసి నెయ్యి పిండికి పట్టేలా బాగా కలపాలి. నెమ్మదిగా కొన్ని కొన్ని నీళ్లు పోస్తూ పిండిని తడపాలి. ఆ తర్వాత ఇరవై నిమిషాలు నానబెట్టాలి.

సమోసా లోపల పెట్టడానికి చాక్లెట్‌ని డబుల్‌ బాయిలర్‌.. అంటే చాక్లెట్‌ని గిన్నెలో ఉంచి దాన్ని మరుగుతున్న నీళ్లున్న మరో గిన్నెలో ఉంచి, చాక్లెట్‌ని కరిగించుకోవాలి. దీనికి పంచదార జత చేయాలి. తీపి ఎక్కువగా ఉండే చాక్లెట్‌ వాడితే చక్కెర తక్కువగా వాడుకోవాలి. కరిగిన చాక్లెట్‌లో సన్నగా తరిగిన బాదం, జీడిపప్పు, పిస్తా కలపాలి.

తడిపిన పిండిని చిన్న ఉండల్లా చేసుకుని గుండ్రంగా ఒత్తుకోవాలి. ఇలా చేసిన గుండ్రటి చపాతీని రెండుగా కోసుకోవాలి. ప్రతి సగం ముక్కను కోన్‌ ఆకారంలో మడుచుకోవాలి. రెండు అంచులను నీళ్లతో అతికించుకుని కోన్‌ తయారుచేసుకోవాలి. ఈ కోన్‌లో చాక్లెట్‌ మిశ్రమాన్ని వేసి అంచులను నీళ్లతో అతికించుకోవాలి.

యాలకులను పొడి చేయకుండా విత్తనాలను సమోసా పిండిలో కూడా కలపొచ్చు. సమోసాకీ ప్రత్యేకమైన రుచి వస్తుంది. వీటిని నూనెలో గోల్డెన్‌ బ్రౌన్‌ రంగు వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి. ముందు మంటను మధ్యస్థంగా పెట్టి తర్వాత పెద్ద మంట మీద వేయించుకుంటే సమోసా క్రిస్పీగా వస్తుంది. చివరగా టిష్యూపేపర్‌పై ఫ్రై చేసిన సమోసాల(chocolate samosa recipe)ను వేసి సర్వ్‌ చేసుకుంటే సరి.

ఇవీ చూడండి: రుచి రుచిగా.. తియ్య తియ్యగా.. స్వీట్​ సమోసా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.