ETV Bharat / priya

Chicken recipes: పసందైన చికెన్​ మిరియాల రసం

అసలే వర్షాకాలం. చినుకులు పడుతూ, చలిగా ఉంటే లేవడానికే బెడ్​పై నుంచే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అందుకే కొంచెం ఎక్కుసేపు పడుకుంటాం. అలాంటప్పుడు వంట చేయడానికి కూడా బద్ధకంగా ఉంటుంది. అలాంటప్పుడే క్షణాల్లో తయారు చేసే రెసిపీ ఇది. ఇంతకీ దీని తయారీ ఎలా అంటే?

Chicken Miriyala rasam recipe
చికెన్​ మిరియాల రసం
author img

By

Published : Sep 22, 2021, 4:00 PM IST

రసం అనేది సాధారణంగా మిరియాలు, చింతపండుతో చేస్తారు. కానీ చికెన్​తో చేయడంలోనే అసలు మజా ఉంది. అన్ని రకాల వయసుల వారికి వ్యాధి నిరోధక శక్తిని పెంచే రెసిపీ రసం! కానీ కొంతమందికి నచ్చదు. అలాంటి వారికి కొత్తగా నాన్​వెజ్​తో రసం చేస్తే ఇష్టంగా తింటారు. కొద్దిగా వెరైటీగా చేయాలి అనుకున్న వారు చికెన్​తో చేస్తారు. దానిని తయారీ విధానం ఎలానో ఓసారి చూద్దాం.

కావాల్సిన పదార్థాలు

  • చికెన్​ బోన్​లెస్​ ముక్కలు 10 గ్రాములు
  • చిన్నగా తరిగిన ఉల్లిపాయలు పావు కప్పు
  • టమాటా గుజ్జు సగం కప్పు
  • పసుపు పావు స్పూన్​
  • కారం సగం స్పూన్​
  • ఉప్పు సరిపడా
  • చిన్నగా తరిగిన అల్లం ఒక స్పూన్​
  • చిన్నగా తరిగిన వెల్లుల్లి ఒక స్పూన్​
  • కరివేపాకు కొద్దిగా
  • పచ్చిమిర్చి ఒక స్పూన్​
  • లెమన్​ జ్యూస్​ సగం స్పూన్​
  • కొత్తిమేర పావు కప్పు
  • చింతపండు రసం పావు కప్పు
  • మిరియాల పొడి సగం స్పూన్​

తయారీ విధానం

ముందుగా స్టౌవ్​ వెలిగించి బాండిల్​ మీద వేడి చేసిన తర్వాత తగినంత నూనెను అందులో వేసుకోవాలి. వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేగిన అనంతరం కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కారం వేసి కలుపుకోవాలి. కొద్దిసేపటికి చికెన్​ను అందులో వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత మిరియాల పొడి, టమాటా గుజ్జు, చింతపండు రసం, నిమ్మరసం, ఉప్పు, తగినంత నీళ్లు పోసి మూత పెట్టాలి. సుమారు 30 నిమిషాల తర్వాత స్టౌవ్​ ఆఫ్​ చేసుకుంటే.. ఎంతో రుచికరమైన చికెన్​ మిరియాల రసం రెడీ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: నెల్లూరు చేపల పులుసు.. తిన్నారంటే అదుర్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.