చికెన్‌ను ఫ్రై, పులుసు, కబాబ్, బొంగులో పెట్టి.. ఇలా చాలా రకాలుగా వండుతుంటారు. మరి చల్ల మిరపకాయలతో కలిపి కోడి వేపుడు తయారు చేసుకోవచ్చని తెలుసా? ఒకవేళ చేయకపోతే ఈ రెసిపీ మీకోసం. ఎప్పుడూ ఒకేలా కాకుండా కాస్త వెరైటీగా ప్రయత్నించాలనుకున్నా సరే దీనిని ట్రై చేయొచ్చు.
కావాల్సిన పదార్థాలు..
చల్ల మిరపకాయలు, చల్ల మిరపకాయల పొడి, ఉడికించిన చికెన్, ఉల్లిపాయ ముక్కలు, నూనె, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, ధనియా-జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, నిమ్మకాయ, పచ్చిమిర్చి ముక్కలు, పెరుగు.
తయారీ విధానం..
ముందుగా మిక్సింగ్ బౌల్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చల్ల మిరపకాయల పొడి, ఉడికించిన చికెన్, పెరుగు వేసి బాగా కలపి పెట్టుకోవాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో నూనె పోయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులో చల్ల మిరపకాయలు వేయించి ఒక ప్లేటులోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కొంచెం వేగిన వెంటనే మనం ముందుగా ఉడికించిన రెడీగా కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని అందులో వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత అందులో ధనియా, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. చికెన్ ముక్కలకు మసాలా బాగా పట్టేలాగా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అందులో ఒక నిమ్మకాయ పిండి ఆ మొత్తం కర్రీని ఒక ప్లేటులోకి తీసుకుని, దానిపై చల్ల మిరపకాయలను గార్నిస్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన చల్ల మిరపకాయ కోడి వేపుడు రెడీ!
ఇదీ చదవండి: వెల్లుల్లి వంకాయ పులుసు చేసుకోండిలా!