క్యాప్సికంలో ఎన్నో పోషకాలుంటాయి. క్యాన్సర్ ముప్పును తగ్గించడంలో, గుండె ఆరోగ్యానికి క్యాప్సికం చాలా మంచింది. అలాంటి క్యాప్సికంతో అనేక వెరైటీలను చేయొచ్చు. ఇప్పుడు కొంచెం వెరైటీగా ఉండే క్యాప్సికం పల్లీ వేపుడు ఎలా చేయాలో చూసేయండి.
కావాల్సిన పదార్థాలు..
క్యాప్సికం ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు -1కప్పు, పచ్చి శెనగపప్పు- 1కప్పు, జీలకర్ర -1టీ స్పూన్, పల్లీలు -1కప్పు, నువ్వులు- 3 టీస్పూన్లు, కారం- 1టీస్పూన్, ధనియాల పొడి- 1టీస్పూన్, కొబ్బరి పొడి- 2టీ స్పూన్లు, ఉప్పు- తగినంత, నూనె- 1కప్పు
తయారీ విధానం..
ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో పచ్చి శెనగపప్పు, పల్లీలు, నువ్వులు వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సి పట్టి పక్కనపెట్టుకోవాలి. అదే ప్యాన్లో నూనె వేసి నూనె వేడెక్కాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి కాస్త వేయించి.. ముందుగా మిక్సి పట్టుకున్న పల్లీల పౌడర్ వేసి, తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత కొబ్బరి పొడి కూడా వేసి రెండు నిమిషాల పాటు వేయించి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని.. సర్వ్ చేసుకుంటే క్యాప్సికం పల్లీ వేపుడు రెడీ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: చిల్లీ పన్నీర్.. సాయంత్రం వేళ గరంగరంగా!