ETV Bharat / priya

'అరటికాయ క్యారెట్‌ గారెలు' సింపుల్​ రెసిపీ! - carrod vad recipe in telugu

ఎంత తిన్నా తనివితీరనివే గారెలు. అలా అని అదేపనిగా గారెలు తింటే బరువు పెరిగిపోతాం. అందుకే, గారెలను కాస్త హెల్దీగా మార్చేందుకు ఈ అరటికాయ క్యారెట్​ గారెల రెసిపీ మీకోసం తెచ్చేశాం. మరింకెందుకు ఆలస్యం ఈ ఆరోగ్యకరమైన గారెలను సులభంగా ఎలా చేయాలో చూసేద్దాం రండి..

aratikaya carrot gaarelu recipe in telugu
'అరటికాయ క్యారెట్‌ గారెలు' సింపుల్​ రెసిపీ!
author img

By

Published : Jul 17, 2020, 1:00 PM IST

అరటికాయ , క్యారెట్​ రెండింటిలోనూ నిండుగా పోషకాలుంటాయి. కానీ, వాటిని నేరుగా తినడానికి పిల్లలు అట్టే ఇష్టపడరు...అందుకే, ఈ సారి ఇలా అరటికాయ క్యారెట్ గారెలు చేసి పెట్టండి.

aratikaya carrot gaarelu recipe in telugu
'అరటికాయ క్యారెట్‌ గారెలు' సింపుల్​ రెసిపీ!

కావాల్సినవి

  • తొక్కతో కలిపి ఉడికించిన కూర అరటికాయ - ఒకటి,
  • బియ్యప్పిండి - కప్పు,
  • క్యారెట్‌ తురుము - కప్పు,
  • ఉల్లిపాయ - ఒకటి,
  • వెల్లుల్లి రెబ్బలు - పది,
  • పచ్చిమిర్చి - ఐదు,
  • కొత్తిమీర తురుము: అరకప్పు,
  • ఉప్పు - తగినంత,
  • జీలకర్ర - చెంచా,
  • నూనె - వేయించడానికి సరిపడా.

తయారుచేసే విధానం

  • ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా ఉప్పును మిక్సీలో వేసి పేస్టు సిద్ధం చేసుకోవాలి.
  • తర్వాత ఓ గిన్నెలో ఉడికించిన అరటికాయను తొక్క తీసి ముక్కలుగా కోసుకుని మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో క్యారెట్‌ తురుము, తగినంత బియ్యప్పిండి వేసుకుని కలుపుకోవాలి.
  • ఈ మిశ్రమంలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్టుతో పాటు తగినంత ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు వేసి గారెల పిండిలా కలుపుకోవాలి.
  • ఈ మిశ్రమాన్ని గారెల్లా వత్తి కాగిన నూనెలో వేయించి తీస్తే రుచికరమైన అరటికాయ క్యారెట్‌ గారెలు సిద్ధం.

ఇదీ చదవండి: 'క్యారెట్​ కేక్​' తింటే 'క్యా బాత్​ హై' అనాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.