ETV Bharat / opinion

కాగితాల్లోనే ఆదివాసీల హక్కులు- సంక్షేమ ఫలాలు అందేదెన్నడో!

సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే విలువైన అటవీ, ఖనిజ సంపద ఎక్కువగా ఆదివాసీ ప్రాంతాల్లోనే ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఆ వనరులే వారికి శాపంగా మారాయి. వాటి కోసం ఎన్నో బయటి శక్తులు విపరీతమైన ఆసక్తి కనబరుస్తున్నాయి. కానీ వారికి సంక్షేమ ఫలాలను అందిచడంలో, వారి హక్కులను కాపాడటంలో అంతులేని నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీల స్థితిగతులపై ప్రత్యక కథనం.

World Tribal Day
ఆదివాసీ
author img

By

Published : Aug 9, 2021, 8:10 AM IST

ప్రపంచ దేశాల్లోని ఆదివాసులు ఆధునిక సాంకేతిక యుగంలోనూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే విలువైన అటవీ, జల, ఖనిజ వనరులు ఆదివాసీ ప్రాంతాల్లోనే ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఆ వనరులే వారికి శాపంగా మారాయి. వాటి వినియోగంపై ఎన్నో బయటి శక్తులు, వ్యవస్థలు విపరీతమైన శ్రద్ధ చూపుతున్నాయి. ఆదివాసీ సమూహాల హక్కులను గౌరవించి, సంక్షేమ ఫలాలను అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతుండటం విచారకరం. ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో 40 కోట్లకుపైగా ఆదివాసుల జనాభా ఉంది. ఏడు వేలకు పైగా భాషలు, అయిదు వేలకు పైగా సంస్కృతులతో ఆదివాసీ ప్రాంతాలు ప్రత్యేక విశిష్టతను కలిగి ఉన్నాయి. 1994లో ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ ఆదివాసుల హక్కుల కల్పన కోసం సమగ్ర ఒడంబడికపై ప్రపంచ దేశాలు సంతకం చేశాయి. అప్పటి నుంచి ఆగస్టు తొమ్మిదో తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. భారత్‌లోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల దినోత్సవాన్ని ఘనంగానే నిర్వహిస్తున్నాయి. అయితే మన రాజ్యాంగం గిరిజనులకోసం రూపొందించిన చట్టాల అమలులో అంతులేని నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది.

రాజ్యాంగ హక్కులకు తూట్లు

భిన్న సంస్కృతులు, జీవన వైవిధ్యాలున్న భారత్‌ లాంటి దేశాల్లో ఆదివాసులు మరింత సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. భారత్‌లో 10.42 కోట్ల మంది ఆదివాసులు (జనాభాలో 8.6శాతం) ఉన్నారు. మొత్తం 461 రకాల తెగలు ఉండగా- ఇందులో 90శాతం అటవీ ప్రాంతాల్లో వ్యవసాయం, వేట, అటవీ ఉత్పత్తులపై ఆధారపడే జీవిస్తున్నారు. మన దేశంలో ఆదివాసీ ప్రాంతాల పరిపాలన, సంక్షేమంపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపేందుకు వీలుగా రాజ్యాంగంలోని అయిదు, ఆరు షెడ్యూళ్లను తీర్చిదిద్దారు. ఆరో షెడ్యూలులో ఈశాన్య రాష్ట్రాల గిరిజన ప్రాంతాలను, అయిదో షెడ్యూలు పరిధిలోకి పది రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలను చేర్చారు. బయటివాళ్లు వనరుల దోపిడికి పాల్పడకుండా అయిదో షెడ్యూల్‌లో నిబంధనలు విధించారు. దీని ప్రకారం గిరిజన ఎమ్మెల్యేలతో కూడిన గిరిజన సలహా మండళ్లకు విశేషమైన హక్కులు ఉంటాయి. దేశవ్యాప్తంగా అధికశాతం గిరిజన కుటుంబాలు ఉండి అయిదో షెడ్యూల్‌ ప్రాంతంగా గుర్తింపు పొందని వేలాది గ్రామాలు నేడు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ నిధులు గానీ, రాజ్యాంగ హక్కులు గానీ దక్కని ఈ గ్రామాల గిరిజనులను పాలనా వ్యవస్థలు సైతం పట్టించుకోవడంలేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ తరహా గ్రామాలు 800 వరకు ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతాల్లో వనరుల దోపిడి నియంత్రణ, సంక్షేమం కోసం సలహా మండళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతున్న తీర్మానాలు తగిన రీతిలో ఆదరణకు నోచుకోవడంలేదు. గిరిజనుల సాగులో ఉన్న అటవీ భూముల హక్కుల విషయంలో చారిత్రక తప్పిదాలను సరిదిద్దే పేరుతో 'అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006' రూపుదిద్దుకుంది. ఆదివాసీ గ్రామసభలకు స్వీయపరిపాలన హక్కులు కల్పించే పంచాయతీ రాజ్‌ షెడ్యూలు ప్రాంతాల విస్తరణ చట్టం(పెసా)-1996నూ అమలులోకి తెచ్చారు. దశాబ్దాలు దాటుతున్నా, వాటిని పటిష్ఠంగా అమలు చేసేందుకు కేంద్రం, రాష్ట్రాలు శ్రద్ధ చూపడం లేదు. అటవీ హక్కుల గుర్తింపు కోసం క్షేత్రస్థాయి కమిటీలు ఏర్పాటు కాకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో అటవీ హక్కుల గుర్తింపు లక్ష్యం నెరవేరే సూచనలు కనిపించడం లేదు.

ఆదిమ జాతుల దైన్యస్థితి

గిరిజన జాతీయ విధానం ఏళ్ల తరబడి చర్చలకే పరిమితమయింది. ఆదివాసులకు ప్రగతి ఫలాలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పథకాలు, కార్యక్రమాలను అమలులోకి తీసుకువస్తున్నా, వాటిలో ప్రచార పటాటోపం తప్పితే లక్ష్య సాధనలో చిత్తశుద్ధి కొరవడింది. అత్యంత వెనకబాటుకు గురవుతున్న ఆదివాసీ తెగల (పర్టిక్యులర్లీ వల్నరబుల్‌ ట్రైబల్‌ గ్రూప్‌-పీవీటీజీ) సామాజిక, ఆర్థిక వికాసంతోనే సమగ్ర ఆదివాసుల ప్రగతి సాధ్యమవుతుంది. 18 రాష్ట్రాల్లో 75 ఆదివాసీ సమూహాలను పీవీటీజీ తెగలుగా గిరిజన సంక్షేమ శాఖ గుర్తించింది. ఈ తెగల జనాభా 30 లక్షల మేర ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో లక్షా 17 వేల గిరిజన ఆవాసాలు ఉండగా, 22 వేల ప్రాంతాలకు రహదారులు లేవు. 36 వేల గ్రామాలకు రవాణా వ్యవస్థ కొరవడింది. 13,500 ప్రాంతాల్లో పాఠశాలలు కనిపించవు. 88 వేల గ్రామాలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేవు. ముందుగా ఇటువంటి గ్రామాలకు మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. గిరిజనులు అధికంగా ఉన్న తూర్పుకనుమలు, పశ్చిమ కనుమలు, మధ్య భారత్‌, ఈశాన్య ప్రాంతాల్లో ఖనిజ తవ్వకాలు, అభివృద్ధి ప్రాజెక్టుల ఏర్పాటులో దుందుడుకు ధోరణి విడనాడాలి. దేశం మొత్తంమీద గిరిజనులు సేకరించే ఔషధ, అటవీ ఫలసాయాల మార్కెట్‌ విలువ సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలని అంచనా. ఈ విపణిలో గిరిజనులు అధికంగా లబ్ధి పొందేలా- గిరిజన సహకార మార్కెటింగ్‌ వ్యవస్థలను బలోపేతం చేయాలి. చట్టాల అమలుకు నడుం కట్టాలి. గ్రామ సభలను బలోపేతం చేసి గిరిజనుల పరిపాలన, విద్య, ఆర్థిక సాధికారత సాధనకు చిత్తశుద్ధితో బాటలు వేసేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలి. ఆదివాసులు అన్ని రంగాల్లో ప్రగతి సాధించినప్పుడే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది.

ఇదీ చూడండి: గిరిజనులలో లింగవివక్ష లేదు: రాష్ట్రపతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.