ETV Bharat / opinion

ప్రశాంత చిత్తమే మానసిక ఆరోగ్యానికి బలం! - opinion story about mental health awareness

మానసిక ఆరోగ్యం లేనిదే ఆరోగ్యమే లేదన్న ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​ వ్యాఖ్యలను గుర్తు చేసుకోవాల్సిన రోజు ఇది. చైనాలోని పుట్టిన కొవిడ్ నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళిని ఆందోళనకు గురి చేస్తోంది. వ్యాధితో పోరాడాల్సిన వారు మహమ్మారి భయం కారణంగా ఒత్తిడికి గురై తనువు చాలిస్తున్నారు. కేవలం కరోనానే కాక మరెన్నో ఆలోచనతో సతమతమౌతూ కుంగిపోతున్నారని ఇప్పటికే అనేక స్వచ్ఛంద సంస్థల అధ్యయనాలు ఘోషిస్తోన్నాయి. నేడు ప్రపంచ మానసికారోగ్య దినోత్సవం సందర్భంగా మీకోసం ఈ ప్రత్యేక కథనం.

World Mental Health Day 2020
ప్రశాంత చిత్తమే... బలం!
author img

By

Published : Oct 10, 2020, 8:10 AM IST

ప్రపంచ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న మాయదారి రోగం- కొవిడ్‌. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో ఇది ఆందోళన రేకెత్తిస్తోంది. అది ఒత్తిడికి దారితీసి, కుంగుబాటుకు కారణమవుతోంది. కరోనాను మించిన మహమ్మారిగా మానసిక వ్యాధుల ఉపద్రవం ప్రపంచం ముందు నిలబడి ఉందని ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ, అనేక స్వచ్ఛంద సంస్థల అధ్యయనాల సారాంశం స్పష్టీకరిస్తోంది.

సీబీఐ మాజీ డైరెక్టర్‌ అశ్వనీ కుమార్‌ కుంగుబాటు కారణంగా ఆత్మహత్యకు పాల్పడటం యావత్‌ దేశాన్నే కలవరపరచిన పరిణామం. నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. మామూలు రోజుల్లో ఇది సాధారణ కార్యక్రమంగా జరిగిపోయేది. కరోనా కబంధహస్తాల్లో చిక్కుకున్న ప్రపంచ మానవాళికి ఈ రోజు మరింత ప్రత్యేకమైనదన్నది నిర్వివాదం!

అందరికీ అందని చికిత్స

ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ 2018 అక్టోబరు 16న ప్రపంచ ప్రజల మానసిక ఆరోగ్య శ్రేయం కోసం వ్యూహానికి శ్రీకారం చుడుతూ 'మానసిక ఆరోగ్యం లేకుండా ఆరోగ్యమే లేదు.. ఎంతో నిర్లక్ష్యానికి గురవుతున్న అంశమిది' అని వాపోయారు. మన ఆలోచనలు, అనుభూతులు, బాధ్యతల నిర్వహణ తీరుతెన్నులు వంటి అంశాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రధానంగా ప్రభావితం చేస్తుంటాయి.

ప్రస్తుత కొవిడ్‌ క్లిష్ట కాలంలో ప్రజలు మరింత ఒత్తిడి, భయం, ఆందోళనలకు లోనై, కుంగుబాటుకు గురై మానసిక స్థైర్యాన్ని, సంతులనాన్ని కోల్పోతున్నారు. అమెరికన్‌ సైకలాజికల్‌ అసోసియేషన్‌ అధ్యయనం ప్రకారం, 2019లో అమెరికన్లపై ఆర్థికపరమైన ఒత్తిడి 46శాతం ఉండగా అదిప్పుడు 70శాతానికి చేరింది. కరోనాకు ముందు కుంగుబాటుకు లోనైనవారు 8.5శాతమే. ఆదాయం తగ్గడం, కారణంగా ఏప్రిల్‌ నాటికి వారి సంఖ్య 27.8శాతానికి చేరుకుంది.

భారత్‌లోనూ పరిస్థితి భిన్నంగా లేదు. నాలుగేళ్ల క్రితం జరిగిన జాతీయ మానసిక ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలో మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 83శాతం బాధితులకు తగిన చికిత్స అందుబాటులో లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం- అమెరికాలో ప్రతి పది లక్షల మందికి 100 మంది మానసిక వైద్య నిపుణులు, 300మంది మనస్తత్వవేత్తలు ఉన్నారు. భారత్‌లో వారి సంఖ్య అతి స్వల్పం. పది లక్షల మందికి ముగ్గురు వైద్యులే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వందకోట్ల మంది మానసిక రుగ్మతతో జీవిస్తున్నారు. మానసిక అస్థిరత్వం వల్ల అనేకమంది మద్యం, ధూమపానానికి అలవాటుపడి మరిన్ని కష్టాలపాలవుతున్నారు.

మానసిక వ్యాధిగ్రస్తులపై చిన్నచూపు, దుర్విచక్షణ, మానవ హక్కుల ఉల్లంఘనలు కొనసాగడం- మరో విషాదం. పాపులేషన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా 2018 నాటి సర్వే- యాంగ్జయిటీ, డిప్రెషన్‌, స్కిజోఫ్రెనియా లాంటి మానసిక రుగ్మతల బాధితుల్లో అత్యధికులు భారత్‌లోనే ఉన్నారన్న చేదు నిజాన్ని ఆవిష్కరించింది. వీరిలో 25 ఏళ్లలోపువారు 50శాతం, 35 వయసులోపువారు 65శాతం ఉన్నారు. భారతదేశం 2020- 2021 బడ్జెట్లో ఆరోగ్య సంరక్షణ కోసం కేవలం రెండు శాతం నిధులు కేటాయించింది. ఆ సంఖ్యలో ఒక శాతం కన్నా తక్కువ మానసిక ఆరోగ్యానికి కేటాయించింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏప్రిల్‌, మే నెలల్లో 112 దేశాల్లో నిర్వహించిన సర్వేలో మూడింట ఒక వంతు భవిష్యత్తుపట్ల నిరాశలో కూరుకుపోయి ఉన్నారని తెలిపింది.

కరోనా సోకిందనే భయంతో ఆత్మహత్య చేసుకున్న న్యాయమూర్తి ఉదంతం చదివాం. ఉన్నత పదవుల్లో ఉన్నవారు, ఆర్థికంగా స్థిరత్వం కలిగినవారే నిస్సహాయతకు లోనవుతుంటే- సామాన్య ప్రజానీకం పరిస్థితి ఏమిటి? ప్రజలు సరైన దృక్పథాలను అలవరచుకోవాలి. స్థితిగతులను మార్చుకోవాలి. 'సమస్య మనల్ని ఓడించకూడదు, మనమే సమస్యలను అధిగమించాలి' అన్న అబ్దుల్‌ కలాం మాటను గుర్తుకు తెచ్చుకోవాలి. పరిస్థితి తీవ్రతరమైతే ఆరోగ్య కార్యకర్తలు, నిపుణుల సలహాలు పొందాలి.

సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలి

ఐక్యరాజ్యసమితి 2015 సెప్టెంబరులో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో 'సుస్థిరాభివృద్ధి' అజెండాలో మానసిక ఆరోగ్యం, మాదకద్రవ్యాల దుర్వినియోగాలను చేర్చడం- ఈ అంశానికి గల ప్రాధాన్యాన్ని తేటతెల్లం చేస్తుంది. 2019-2023 మధ్య అయిదేళ్ల కాలానికి వంద కోట్లమందికి 'సార్వత్రిక ఆరోగ్య భద్రతా నిధి' ఏర్పాటు, ఆరోగ్య అత్యవసర పరిస్థితుల నుంచి ప్రజారక్షణ వంటివాటిని లక్ష్యాలుగా నిర్దేశించుకుంది.

ఎన్‌డీఏ ప్రభుత్వం 2017లో తెచ్చిన మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం- మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నవారికి సేవలు అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. మానసిక రోగులు దుర్విచక్షణ, వేధింపులకు గురికాకుండా గౌరవంగా జీవించే హక్కును ఈ చట్టం కల్పిస్తోంది. దీనికి అనుగుణంగా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ ప్రచారం మానసిక దృఢత్వాన్ని పెంచుకోవడానికి, స్నేహితులు, కుటుంబ సభ్యులకు మద్దతు ఇవ్వడానికి ఉపకరించాలి.

ప్రతి ఒక్కరికీ మానసిక ఆరోగ్య సంరక్షణ సాకారం కావడానికి తాలూకా స్థాయిలో మానసిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి, నిపుణులతో కౌన్సెలింగ్‌ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. సంచార వాహనాల ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి. మొక్కగా ఉన్నప్పుడే మానసిక సమస్యలను తుంచివేయవచ్చు. ప్రముఖ మోటివేషనల్‌ వక్త నిడో క్యుబిన్‌ చెప్పినట్లు 'ప్రస్తుత పరిస్థితులు మీరు ఎక్కడికి వెళ్ళవచ్చో నిర్ణయించవు. కానీ, మీరు ఎక్కడ ప్రారంభించాలో నిర్ణయిస్తాయి'. సమస్య వచ్చేంతవరకూ కాకుండా ముందుగానే అప్రమత్తమై ముందడుగు వేద్దాం!

- షణ్మితా రాణి

(బెంగళూరు 'నిమ్‌హాన్స్‌'లో కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌)

ఇదీ చదవండి: 'స్కై డైవ్'​లో వాయుసేన జవాన్ల సరికొత్త రికార్డ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.