ETV Bharat / opinion

బస్సుల్లో భౌతిక దూరానికి భరోసా ఏది? - కరోనా ప్రజారవాణా

దేశంలో ఉన్న బస్సుల సంఖ్య దాదాపు 1.5 లక్షలు. భౌతిక దూరం పాటిస్తూ ప్రయాణాలు సాగించాలంటే అవసరమయ్యే బస్సులు దాదాపు 6 లక్షలు. మొత్తం బస్సుల్లో ప్రభుత్వ బస్సుల వాటా 8 శాతం. ఈ గణాంకాలు పరిశీలిస్తే ప్రభుత్వ రవాణాలో భౌతిక దూరం సాధ్యాసాధ్యాలపై తప్పక అనుమానాలు తలెత్తుతాయి. ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించే విషయంలో సందేహాలు వెల్లువెత్తుతాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగత దూరం పాటిస్తూ ప్రయాణాలు సాగించడం సాధ్యమవుతుందా?

Public Transport
ప్రజారవాణాలో భౌతిక దూరానికి భరోసా ఏదీ?
author img

By

Published : Jun 22, 2020, 4:23 PM IST

కిటకిటలాడే బస్టాప్​లు... బస్సు ఆగక ముందే ఎక్కేందుకు సాహసాలు... కనీసం నిల్చునేందుకైనా సరిపడా స్థలం లేక ఇబ్బందులు... ప్రధాన నగరాల్లో నిత్యం కనిపించే దృశ్యాలివి. కానీ... ఇవన్నీ గతం. ఇప్పుడు లెక్క మారింది.

ఇప్పుడు అన్ని విషయాలను కరోనాకు ముందు, తర్వాత అని విభజించుకోవాల్సి వస్తోంది. భౌతిక దూరాన్నే ప్రధానాంశంగా చేసుకుని ప్రతి రంగంలోనూ మార్పులు చేయాల్సి వస్తోంది. ప్రజా రవాణా విషయంలోనూ అంతే.

కానీ... భౌతిక దూరం పాటించడం అనుకున్నంత సులువా? సాధారణ రోజుల్లో(కరోనాకు ముందు) కిక్కిరిసి ప్రయాణిస్తేనే బస్సులు సరిపోవడం లేదు. మరి ఇప్పుడెలా? ఒక్కసారిగా బస్సుల సంఖ్య పెంచడం సాధ్యమేనా? అందుబాటులో ఉన్న ప్రజా రవాణా సాధనాలతోనే భౌతిక దూరం నిబంధన అమలు చేస్తూ... ప్రజల అవసరాలు తీర్చడం సాధ్యమేనా?

ప్రభుత్వ బస్సులేవి?

దేశంలో ప్రభుత్వం కంటే ప్రైవేటు సంస్థలే ఎక్కువగా ప్రయాణికుల అవసరాలు తీరుస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. 'రోడ్ ట్రాన్స్​పోర్ట్ ఇయర్ బుక్ 2016-17' ప్రకారం 1,49,100 బస్సులను ప్రభుత్వం నడుపుతోంది. దేశంలో మొత్తం నడిచే బస్సుల్లో వీటి వాటా 8 శాతం మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీ బస్సుల్లో భౌతిక దూరానికి ప్రభుత్వం భరోసా కల్పించడం గగనమే అవుతుంది.

ఇన్​స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్​పోర్టేషన్ అండ్ డెవలప్​మెంట్ పాలసీ ప్రకారం దిల్లీ, ముంబయి వంటి ప్రాంతాల్లోని 20 శాతం మంది ప్రయాణికులు ప్రభుత్వ రవాణాపైనే ఆధారపడి ఉన్నారు. దిల్లీలో సగటున 43 లక్షల మంది ప్రయాణికులకు కనీసం 14,300 బస్సులు అవసరం అవుతాయని అంచనా. కానీ నగరంలో ఉన్నవి 5,576 బస్సులే.

మహారాష్ట్రలో 2,865 బస్సులు 22 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో 10,460 బస్సులు నడుస్తున్నాయి. సాధారణ రోజుల్లో కోటి మంది ప్రయాణికులు ఈ సేవలను ఉపయోగించుకుంటున్నారు.

24 రెట్లు తక్కువ

2.5 కోట్ల మంది ప్రజలు వ్యక్తిగత దూరం పాటిస్తూ ప్రయాణాలు సాగించాలంటే దాదాపు 6 లక్షల బస్సులు అవసరమని క్లైమెట్ ట్రెండ్స్ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. అంతర్జాతీయ ప్రజా రవాణా సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం 25 వేల బస్సులు మాత్రమే ప్రస్తుతం సేవలు అందిస్తున్నట్లు తేలింది. దీన్ని బట్టి దేశంలో 24 రెట్లు బస్సులు తక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

కరోనాను దృష్టిలో ఉంచుకొని నష్టాలు వచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పరిమిత సంఖ్యలోనే ప్రయాణికులను బస్సుల్లో అనుమతిస్తున్నాయి. తమిళనాడు 50 శాతం సామర్థ్యంతో బస్సులు నడుపుతుండగా.. హిమాచల్ ప్రదేశ్ 60 శాతం సామర్థ్యంతో ప్రయాణాలకు అనుమతించింది. నాలుగు గ్రీన్ జోన్లలో బస్సు సర్వీసులు ప్రారంభించిన మహారాష్ట్ర... సీటుకు ఒక్కరు చొప్పున ప్రయాణించేలా చర్యలు తీసుకుంటోంది.

చైనాలో 6... భారత్​లో 4

సాధారణ సమయాల్లోనే బస్సుల్లో కిక్కిరిసిపోయేంత జనం ఉంటారు. రెట్టింపు సామర్థ్యంతో బస్సులు నడిపిన దాఖలాలూ ఉన్నాయి. సరిపడా బస్సులే లేని ఈ పరిస్థితుల్లో భౌతిక దూరం నిబంధనలు పాటిస్తూ ప్రయాణాలు కొనసాగించాలంటే ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పిన వివరాల ప్రకారం దేశంలో 10 వేల మందికి కేవలం నాలుగు బస్సులే ఉన్నాయి. చైనాలో వెయ్యి మందికి ఆరు బస్సులు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా బస్సుల సంఖ్యను పెంచాలి. మహానగరాల్లో మెట్రోలు వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాలి. సరైన జాగ్రత్తలు పాటిస్తూనే ప్రయాణాలు సాగించేలా ప్రజలను చైతన్యపరచాలి.

ఇదీ చదవండి: 'చైనా దుశ్చర్యల పట్ల మన్మోహన్ ప్రేక్షక పాత్ర'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.