ETV Bharat / opinion

బెర్నీ-బైడెన్​ భాయిభాయి.. ట్రంప్ భవిష్యత్తు ఏం కానుంది?

author img

By

Published : Jul 12, 2020, 8:40 AM IST

రాబోయే నాలుగు నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డొనాల్డ్​ ట్రంప్​ భవితవ్యంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత రిపబ్లికన్​ పార్టీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, డెమోక్రటిక్​ పార్టీ ప్రత్యర్థి జో బైడెన్​లు బరిలోకి దిగనున్నారు. అయితే జనాలు మాత్రం బైడెన్​ వైపే మొగ్గు చూపుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్​ భవితవ్యం ఏంటనేది మరోసారి చర్చనీయాంశమైంది?

WHAT IS THE TRUMP FUTURE IN US PRESIDENT ELECTIONS
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​ భవితవ్యమేంటి?

ఈ ఏడాది నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ప్రచారం వేడెక్కింది. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ కన్నా డెమోక్రటిక్‌ పార్టీ తరఫున నిలిచిన ప్రత్యర్థి జో బైడెన్‌ కే హెచ్చు జనాదరణ ఉందని వివిధ సర్వేలు తెలుపుతున్నాయి. అమెరికా ఎన్నికల వైచిత్రి ఏమంటే, ప్రజల నుంచి ఎక్కువ ఓట్లు సంపాదించిన అభ్యర్థి కన్నా ఎక్కువ నియోజక గణ (ఎలెక్టోరల్‌ కాలేజ్‌) ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థే చివరకు విజేతగా నిలవడం. అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు) దిగువ సభ అయిన ప్రజా ప్రతినిధుల సభలో, ఎగువ సభ అయిన సెనెట్‌లో దేశంలోని 50 రాష్ట్రాలకూ ఉన్న సీట్లను బట్టి ఆయా రాష్ట్రాలకు నియోజక గణ ఓట్ల కేటాయింపు జరుగుతుంది. రెండు సభల్లో కలిపి 538 నియోజక గణ ఓట్లు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలకు కలిపి ఎక్కువ నియోజక గణ ఓట్లు (కనీసం 270) సాధించిన అభ్యర్థి దేశాధ్యక్షుడిగా ఎన్నికవుతారు.

అలా అధ్యక్షుడయ్యారు..

2016 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ కన్నా డెమోక్రటిక్‌ అభ్యర్థి హిలరీ క్లింటన్‌ కు 28.7 లక్షల ప్రజా ఓట్లు ఎక్కువగా లభించినా, నియోజక గణ ఓట్లు ఎక్కువ వచ్చిన ట్రంప్‌ అధ్యక్ష పీఠం అధిరోహించారు. ఈసారి కూడా అలాగే జరగదని భరోసా ఏమీ లేదు. నవంబరు అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్‌ బైడెన్‌కు 50 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చినా, నియోజక గణంలో ట్రంప్‌ మళ్లీ ఆధిక్యం సాధిస్తే ఆయనకే సింహాసనం దక్కుతుంది. చిక్కల్లా ట్రంప్‌ గత ఎన్నికల్లో ఆధిక్యం సాధించిన రాష్ట్రాల్లో ఈసారి ఆయనకు పట్టు తగ్గిపోతుండటమే. అందుకే, గతంలో గెలిచిన రాష్ట్రాల్లో ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ ప్రత్యర్థి చేతిలోని రాష్ట్రాల్లో పాగా వేయాలని బైడెన్‌, ట్రంప్‌ హోరాహోరీ పోరాడుతున్నారు. 2016 ఎన్నికల్లో విస్కాన్సిన్‌, మిషిగన్‌, పెన్‌సిల్వేనియా రాష్ట్రాల్లో హిలరీ కన్నా కేవలం 77 వేల పైచిలుకు ప్రజా ఓట్లు ఎక్కువగా సాధించడం వల్ల ట్రంప్‌ ఆ మూడు రాష్ట్రాల నియోజక గణ ఓట్లన్నింటినీ తన ఖాతాలో వేసుకుని అధ్యక్ష పదవి చేజిక్కించుకున్నారు.

బెర్నీ-బైడెన్​ ఏకమై..

నిజానికి అప్పట్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం హిల్లరీతో పోటీపడిన బెర్నీ శాండర్స్‌ కు ఈ మూడు రాష్ట్రాల పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయి. చివరకు హిల్లరీకే అభ్యర్థిత్వం ఖరారవడంతో, ప్రైమరీలలో బెర్నీకి ఓటు వేసిన డెమోక్రటిక్‌ పార్టీ తెల్లజాతి కార్మిక ఓటర్లు అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ నకు ఓట్లు వేశారు. అప్పట్లో హిల్లరీ, శాండర్స్‌ మద్దతుదారులు కలిసి పనిచేసి ఉంటే ట్రంప్‌ ఆట కట్టేదని విశ్లేషణలు వెలువడ్డాయి. గతంలో చేసిన పొరపాటు పునరావృతం కాకుండా చూడటానికి ఈసారి బైడెన్‌ , బెర్నీ శాండర్స్​లు ఏకమయ్యారు. అధ్యక్ష ఎన్నికలు, ఆ తరవాత కూడా దేశ రాజకీయాలను శాసించే ఆరు కీలక సమస్యలపై పార్టీ విధాన రూపకల్పనకు సంయుక్త కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేశారు. ఆ అంశాలేవంటే- నిరుద్యోగంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, వలసల విధానం, కొవిడ్‌ నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణ, జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణంపై పెల్లుబికిన నిరసనాగ్రహాల దృష్ట్యా నేర న్యాయ సంస్కరణలు చేపట్టడం, విద్యా రంగ సంస్కరణలు, వాతావరణ మార్ఫు డెమోక్రటిక్‌ పార్టీలో బైడెన్‌ వర్గ ఉదారవాదులు, శాండర్స్‌ వర్గ ప్రగతిశీలురు ఈ అంశాలకు సంబంధించి ట్రంప్‌పై కలిసికట్టు పోరాటం సాగిస్తున్నారు.

డెమోక్రటిక్​ పార్టీ వైపే జనాల మొగ్గు

అమెరికాలోని నల్లజాతివారు, హిస్పానిక్‌, ఆసియన్లు, ఇతర మైనారిటీ వర్గాల్లో డెమోక్రటిక్‌ పార్టీకే ఎక్కువ పట్టు ఉంది. వీరికి వ్యతిరేకంగా తెల్లజాతి ఓటర్లను కూడగట్టాలన్న తాపత్రయంలో ట్రంప్‌ హెచ్‌ 1బి వీసాలపైన విరుచుకుపడుతున్నారు. విదేశాల నుంచి అమెరికాలో నివాసం కోసం వలస వచ్చేవారితోపాటు పనికోసం వచ్చేవారిపైనా తీవ్ర ఆంక్షలు విధిస్తున్నారు. బైడెన్‌ తాను గనుక అధికారంలోకి వస్తే తక్షణం హెచ్‌ 1బి వీసాలపై సస్పెన్షన్‌ రద్దు చేస్తానన్నారు. కరోనా కల్లోలం వల్ల ఏదైనా అమెరికన్‌ విద్యాసంస్థ పూర్తిగా ఆన్‌లైన్‌లో విద్యాబోధన చేపడితే, ఫాల్‌ సెమిస్టర్‌లో విదేశీ విద్యార్థులంతా తమతమ దేశాలకు వెళ్లిపోయి అక్కడి నుంచి పాఠాలు వినాలనే నిబంధనను ట్రంప్‌ సర్కారు తీసుకొచ్చింది. ఇది భారతీయ విద్యార్థులకు చాలా నష్టదాయకం. ట్రంప్‌, బైడెన్‌ లు ఇద్దరూ భారతదేశం తమకు వ్యూహపరమైన భాగస్వామి అని ప్రకటిస్తున్నా- హెచ్‌ 1బి విషయంలో ట్రంప్‌ భారత ప్రయోజనాలకు హానికరంగా వ్యవహరిస్తున్నారు.

అందరికీ చిర్రెత్తించిన ట్రంప్‌..!

ఒక్క భారత్‌ అనే ఏమిటి- అమెరికాకు చిరకాల మిత్రులు, వ్యూహభాగస్వాములైన కెనడా, ఐరోపా దేశాలు కూడా అమెరికా నమ్మకమైన భాగస్వామి కాదని భావించే స్థితి ఏర్పడింది. అసలు పారిస్‌ వాతావరణ ఒప్పందం మొదలుకొని విశాల పసిఫిక్‌ భాగస్వామ్య ఒప్పందం వరకు పలు అంతర్జాతీయ ఒడంబడికల్ని ట్రంప్‌ తుంగలో తొక్కినప్పటి నుంచే భాగస్వాములకు ఆయన దూరం కాసాగారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల నుంచి వైదొలగుతానని, ఇతర బహుళపక్ష ఒప్పందాలకు మంగళం పాడతానని బెదిరిస్తూ అమెరికాను ప్రపంచంలో ఏకాకిని చేస్తున్నారు. ట్రంప్‌ చైనాను నేర్పుగా, ఒడుపుగా దారికి తీసుకురావలసింది పోయి మొరటుగా ముఖాముఖి ఘర్షణకు దిగుతున్నారని విమర్శలు వచ్చాయి. ఇది సమర్థ నాయకుడి లక్షణం కాదనే అభిప్రాయం పాదుకొంటోంది. ట్రంప్‌ మాత్రం- ఎవరేమనుకున్నా సరే, శ్వేతజాతి ఓటర్ల మద్దతుతో గెలవాలని ఆరాటపడుతున్నారు.

అవే ట్రంప్​ కొంపముంచేనా?

కానీ, గత మూడు నెలలుగా ట్రంప్‌, ఆయన రిపబ్లికన్‌ పార్టీ దేశాన్ని తప్పుదారిలో నడిపిస్తున్నారని 75 శాతం ఓటర్లు భావిస్తున్నట్లు పొలిటికో-మార్నింగ్‌ కన్సల్ట్‌ సర్వే వెల్లడించింది. 1,30,000 మందికిపైగా అమెరికన్లను బలిగొన్న కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ట్రంప్‌ సర్కారు విఫలమైందని, నల్లజాతి వ్యక్తి జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణానంతరం పెల్లుబికిన పౌర అసమ్మతి పట్ల ట్రంప్‌ అనుసరించిన వైఖరి జాతి విభేదాలను రెచ్చగొట్టేట్లుందని అత్యధిక ఓటర్లు భావిస్తున్నట్లు ఆ సర్వే తెలిపింది. కరోనా విషయంలో ట్రంప్‌ అబద్ధాలు ఆడుతున్నారనే భావన బలపడుతోంది. దేశంలో నాలుగు కోట్లమందికి కరోనా పరీక్షలు చేయగా, వాటిలో 99 శాతం కేసులు నిరపాయకరమైనవని తేలినట్లు ట్రంప్‌ ప్రకటించడం దీనికి ఉదాహరణ. జాన్స్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయ గణాంకాల ప్రకారం అమెరికాలో కరోనా కేసులు 28 లక్షలు. వాటిలో 35 శాతం ఎటువంటి లక్షణాలూ కనిపించని కేసులే అయినా, వారివల్ల ఇతరులకు వైరస్‌ సోకే ప్రమాదం హెచ్చని అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం (సీడీసీ) వెల్లడించింది.

ఆ ఓట్లూ దూరం..

మొత్తం మీద ట్రంప్‌ వ్యాఖ్యలు, వ్యవహారశైలి గతంలో ఆయనకు ఓటు వేసిన శ్వేతజాతి విద్యావంతులనూ క్రమంగా దూరం చేస్తున్నాయి. నగరాలు, పట్టణాల శివార్లలో సకల వసతులున్న ప్రత్యేక వాడల్లో నివసించే ఈ అధికాదాయ వర్గాలు సంప్రదాయ రిపబ్లికన్‌ ఓటర్లే. 2018 పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో మాత్రం వారు రిపబ్లికన్లను ఓడించి, ప్రతిపక్షం డెమోక్రటిక్‌ పార్టీకి దిగువ సభలో మెజారిటీ లభించడానికి కారకులయ్యారు. నవంబరు అధ్యక్ష ఎన్నికల్లోనూ వారు ఇదే పని చేయవచ్చు.

ఏమైనా జరగొచ్చు?

అందుకే వివిధ ప్రజాభిప్రాయ సేకరణల్లో బైడెన్‌ కు ట్రంప్‌ పై 9 నుంచి 10 పాయింట్ల ఆధిక్యత కనిపిస్తోంది. నవంబరు మూడున అధ్యక్ష పదవితోపాటు 33 సెనెట్‌ సీట్లకూ జరిగే ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలిచే సూచనలున్నాయని, 2021కల్లా అమెరికా పార్లమెంటు ఉభయ సభల్లో వారు మెజారిటీ సాధించే అవకాశాలు పుష్కలమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నందువల్ల ఆ లోపు ఏమైనా జరగవచ్చునని మరచిపోకూడదు. ఉదాహరణకు, ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగే చర్చల్లో బైడెన్‌ ఏదైనా పొల్లుమాట మాట్లాడితే, ట్రంప్‌ శిబిరం దాన్ని చిలవలు పలవలు చేసి బైడెన్‌ ప్రతిష్ఠను దెబ్బతీయవచ్చు. లేదా నవంబరులోపు కరోనాకు వ్యాక్సిన్‌ రావచ్చు, దేశార్థిక వ్యవస్థ మెరుగుపడవచ్చు. ఇదంతా తన ఘనతేనని చెప్పుకొని ట్రంప్‌ మళ్లీ గెలవనూవచ్చు.

- ఏఏవీ ప్రసాద్‌, రచయిత

ఇదీ చదవండి: శ్వేత ఓటర్ల కోసం ట్రంప్ జాతివిద్వేష వ్యూహం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.