ETV Bharat / opinion

హద్దుమీరిన చైనా ఆధిపత్య ధోరణి - భారత్​ చైనా సరిహద్దువివాదం

చైనా తనను తాను అద్దంలో చూసుకుంటే ప్రపంచానికి భావి అగ్రరాజ్యం హోదాలో కనిపిస్తుంది. చైనా మొదటి నుంచి కూడా భారత్‌ను ఏమార్చి దెబ్బతీస్తూ వస్తోంది. ఒకవైపు జగడానికి దిగడం, మరోపక్క శాంతివచనాలు వల్లించడం బీజింగ్​కు కొత్తేమి కాదు. భారత్‌-చైనాల మధ్యనున్న వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి పలు చోట్ల ముష్టియుద్ధాలు జరిగాయి. ఈ ఘర్షణ వైఖరి వెనక చైనా వ్యూహాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ దేశ మనస్తత్వాన్ని గ్రహించాలని నిపుణులు చెబుతున్నారు.

What Is China Saying About the China-India Border Stand-Off
హద్దుమీరిన ఆధిపత్య ధోరణి-కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా
author img

By

Published : Jun 21, 2020, 10:58 AM IST

డోక్లాం పీఠభూమిలో భారత్‌-చైనా సైనిక దళాలు నువ్వా నేనా అంటూ తలపడి రెండేళ్లు తిరగకుండానే మళ్లీ బాహాబాహీకి దిగాయి. భారత్‌-చైనాల మధ్యనున్న వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి పలు చోట్ల ముష్టియుద్ధాలు జరిగాయి. మే నెలలో మొదలైన ఉద్రిక్త పరిస్థితి ఆందోళన రేపుతున్న సమయంలో జూన్‌ నెలారంభంలో సయోధ్య రేఖలు పొడచూపాయి. అంతలోనే గల్వాన్‌ లోయలో చైనా సైనికుల రాళ్ల దాడిలో భారతీయ కర్నల్‌ సంతోష్‌ బాబు సహా 20 మంది మరణించారు. చైనా వైపు హతులు, క్షతగాత్రుల సంఖ్య ఇదమిత్థంగా తెలియరాలేదు. సన్నని కొండ దారిలో రెండు దేశాల సైనిక బృందాలు ఎదురుపడినప్పుడు ఘర్షణ సంభవించినట్లు సమాచారం. ఎల్‌ఏసీ నుంచి పరస్పరం సేనలను విరమిద్దామని ఒకవైపు చర్చలు జరుగుతుండగానే, చైనా కుట్రపూరితంగా దాడికి పాల్పడిందని భారత్‌ పేర్కొంది. చైనా మొదటి నుంచీ కూడా భారత్‌ను ఏమార్చి దెబ్బతీస్తూ వస్తోంది. ఒకవైపు జగడానికి దిగడం, మరోపక్క శాంతివచనాలు పలకడం- చైనాకు కొత్త కాదు. ఈ ఘర్షణ-సయోధ్య వైఖరి వెనక చైనా వ్యూహాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ దేశం మనస్తత్వాన్ని గ్రహించాలి.

అద్దంలో డ్రాగన్‌ ప్రతిబింబం

చైనా తనను తాను అద్దంలో చూసుకుంటే ప్రపంచానికి భావి అగ్రరాజ్యం హోదాలో కనిపిస్తుంది. అమెరికాను సాంకేతిక, ఆర్థిక రంగాల్లో సవాలు చేసే స్థాయికి ఎదిగిన తాను ఇక సైనికపరంగానూ అతిపెద్ద రాజ్యంగా అవతరించగలనని అది అనుకొంటోంది. ఆ దిశలో తొలి అడుగు- ఆసియా ఖండంపై తిరుగులేని ఆధిక్యం సాధించడమేనని బీజింగ్‌ భావన. అందుకే గడచిన దశాబ్దకాలంగా చైనా నాలుగు ప్రాంతాల్లో ఆధిపత్య ధోరణులు కనబరుస్తోంది. అవి- జపాన్‌ సమీపంలోని తూర్పు చైనా సముద్రం, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దేశాల సమీపంలోని దక్షిణ చైనా సముద్రం, భారత్‌-చైనా సరిహద్దు, సముద్రాల్లో నౌకా సంచార హక్కులపై అమెరికాతో రగడ.

బెదిరింపులను ఖాతరు చేసేది లేదు

కొవిడ్‌ వ్యాధి ప్రపంచమంతటికీ పాకడానికి చైనాయే కారణమని ప్రపంచ దేశాలు భావిస్తున్న సమయంలో- అమెరికా బీజింగ్‌ను ఆర్థికంగా, సాంకేతికంగా కట్టడి చేసే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలో భారతదేశం అమెరికా చేతిలో పావు కారాదని చైనా అధికారవాణి ది గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక హెచ్చరించడం చైనా ఆధిపత్య ధోరణికి తార్కాణం. ఇలాంటి బెదిరింపులను ఖాతరు చేసేది లేదని భారత్‌ స్పష్టం చేస్తోంది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి సరిహద్దుల్లో భారత్‌ పంథా కరకు తేలింది. కొవిడ్‌ వల్ల ప్రపంచం ముందు దోషిగా నిలబడుతూ, ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న సమయంలోనూ చైనా ఎల్‌ఏసీ వద్ద దుందుడుకు ధోరణికి పాల్పడటం వింతగా ఉంది. కరోనా కల్లోలం మొదలైనప్పటి నుంచి దక్షిణ చైనా సముద్రంలో మలేసియా, వియత్నామ్‌లతో అది కయ్యం పెట్టుకుంది. తైవాన్‌ను బెదిరించడం, హాంకాంగ్‌ స్వయంనిర్ణయాధికారాన్ని రద్దు చేయడం, జపాన్‌ చేపల పడవలను వెంటాడి వేధించడం అయ్యాక తాజాగా భారత్‌పై దాడికి దిగింది. చైనా దూకుడును ఖాతరు చేయకుండా భారత్‌ తన రక్షణ కవచాన్ని బలోపేతం చేసుకొంటోంది. 2017 డోక్లాం సంక్షోభం తరవాత మూడు నెలలకు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కలిసి క్వాడ్‌ను పునరుద్ధరించింది. 2018లో అమెరికాతో కీలక రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా ఎల్‌ఏసీ ఘర్షణలను పురస్కరించుకుని ఆస్ట్రేలియాతో రక్షణ బంధాన్ని బలపరచుకుంది. చైనాకు వ్యతిరేకంగా అమెరికా ముందుకుతెచ్చిన ఇండో-పసిఫిక్‌ వ్యూహం సాకారం కావడానికి ఇలా చైనాయే దోహదం చేయడం చిత్రం. తనకుతానే ఉచ్చు బిగించుకుంటున్నానని చైనా గ్రహించడం లేదు. ఆసియాలో తనకు ఎదురు లేదని అది మిడిసిపడుతున్నట్లుంది!

కశ్మీర్‌లో తలదూర్చే వ్యూహం

ఆసియాలో తానే సర్వంసహాధిపత్య శక్తినని భావిస్తున్న చైనా, భారత్‌ను దక్షిణాసియాకు పరిమితమైన ప్రాంతీయ శక్తిగా మాత్రమే పరిగణించడం దీనంతటికీ మూలం. పోనీ, దక్షిణాసియాలోనైనా భారత్‌ను కుదురుగా ఉండనిస్తోందా అంటే అదీలేదు. దిల్లీకి పక్కలో బల్లెంగా పాకిస్థాన్‌ను ఎగదోస్తూ, ఇతర దక్షిణాసియా దేశాలతోనూ భారత్‌కు పొరపొచ్చాలు సృష్టిస్తోంది. భారత్‌ మీద చిన్నచూపు ఉండబట్టే- అణు ఇంధన సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ) సభ్యత్వం విషయంలో, ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం అంశంలో చైనా మోకాలడ్డుతోంది. ఆక్రమిత కశ్మీర్‌ ద్వారా చైనా-పాక్‌ ఆర్థిక నడవా (సీపెక్‌) నిర్మాణం కొనసాగిస్తోంది. చైనా ఆభిజాత్యం, భారత్‌ ఆత్మవిశ్వాసం డోక్లామ్‌లో ఘర్షణ పడ్డాయి. భారత్‌ పట్ల చైనాకు చిన్నచూపు ఉంటే, అమెరికా తన ఇండో-పసిఫిక్‌ వ్యూహంలో భారత్‌కు ఉన్నత ప్రాధాన్యమిస్తోంది. నిజానికి భారతదేశం అమెరికా ఒడిలో వాలిపోవాలని భావించడం లేదు. అమెరికా కోసం రష్యాతో బంధాన్ని తెంచుకోవాలనీ అనుకోవడం లేదు. చైనాతో పూర్తిస్థాయి సంఘర్షణనూ కోరుకోవడం లేదు. అయితే చైనా పార్టీ, ప్రభుత్వాల్లోని అతివాదులు అమెరికా అండదండలతో భారతదేశం చెలరేగిపోతోందని రుసరుసలాడుతున్నారు.

370 రద్దే కారణమా!

పాక్‌ స్థావరంగా పనిచేస్తున్న ఉగ్రవాదులపై విరుచుకుపడటం, 370 రాజ్యాంగ అధికరణను రద్దు చేసి కశ్మీర్‌ రాజ్యాంగ హోదాను మార్చడం, లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి- అక్కడ చైనా కార్యకలాపాలకు కళ్లెం వేయడం ఇందుకు నిదర్శనాలంటున్నారు. ఇంతకాలం భారత్‌ను అదుపులో పెట్టడానికి పాకిస్థాన్‌ను ఉపయోగించుకున్నామని- అమెరికా లోపాయికారీ మద్దతుతో భారత్‌ పాకిస్థాన్‌ను బలహీనపరుస్తున్నందు వల్ల ఇకపై తన పాచిక పారదని చైనా గ్రహిస్తోంది. జమ్మూకశ్మీర్‌ రాజ్యాంగ హోదాను భారత్‌ గతేడాది ఏకపక్షంగా మార్చివేసిందంటూ చైనా, పాక్‌లు ప్రతిచర్యలకు దిగుతున్నాయి. భారత్‌-చైనా సరిహద్దు వివాద పరిష్కారం జటిలమవుతోందంటూ కశ్మీర్‌లో ప్రత్యక్షంగా తలదూర్చాలని డ్రాగన్‌ దేశం చూస్తోంది. కొవిడ్‌ సంక్షోభం దరిమిలా చైనాలో ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోంది. అయినా భారత సరిహద్దులో దుస్సాహసానికి పాల్పడటం ద్వారా చైనా సర్కారు తాము ఇప్పటికీ అజేయులమని తమ దేశ ప్రజలను నమ్మించాలని చూస్తోంది. అమెరికా తనను ఆర్థిక ఆంక్షలకు గురిచేస్తున్న సమయంలో భారతదేశం చైనా పెట్టుబడులపై నియంత్రణ విధించడం బీజింగ్‌కు రుచించడం లేదు. అమెరికా తనను ముట్టడిస్తోందని అనుమానిస్తున్న చైనా, భారత్‌నూ ముట్టడిలో ఇరికించాలని చూస్తోంది. ఈ ముట్టడి మనస్తత్వాన్ని వదలించుకుని, భారత్‌ను సమానమైన దేశంగా పరిగణించనిదే శాశ్వత సయోధ్య సాధ్యపడదు!

కంటగింపుగా రహదారుల నిర్మాణం

రెండు దేశాల సరిహద్దులోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)కి అవతల చైనా ఎన్నడో పక్కా రోడ్లు, యుద్ధ విమానాలు, ట్యాంకులు దిగే స్థలాలను సిద్ధం చేసుకోగా- భారతదేశం మోదీ జమానాలో కానీ పూర్తి స్థాయిలో ఆ పని మొదలుపెట్టలేదు. సైనిక దళాలను, ట్యాంకులు, ఫిరంగుల వంటివి తరలించడానికి 61 రహదారుల నిర్మాణాన్ని 2022 డిసెంబరుకల్లా పూర్తిచేయాలని లక్షిస్తోంది. ఇది చైనాకు కంటగింపుగా ఉంది. ఎల్‌ఏసీ వెంబడి ఈ ఏడాది ఏప్రిల్‌ నాటి పరిస్థితులను పునరుద్ధరిద్దామని, అన్ని అతిక్రమణలు, ఘర్షణలకు స్వస్తి చెబుదామని జూన్‌ ఆరోతేదీనాటి చర్చల్లో భారత్‌ ప్రతిపాదించగా- చైనా దాన్ని పట్టించుకోకుండా సరిహద్దులో భారత్‌ చేపట్టిన మౌలిక వసతుల నిర్మాణాన్ని తక్షణం నిలిపివేయాలని ఎదురు డిమాండ్‌ చేసింది. తన డిమాండుకు తలొగ్గకపోతే సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితిని కొనసాగిస్తూనే ఉంటానని భారత్‌కు తెలిసివచ్చేలా చేయడానికి తాజాగా భారత యోధులపై దాడికి దిగి హతమార్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.