ETV Bharat / opinion

సామ్రాజ్యవాదమే లక్ష్యంగా.. ఉక్రెయిన్​పై పుతిన్‌ నరమేధం! - వ్లాదిమిర్​ పుతిన్

Russia Ukraine War: ఉక్రెయిన్​పై భీకర దాడులతో రష్యా విరుచుకుపడుతోంది. అణ్వస్త్ర తర్జనితో ప్రపంచాన్ని బెదిరిస్తూ, భీతావహ దాడులతో పొరుగు ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను పుతిన్​ కాలరాస్తున్నారు. ఉక్రెయిన్‌ తమకు తలొగ్గితేనే యుద్ధం ఆగుతుందంటున్న పుతిన్‌ సామ్రాజ్యవాదం- తూర్పు ఐరోపా దేశాలకే కాదు, భవిష్యత్తులో యావత్తు ఖండానికీ అనర్థదాయకమే అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

putin
వ్లాదిమిర్ పుతిన్
author img

By

Published : Mar 8, 2022, 7:36 AM IST

Russia Ukraine War: పసిపాపల నునులేత శరీరాలు నెత్తుటి ముద్దలవుతున్నాయి. పచ్చటి కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆవేదనాభరితంగా స్పందించినట్లు, ఉక్రెయిన్‌లో కన్నీటి నదులు వరదలెత్తుతున్నాయి. ఇది అక్షరాలా నరమేధం.. మానవతా జ్యోతులను కసితీరా కొండెక్కించే కదన పిశాచి వికటాట్టహాసం! ఉక్రెయిన్‌, జార్జియా తదితర సోదర జాతులను అణచివేసే ఆధిపత్య భావజాలాన్ని 'మహా రష్యన్‌ దురహంకారం' (గ్రేట్‌ రష్యన్‌ షావెనిజం)గా సోవియట్‌ దిగ్గజ నేత లెనిన్‌ ఒకప్పుడు ఈసడించారు. తాను మరణించే వరకు దానిపై పోరాడతానని ప్రకటించారు. ఆ విష భుజంగానికి మళ్ళీ పాలుపోసిన పుతిన్‌- అతి జుగుప్సాకర యుద్ధ విధ్వంసానికి కారణభూతులయ్యారు. అణ్వస్త్ర తర్జనితో ప్రపంచాన్ని బెదిరిస్తూ, భీతావహ దాడులతో పొరుగు ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కాలరాస్తున్నారు. వారికి తోడ్పాటునందించే పక్షాలను శత్రుసమానంగా భావించి భీకరంగా విరుచుకుపడతామంటూ ఆయన హుంకరిస్తున్నారు.

రష్యా జాతీయ సమగ్రతను ఉక్రెయిన్‌ ప్రశ్నించలేదు.. సమరోత్సాహాన్నీ ప్రదర్శించలేదు. బుడాపెస్ట్‌ మెమొరాండం ద్వారా తమ భద్రతకు మాస్కో ఇచ్చిన హామీ గాలిలో దీపమైన దరిమిలా ఆత్మరక్షణ కోసం నాటో కూటమిలో చేరాలని అది అభిలషించింది. అదే సాకుగా రష్యా ఆరంభించిన యుద్ధం- సుమారు 15 లక్షల అమాయక ఉక్రెయిన్‌ వాసులను అసహాయ శరణార్థులుగా మార్చింది. పదకొండు వందల మందికి పైగా సామాన్యులు సమరంలో సమిధలైనట్లు ఐరాస మానవ హక్కుల సంస్థ ప్రకటించింది. వాస్తవానికి అంతకు ఎన్నో రెట్ల స్థాయిలో అక్కడ మారణహోమం సాగుతున్నట్లుగా వెలుగుచూస్తున్న కథనాలు దిగ్భ్రాంత పరుస్తున్నాయి. తనువెల్లా గాయాలైన బిడ్డలను గుండెలకు అదుముకుంటూ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్న తల్లిదండ్రులు.. తరుముకొస్తున్న మోర్టార్ల పాలబడి నడిరోడ్లపై విగతజీవులవుతున్న సాధారణ పౌరుల దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. తన పోరాటానికి స్వస్తిపలికి ఉక్రెయిన్‌ తమకు తలొగ్గితేనే యుద్ధం ఆగుతుందంటున్న పుతిన్‌ సామ్రాజ్యవాదం- తూర్పు ఐరోపా దేశాలకే కాదు, భవిష్యత్తులో యావత్తు ఖండానికీ అనర్థదాయకమే!

అంతర్జాతీయ చట్టాలను అందరూ గౌరవించాలని, ఐరాస భద్రతామండలి అనుమతి లేకుండా ఎవరూ మరొకరిపై దండెత్తరాదని ఇరాక్‌ యుద్ధ సమయంలో పుతిన్‌ సుద్దులు చెప్పారు. తద్భిన్నంగా తానే కదన కుతూహల రాగం ఆలపించి 2008లో జార్జియాపైకి రష్యన్‌ బలగాలను దౌడుతీయించారు. ఆ తరవాత ఆరేళ్లకు క్రిమియాను కైవసం చేసుకున్న క్రెమ్లిన్‌- ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతమైన డాన్‌బాస్‌లో నెత్తుటి నెగళ్లను ఎగదోసింది. ఐరాస తీర్మానాలను బేఖాతరు చేస్తూ నేడు ఆ దేశంలో వినాశనం సృష్టిస్తోంది. 'మన స్వతంత్రతను చూసి కన్నుకుట్టిన ప్రతీపశక్తులు మనల్ని సాధించడానికి చిరకాలంగా ప్రయత్నిస్తున్నాయి' అంటూ గతంలో దేశానికి పుతిన్‌ ఉపదేశించారు. వాటి కుయుక్తుల నుంచి మాతృభూమిని రక్షించడమే తన లక్ష్యమని ఆయన తరచూ ఉద్ఘాటిస్తుంటారు. నియంతృత్వాధికారంతో రష్యాపై పట్టుబిగించిన పుతిన్‌- దాని అధిరాజ్య పరపతిని అంతర్జాతీయంగా విస్తరింపజేసేందుకే హింసోన్మాదాన్ని వెళ్లగక్కుతున్నారు.

ఉక్రెయిన్‌పై ఏకపక్షంగా దండెత్తడాన్ని తీవ్రంగా గర్హిస్తున్న స్వదేశీయులెందరినో క్రెమ్లిన్‌ కటకటాల్లోకి నెడుతోంది. నకిలీ వార్తల కట్టడి పేరిట నల్లచట్టాలతో స్వతంత్ర పత్రికలు, ప్రసార మాధ్యమాల పీకనులుముతోంది. ప్రభుత్వ కథనాలకు భిన్నమైన సమాచారాన్ని వ్యాప్తిచేస్తే పదిహేనేళ్ల వరకు జైలుశిక్ష తప్పదని గుడ్లురుముతోంది. తాను 'సైనిక చర్య'గా పేర్కొన్న దాన్ని దేశీయంగా 'యుద్ధం లేదా ఆక్రమణ'గా అభివర్ణించడాన్నీ అది నిషేధించింది. ప్రపంచ శాంతి సౌభ్రాతృత్వాలకు పెనువిఘాతంగా పరిణమిస్తున్న పుతిన్‌ పెడపోకడలు తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. అంతర్జాతీయ ఒత్తిడి, సమష్టి యత్నాల ద్వారానే- మాస్కో భల్లూకం పట్టులోంచి విడివడి ఉక్రెయిన్‌ ఊపిరి పీల్చుకోగలుగుతుంది!

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.