ETV Bharat / opinion

విపత్తువేళ అభయ యోగా- జనారోగ్యానికి మార్గం - కరోనా సమయంలో యోగా

ప్రజారోగ్యానికి మునుపెన్నడూ లేనిస్థాయిలో కొవిడ్‌ మహమ్మారి సవాళ్లు విసిరింది. చాలాకాలంగా ఒకచోటుకే పరిమితమై ఉండటం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన పెరుగుతున్నాయి. అది ఇతరత్రా శారీరక అనారోగ్యాలకూ దారి తీస్తోంది. ఈ క్రమంలో వ్యాధి నిరోధకతను పెంపొందించుకోవడం, ఆరోగ్యకర జీవనశైలిని అనుసరించడం ఎంతో అవసరం. వ్యాధి నిరోధక వ్యవస్థను ఇనుమడింపజేయగల సామర్థ్యం యోగాకు ఉందని అనేక అధ్యయనాలు ఇప్పటికే రుజువు చేశాయి.

international yoga day
అంతర్జాతీయ యోగా దినోత్సవం
author img

By

Published : Jun 21, 2021, 8:11 AM IST

కొవిడ్‌ మహమ్మారి మానవ జీవితాల్లో పెను సంక్షోభం సృష్టించింది. ఎందరి జీవితాలనో అస్తవ్యస్తం చేసి, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది జీవనోపాధిని దెబ్బతీసింది. గణనీయ స్థాయిలో ప్రాణనష్టం కలగజేసింది. ప్రజారోగ్యానికి మునుపెన్నడూ లేనిస్థాయిలో సవాళ్లు విసిరింది. ఈ సంక్షోభం కారణంగా చాలామంది ఇళ్లకే పరిమితమై, వ్యాధి ముప్పు భయంతో మానసిక ఆందోళనకూ గురికావాల్సి వస్తోంది. చాలాకాలంగా ఒకచోటుకే పరిమితమై ఉండటంతో మానసిక ఒత్తిడి, ఆందోళన పెరుగుతున్నాయి. అది ఇతరత్రా శారీరక అనారోగ్యాలకూ దారి తీస్తోంది. ఈ క్రమంలో వ్యాధి నిరోధకతను పెంపొందించుకోవడం, ఆరోగ్యకర జీవనశైలిని అనుసరించడం ఎంత అవసరమో ప్రస్తుత ప్రజారోగ్య సంక్షోభం తేటతెల్లం చేసింది.

రోగ నిరోధక వ్యవస్థకు దన్ను

వ్యాధి నిరోధక వ్యవస్థను ఇనుమడింపజేయగల సామర్థ్యం యోగాకు ఉందని అనేక అధ్యయనాలు ఇప్పటికే రుజువు చేశాయి. ప్రతి సంవత్సరం జూన్‌ 21వ తేదీన 'అంతర్జాతీయ యోగా దినోత్సవం' పాటించాలని భారత్‌ నేతృత్వంలో ప్రతిపాదించిన తీర్మానానికి ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ 2014లో దీనికి సంబంధించిన ప్రతిపాదన చేసిన తరవాత కేవలం 90 రోజుల్లోనే ఐరాస సభ్యదేశాలు అమలులోకి తీసుకొచ్చాయి. సమితి సర్వసభ్య సమావేశం చరిత్రలో మునుపెన్నడూ లేనిరీతిలో భారత్‌ ప్రతిపాదించిన తీర్మానానికి 177 దేశాలు మద్దతు ఇవ్వడం విశేషం. ఈ క్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి భారత్‌ విజయాన్ని చరిత్రాత్మక ఘట్టంగా పరిగణించాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజారోగ్యం సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో నేటి ఏడో అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది.

ఉపశమనం కోరుకునే వారికి..

మన ప్రాచీన నాగరికత పుట్టిన నాటి నుంచే యోగాభ్యాస భావన, సాధన పద్ధతులు ఆవిర్భవించాయి. మహనీయులైన మన రుషులు, సాధువులు శక్తిమంతమైన యోగ విజ్ఞానాన్ని ప్రపంచం నలుమూలలకూ విస్తరింపజేశారు. తద్వారా ప్రతి సామాన్య మానవుడికీ శాస్త్రవిద్యను అందుబాటులోకి తీసుకొచ్చారు. మనసులో గందరగోళాన్ని తొలగించుకొని, విస్పష్ట మానసిక స్థితిని కోరుకునే వారికి ఆత్మ, బుద్ధి, శారీరక వికాసాన్ని క్రమబద్ధం చేయగల అమోఘమైన, అత్యంత సులభరీతిలో ఆచరించగలిగిన ప్రక్రియ ఇది. దైనందిన జీవితాల్లో తీవ్ర ఒత్తిడిని, అమిత మనోభారాన్ని ఎదుర్కొనే వారికి వాటి నుంచి ఉపశమనం పొందగల అత్యావశ్యక ఉపకరణం యోగా. అంతేకాకుండా ఇతరత్రా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కోరుకునే వారికీ ఎంతో ప్రయోజనకరం.

వ్యాధి నిరోధక సామర్థ్యాన్ని ఇనుమడింపజేసే..

శారీరక వ్యాయామం, శ్వాస పద్ధతులు, ఏకాగ్రత మెరుగుదల వంటి అంశాల ఉత్తమ సమ్మేళనమే యోగాభ్యాసం. ఇది శారీరక, మానసిక స్థితిగతులను బలోపేతం చేసి, వ్యాధి నిరోధక శక్తిని మెరుగు పరుస్తుంది. ఒత్తిడిని తగ్గించి, వ్యాధి కారకాలతో పోరాడగల, వ్యాధి నిరోధక సామర్థ్యాన్ని ఇనుమడింపజేయగల యోగాసనాల్లో శవాసనం, శశాంకాసనం కీలకమైనవి. అదేవిధంగా ప్రాణాయామం వంటి శ్వాస ప్రక్రియ మన శ్వాసకోశ వ్యవస్థలను సమర్థంగా పనిచేసేలా తోడ్పడుతూ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. త్రికోణాసనం రక్త ప్రసరణను మెరుగు పరచి అన్ని అవయవాలూ గరిష్ఠ స్థాయిలో పని చేసేందుకు దోహదపడుతుంది. అందుకని, కేవలం వ్యాధి నిరోధకత పెంపుదలకు మాత్రమే కాకుండా, మొత్తంగా మానవ శరీర శ్రేయస్సుకు యోగాభ్యాసం అత్యంత ఆవశ్యకం.

కార్యాచరణకు కదులుదాం..

కొవిడ్‌ సోకి, స్వల్ప లక్షణాలతో బాధపడే వారు ఏకాంత గృహ సంరక్షణలో- ప్రాణాంతక వైరస్‌తో పోరాడేందుకు యోగాసనాలు సాధన చేయాలని, శ్వాస సామర్థ్యాన్ని పెంచే కసరత్తులు తప్పక చేయాలని అనేకమంది వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు. ఈ వైరస్‌ ఊపిరితిత్తులపై దాడి చేస్తుంది కాబట్టి మన శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిపుణులు సూచించిన యోగాసనాలు ప్రాణవాయువు స్థాయులను స్థిరంగా ఉంచడంతోపాటు ఊపిరితిత్తుల పనితీరును మెరుగైన పూర్వస్థితికి తీసుకొచ్చే అవకాశం ఉంది. కొవిడ్‌ సోకిన వారికి మాత్రమే కాకుండా, వైరస్‌ బారి నుంచి బయట పడిన వారికీ యోగాభ్యాసం చేయాల్సిందిగా వైద్యులు సూచిస్తున్నారు. యోగాభ్యాస పద్ధతిలో శ్వాసించడం, ప్రాథమిక ఆసనాలు వేయడం, ధ్యాన సాధన వంటివి తీవ్రస్థాయి కొవిడ్‌ బాధిత రోగులకుసైతం మానసిక ప్రశాంతతను కల్పించడమే కాకుండా, శారీరక స్థితిగతులూ మెరుగవుతాయి. ఈ ప్రయోజనాలతోపాటు కొవిడ్‌ నుంచి కోలుకున్నవారు నిపుణులు సూచించినట్లుగా శ్వాస పద్ధతులను మార్చుకోవడం, యోగాసనాలు వేయడం వల్ల వారిలో నిస్సత్తువ తగ్గి, శారీరక సామర్థ్య స్థాయులు సహజరీతిలో పెరుగుతాయి.

యోగా ఒక మృదుశక్తిగా..

ప్రస్తుతం కొవిడ్‌ మహమ్మారివల్ల ప్రపంచం దాదాపు స్తంభించిపోయినట్లుగా మారిన పరిస్థితుల్లో- రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు, ఆత్మ నిశ్చలత సాధనలో యోగాభ్యాసం సమర్థ ఆరోగ్య విధానంగా ఆవిర్భవించే అవకాశం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయంగా అత్యంత ఆదరణ పొందడంతోపాటు, ప్రజల మనసులను ఆకట్టుకోగలిగింది. ఈ క్రమంలో భారత్‌కు యోగా ఒక మృదుశక్తిగా ఆవిష్కృతమైంది. వైరస్‌ వ్యాప్తి లేకపోతే మనమంతా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్ఫూర్తితో యోగా దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకునేవాళ్లం. కానీ, మహమ్మారి కారణంగా ఈ ఏడాది మనం ఇళ్లలోనే ఉంటూ, సామాజిక దూరం పాటిస్తూ వేడుక చేసుకోవాల్సి వస్తోంది. ఏదేమైనా మనలోని స్ఫూర్తిని, ఉత్సాహాన్ని దెబ్బతీసే అవకాశం వైరస్‌కు ఇవ్వకూడదని ఈ సందర్భంగా దేశంలోని పౌరులను, చిన్నారులను కోరుతున్నాను. యోగా దినోత్సవం వేళ ఆసనాలు వేయడానికి మనమంతా కదులుదాం. తద్వారా మనలోని ఆత్మతేజస్సుకు ప్రేరణ అందించి, ఈ కష్టకాలంలో ప్రశాంత చిత్తం సాధనకు యోగా చేద్దాం!

చిన్నారులకూ ఉపయుక్తం!

కొవిడ్‌ విజృంభణ పిల్లల మానసిక స్థితిగతులపై అన్ని స్థాయుల్లో అనూహ్య రీతిలో దుష్ప్రభావం చూపింది. సామాజికంగా, భావోద్వేగపరంగా, శారీరకంగా, విద్యాపరంగా వారిని తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. యోగాసనాల అభ్యసనం పెద్దలకు మాత్రమే కాకుండా, పిల్లల్లో ఒత్తిడిని తొలగించడానికీ తోడ్పడుతుంది. జనాభాలో పిల్లలు, యువతరం సంఖ్య అత్యధికంగా కలిగిన దేశం మనది. ప్రస్తుత సంక్షోభ సమయంలో- ఆ ప్రభావం నుంచి ఉపశమనం పొందడానికి మనవైపు నుంచి మరింత కృషి అవసరం. అందువల్ల పిల్లలు దైనందిన కార్యకలాపాల్లో భాగంగా యోగాభ్యాసం చేసేలా ప్రోత్సహించే బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదే. యోగాభ్యాసం ద్వారా చిన్నారులు వారి అంతర్గత స్వభావంతో మరింత గాఢంగా అనుసంధానమవడంతోపాటు, వారిలో శారీరక దారుఢ్యం, సమన్వయం పెరుగుతాయి. అలాగే అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యే ప్రస్తుత కాలంలో పిల్లల్లో ఏకాగ్రత, మానసిక ప్రశాంతత పెరిగి, ఒత్తిడి తగ్గడం వంటి అనేక ప్రయోజనాలు సమకూరతాయి.

-రమేష్​ పోఖ్రియాల్ 'నిషాంక్​' (రచయిత- కేంద్ర విద్యాశాఖ మంత్రి)

ఇదీ చూడండి: Yoga Day: దూరదర్శన్​లో మోదీ ప్రసంగం

ఇదీ చూడండి: Yoga Day: దేశవ్యాప్తంగా ఫిట్​ ఇండియా యోగా సెంటర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.