ETV Bharat / opinion

ముందస్తు చర్యలు కొరవడి... వరదలు!

తమిళనాడులో భారీవర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి భారీ వర్షాలు. చెన్నై సహా కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూర్‌ జిల్లాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరు జిల్లాలను కుండపోత వానలు, వరదలు కుదిపేశాయి. ఇటీవల భారత్‌, చైనా, ఐరోపా దేశాల్లో సంభవించిన వరదలు, కెనడా, అమెరికాల్లో వడగాడ్పులు ప్రపంచ దేశాలను ఆలోచనలోకి నెట్టాయి.

floods
వరదలు
author img

By

Published : Nov 9, 2021, 5:31 AM IST

Updated : Nov 9, 2021, 6:02 AM IST

నగరాల్లో వరదల ముప్పు పెరుగుతూ పట్టణ ప్రణాళికలకు సవాలుగా మారుతోంది. తాజాగా తమిళనాడులో భారీవర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. చెన్నై సహా కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూర్‌ జిల్లాలు; ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరు జిల్లాలను కుండపోత వానలు, వరదలు కుదిపేశాయి. ఇటీవల భారత్‌, చైనా, ఐరోపా దేశాల్లో సంభవించిన వరదలు, కెనడా, అమెరికాల్లో వడగాడ్పులు ప్రపంచ దేశాలను ఆలోచనలోకి నెట్టాయి. మానవ తప్పిదాల వల్ల వాతావరణంలో వచ్చిన మార్పులే ఈ ఉపద్రవాలకు కారణం. పట్టణ ప్రాంతాల్లో నీటి పారుదల వ్యవస్థలను భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాటు చేయకపోవడంతో భారీ వర్షాలు పడినప్పుడు వరదలు పోటెత్తుతున్నాయి. నీటి ప్రవాహాలు పల్లాన్ని అనుసరించే ఉంటాయి. దీన్ని గ్రహించి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా నీటి పారుదల వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటే, వరదల నష్టాన్ని నివారించే అవకాశం దక్కుతుంది.

ఇటీవల నీతి ఆయోగ్‌ అత్యున్నత నిపుణుల కమిటీ దేశంలో, సరిహద్దుల్లో వరదల నియంత్రణ, నదీ యాజమాన్యాలపై సమగ్రమైన అధ్యయనం చేసింది. హైదరాబాద్‌లో వరదలకు మానవ తప్పిదాలే ప్రధాన కారణమని ఆ కమిటీ తేల్చింది. ఒకప్పుడు భాగ్యనగరం చుట్టుపక్కల చెరువులు, కుంటలు, బావుల వంటి చిన్నా, పెద్దా నీటివనరులు అన్నీ కలిపి లక్ష వరకు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 185కే పరిమితమైంది. సగానికి పైగా చెరువుల ప్రవాహ మార్గాలు మూసుకుపోయాయి. శాస్త్ర విజ్ఞాన, పర్యావరణ కేంద్రం (సీఎస్‌ఈ) విశ్లేషణ ప్రకారం హైదరాబాద్‌ మహానగరంలో 2001-2016 మధ్య 3,245 హెక్టార్ల మేర నీటి వనరులు మాయమైపోయాయి. శరవేగంగా సాగుతున్న పట్టణీకరణ ఫలితంగా దేశంలో చిత్తడి నేలలు, సరస్సులు, చెరువులు, కుంటలు, కాలువలు ఆక్రమణలకు గురవుతున్నాయి. గత పదేళ్లుగా పరిశీలిస్తే దేశంలో అహ్మదాబాద్‌, దిల్లీ, చెన్నై, ముంబయి, సూరత్‌, కోల్‌కతా, జంషెడ్‌పూర్‌, గువాహటి వంటి నగరాలు భారీ వరదల బారిన పడుతున్నాయి. ఫలితంగా తీవ్ర ఆస్తినష్టం సంభవిస్తోంది. ప్రజలూ ప్రాణాలు కోల్పోతున్నారు. వరదలు వచ్చినప్పడు ప్రభుత్వాలు మొక్కుబడిగా హడావుడి చేస్తున్నాయే తప్ప, వాటి నివారణకు సరైన చర్యలు తీసుకోవడంలేదు. చాలా రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాల నివారణ, నిర్వహణకు ప్రభుత్వాల వద్ద సరైన దీర్ఘకాలిక ప్రణాళికలు సైతం లేవని ఇటీవల నీతి ఆయోగ్‌ స్పష్టం చేసింది.

భౌగోళిక పరిస్థితులను అనుసరించి ప్రకృతి వైపరీత్యాల నష్టాలు భారత్‌లో విభిన్న ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంటున్నాయి. కేరళలో నిటారుగా ఉండే పశ్చిమ కనుమల వల్ల అక్కడ పడిన వర్షపు నీరు తక్కువ సమయంలోనే వరద ప్రవాహాలకు కారణమవుతోంది. భాగ్యనగరంలో చాలా లోతట్టు ప్రాంతాలు ఆక్రమణలకు గురి కావడం వరద ముప్పునకు ప్రధాన కారణమవుతోంది. దేశంలోని ప్రతి జిల్లాలో విపత్తు ప్రభావాలను అంచనా వేసేందుకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉంది. ఇందుకోసం విపత్తు నిర్వహణ నిపుణుల సలహాలను కచ్చితంగా పాటించాలి. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో రిమోట్‌ సెన్సింగ్‌ సాంకేతికతతో చిత్రపటాలు రూపొందించి, వాటి ఆధారంగా పట్టణ ప్రణాళికలు రూపొందించాలి. సరస్సులు, చెరువులు, కుంటలు, చిత్తడి నేలలు, కాలువలు ఆక్రమణలకు గురికాకుండా చూసుకోవడం తప్పనిసరి.

నీటి ప్రవాహాన్ని మళ్ళించడం, ఆక్రమణలను తొలగించడం వంటి చర్యల ద్వారా భారీ వర్షాల సమయంలో వరద విజృంభణకు అడ్డుకట్ట వేయవచ్చు. నాలాల్లో ఎప్పటికప్పుడు పూడికతీత చేపట్టడమూ ప్రధాన అంశం. నగరాల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను సైతం విస్తరించాలి. ఎక్కడ వర్షం కురిసినా భూగర్భ డ్రైనేజీ ద్వారా దగ్గరలో ఉన్న చెరువులు, కుంటలు, నదుల్లోకి వరద నీరు చేరేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చర్యలు చేపట్టాలి. అవసరమైన చోట వరద గోడలు నిర్మించాలి. నగరాల్లో భారీ సంఖ్యలో చెట్లను పెంచడం ద్వారా వరదల సమయంలో నేల కోతకు గురికాకుండా చూడవచ్చు. వరద ప్రవాహాల్లో కొట్టుకొచ్చి చెరువులు, కాలువలు వంటి వాటిలో చేరే పూడికను తరచూ తొలగిస్తుండాలి. దానివల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. వరద నీటి నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం సైతం చాలా అవసరం. వరద నిర్వహణ చర్యలపై వారికి సరైన అవగాహన కల్పించాలి. వరదకు సంబంధించి సరైన హెచ్చరికలు చేసే డాప్లర్‌ రాడార్‌ వ్యవస్థలనూ వినియోగించుకోవాలి. సమగ్ర ప్రణాళికను అమలు చేయడం ద్వారానే విలయ తాండవాన్ని కట్టడి చేయగలం.

- ఆచార్య నందిపాటి సుబ్బారావు (ఆంధ్ర విశ్వవిద్యాలయ భూవిజ్ఞాన శాస్త్ర విశ్రాంత ఆచార్యులు)

ఇదీ చూడండి: వినియోగదారుల హక్కులకేదీ భరోసా?

Last Updated : Nov 9, 2021, 6:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.