ETV Bharat / opinion

వేలంపాట తరహాలో మేనిఫెస్టో వాగ్దానాలు

author img

By

Published : Mar 17, 2021, 7:28 AM IST

తమిళనాట ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్లను మభ్యపెట్టడమే లక్ష్యంగా పార్టీల వ్యూహాలు సాగుతున్నాయి. మేనిఫెస్టో వాగ్దానాలు వేలంపాట తరహాలో ఉంటున్నాయి. స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే పార్టీ మేనిఫెస్టోలో ఐదువందలకు పైగా వాగ్దానాలు సంధించారు. హ్యాట్రిక్​ విజయంపై కన్నేసిన అన్నాడీఎంకే వివిధ ఆకర్షణీయమైన తాయిలాలతో ఎన్నికల ప్రణాళికకు తాళింపు పెట్టింది.

Tamil nadu political parties promises in its manifestos
వేలంపాట తరహాలో మేనిఫెస్టో వాగ్దానాలు

'డీఎంకే ఎన్నికల ప్రణాళికను సవాలు చేసేలా మరో మేనిఫెస్టో విడుదలైంది... వేలంలో మాదిరిగా వాళ్లు పాట పెంచి, మా వాగ్దానాల కంటే కొద్దిగా మించి ప్రతిదీ ఇచ్చేస్తామంటున్నారు'- పదేళ్ల క్రితం ఇదే రోజుల్లో ఆ మాటలన్నది తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధి. ఉభయ ద్రవిడ పార్టీలకూ పెద్ద దిక్కుగా ఉన్న జయ, కరుణానిధి కాలధర్మం దరిమిలా తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎప్పటి మాదిరే వాగ్దానాల వరద పోటెత్తుతోంది.

234 సీట్ల అసెంబ్లీకి వచ్చే నెల 6న ఎన్నికలు జరగనున్న దృష్ట్యా 6.1 కోట్ల మంది ఓటర్లను ఆకట్టుకోవడానికి స్టాలిన్‌ సారథ్యంలోని డీఎంకే అయిదు వందలకు పైగా వాగ్దానాల్ని సంధించింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత డేటాతో ట్యాబ్‌లు, పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో కోతలు, రేషన్‌ కార్డుగల మహిళలకు నెలకు వెయ్యి రూపాయలు, దేశీయంగా హిందూ దేవాలయాల యాత్రికులకు పాతిక వేలనుంచి లక్ష రూపాయల దాకా ఆర్థిక సాయం వంటివెన్నో మేనిఫెస్టోలో కొలువు తీరాయి.

అన్నాడీఎంకే వ్యూహమిలా...

హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసిన ఏఐఏడీఎంకే- ఉచిత వాషింగ్‌ మిషన్లు, సౌర కుంపట్లు, ఉచిత కేబుల్‌ కనెక్షన్లు, విద్యార్థులకు రాయితీపై ద్విచక్ర వాహనాలు, రేషన్‌ కార్డుగల మహిళలకు నెలకు రూ.1,500 చెల్లింపు వంటి తాయిలాలతో ఎన్నికల ప్రణాళికకు తాలింపు పెట్టింది.

ఈ తరహా ఉచిత వాగ్దానాలు ప్రజల్ని ప్రభావితం చేసి స్వేచ్ఛగా సక్రమంగా సాగాల్సిన ఎన్నికల ప్రక్రియకు తీవ్రాఘాతం కలిగిస్తాయని 2013 జులైలో స్పష్టీకరించిన సుప్రీంకోర్టు- ఆ జాడ్యానికి విరుగుడుగా తగు మార్గదర్శకాల్ని వెలువరించాలని ఎన్నికల సంఘానికి సూచించింది. రాజకీయ పక్షాలతో విస్తృత సంప్రదింపుల దరిమిలా ఈసీ తెచ్చిన మార్గదర్శకాలు- అనుచిత వాగ్దానాల వరదను ఏమాత్రం నిలువరించలేకపోతున్నాయన్న నిజం ప్రతి ఎన్నికల్లోనూ రుజువవుతూనే ఉంది. అందరికీ అన్నీ ఉచితమేనంటూ ఓటర్లను బుట్టలోపెట్టి, రాష్ట్రాల్ని రుణాల ఊబిలోకి నెట్టి అధికార ఫలాలు భోంచేస్తున్న పార్టీల దురాగతం నిశ్చేష్టపరుస్తోంది!.

ప్రలోభ పెడుతూ...

భారత్​లో ఉన్నది సార్వత్రిక వయోజన ఓటింగ్‌ పద్ధతి కాబట్టి- ఎన్నికయ్యే ప్రతినిధులదే కాదు, ఓటర్ల నిజాయతీనీ పదిలంగా కాపాడుకోవాలని జస్టిస్‌ చాగ్లా సూచించి ఏడు దశాబ్దాలవుతోంది. తా చెడ్డ కోతి వనమెల్లా చెరచిన చందంగా ఎన్నికల వేళ ప్రత్యక్ష నగదు బదిలీలతో ఓటర్లను ప్రలోభపెట్టడంలో రాటుతేలిపోయిన పార్టీలు- రాష్ట్ర ఖజానాలోని జనం డబ్బుతోనే వారి ఓట్లను కొనుగోలు చేసే దుర్రాజకీయాన్ని ప్రణాళికాబద్ధంగా కొనసాగిస్తున్నాయి. మేనిఫెస్టోల ద్వారా పార్టీలు ఓటర్లకు వేస్తున్న ఎరల్ని ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 123 విభాగం కింద అవినీతిగా పరిగణించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.

పౌరులకు వివిధ సంక్షేమ పథకాల్ని అమలు చేయగల అవకాశాన్ని ఆదేశిక సూత్రాలే కల్పిస్తున్నందున, మేనిఫెస్టోల్లో అలాంటి వాగ్దానాలకు అభ్యంతరం లేదని ఈసీ స్పష్టీకరించింది. అదే సమయంలో- ఎన్నికల ప్రక్రియ పవిత్రతకు భంగకరమైనవాటి జోలికి పోవద్దంటూ పార్టీలకు ఈసీ దయచేసిన ఉచిత సలహా ఎందుకూ కొరగానిది.

పార్టీల మేనిఫెస్టోలపై తక్కిన ప్రజాస్వామ్య దేశాల వ్యవహార సరళిని ఆరా తీసిన ఈసీ- భూటాన్‌ మెక్సికోల్లో ఆయా ఎన్నికల ప్రణాళికల్లో అభ్యంతరకర అంశాల్ని తొలగించే వీలుందని గుర్తించింది. మేనిఫెస్టోలకు తగు మార్గదర్శకాల్ని బ్రిటన్‌ వెలువరిస్తుంది. అదే ఇక్కడ, అధికారం కోసం ఎంతకైనా తెగించే పార్టీల నైజం సమస్త ప్రజాతంత్ర విలువల్నీ కాలరాస్తున్నా, ఈసీ మౌన ప్రేక్షక పాత్రకే పరిమితం కావడాన్ని మించిన విషాదం ఉందా?. తమిళనాట రేషన్‌ కార్డుగల మహిళకు నెలనెలా వెయ్యి రూపాయలన్న వాగ్దానం అమలుకే ఏటా రూ.21వేల కోట్లు కావాలంటున్నారు. పదేళ్లలో జనంపై తలసరి అప్పు రూ.15 వేలనుంచి రూ.57వేలకు పెరిగి, రుణాలకు సంబంధించి అసలు, వడ్డీలు కట్టడానికే ఏటా రూ.51 వేల కోట్లు కరిగిపోతున్న తమిళనాట తాజా 'ఉచిత' రాజకీయం రాష్ట్రాన్ని ఏం చేయనున్నట్లు?.

ఇదీ చదవండి:బిహార్​లో రూ.6.25కోట్ల మాదకద్రవ్యాలు పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.