ETV Bharat / opinion

'శాస్త్రీయతకు తిలోదకాలు.. సంక్షోభంలోనూ మూఢత్వం'

అభివృద్ధిలో ప్రపంచ దేశాలకు దీటుగా దూసుకెళ్తున్న భారత్​లో ఇప్పటికీ అనేక రూపాల్లో మూఢ నమ్మకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ్‌ బంగ, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో 'కరోనా దేవి' ఆరాధన, ఒడిశాలో ఓ పూజారి ప్రముఖ దేవాలయంలో నరబలికి పాల్పడటం, తాజాగా ఝార్ఖండ్‌లోని కొడేర్మా జిల్లాలో కరోనా రాకుండా శాంతి పూజల పేరిట 400 గొర్రెలను అమ్మవారి ఆలయంలో బలి ఇచ్చిన సంఘటనలు మూఢ నమ్మకాల జోరును ధ్రువీకరిస్తున్నాయి.

SUPERSTITIONS OF PEOPLE DURING COVID 19
సంక్షోభంలోనూ వీడని మూఢత్వం.. శాస్త్రీయ వైఖరులకు తిలోదకాలు
author img

By

Published : Jun 28, 2020, 9:18 AM IST

మానవుడికి, ప్రకృతికి మధ్య జరిగిన ఘర్షణ నుంచి పుట్టినదే సైన్స్‌. ఇది గొప్ప వైజ్ఞానిక విప్లవానికి బీజం వేసిందనడంలో సందేహం లేదు. విజ్ఞాన శాస్త్ర ఫలాలను అందిపుచ్చుకొన్న భారత్‌.. అభివృద్ధిలో ప్రపంచ దేశాలకు దీటుగా సాగుతున్నా ఇప్పటికీ అనేక రూపాల్లో మూఢ నమ్మకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవి ఆచరణలో నిరూపితం కాని అశాస్త్రీయ విశ్వాసాలు. విజ్ఞానశాస్త్ర పరంగా ఎంతో పురోగతి సాధించినా నేటికీ నిమ్మకాయలు, మిరపకాయలు, పసుపు, కుంకుమ లాంటివి కనిపిస్తే కొంతమంది ఉలిక్కిపడుతుంటారు. బాణామతి, చేతబడి, దయ్యాలు, భూతాలు, మంత్రాలు వంటి రకరకాల అంధవిశ్వాసాలు పెరుగుతున్నాయి. నరబలులు, జంతుబలులను ఆచరిస్తున్నారు. మెజారిటీ గ్రామీణ, పట్టణ పేద కుటుంబాలతోపాటు విద్యావంతులు సైతం వీటి బారిన పడి మోసపోతున్నారు. ఇవి మానసిక రుగ్మతలకు దారి తీస్తున్నాయి. ఈ ఆధునిక కాలంలో సైతం ఇలాంటి వ్యవహారాలు కొనసాగడం ఆందోళన కలిగించే విషయం.

కరోనా దేవికి పూజలు..

డిజిటల్‌ భారత్‌లో ప్రస్తుతం కరోనా సంక్షోభంలో సైతం పలు రాష్ట్రాలు, ప్రాంతాల్లో అనేక అంధ విశ్వాసాలు, వదంతులు వెలుగు చూశాయి. లాక్‌డౌన్‌ వేళ కరోనా నియంత్రణకు తెలంగాణలో వేపచెట్టుకు నీళ్ల పూజలు, గ్రామ దేవతలకు పూజలు, జనం గుండ్లు కొట్టించుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. గుజరాత్‌లో ఒక యువకుడు అమ్మవారికి నాలుకను నైవేద్యంగా సమర్పించిన ఉదంతం మూఢత్వానికి నిదర్శనంగా నిలిచింది. బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ్‌ బంగ, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో 'కరోనా దేవి' ఆరాధన, ఒడిశాలో ఓ పూజారి ప్రముఖ దేవాలయంలో నరబలికి పాల్పడటం, తాజాగా ఝార్ఖండ్‌లోని కొడేర్మా జిల్లాలో కరోనా రాకుండా శాంతి పూజల పేరిట 400 గొర్రెలను అమ్మవారి ఆలయంలో బలి ఇచ్చిన సంఘటనలు- మూఢ నమ్మకాల జోరును ధ్రువీకరిస్తున్నాయి. ఒకవైపు ప్రపంచం కరోనాతో యుద్ధం చేస్తుంటే ఇలాంటి మూఢత్వ వదంతులు, నమ్మకాలు ప్రజల్లో ఉదాసీనతను పెంచి వ్యాధి విజృంభణకు కారణమవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా- చెవికెక్కకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వర్షాకాలంలో ప్రబలే అంటువ్యాధులకు గ్రామీణులు భూతవైద్యులను ఆశ్రయించే ఆచారం కొనసాగుతుండటం, ఇటీవల అమావాస్య రోజు ఏర్పడిన సూర్యగ్రహణం చుట్టూ అలముకున్న అపోహలు- మూఢనమ్మకాలకు నిదర్శనాలు. గ్రామీణ ప్రాంతాల్లో మూఢ విశ్వాసాల తీవ్రత పెరుగుతున్న కొద్దీ మంత్రగాళ్ల నెపంతో అనుమానితులను అమానవీయంగా వేధించడం, క్రూరంగా చంపడం వంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఇవి శాంతి భద్రతలు, ప్రజారోగ్యానికి పెను సవాలుగా నిలుస్తున్నాయి.

మహిళలే బాధితులు..

మంత్రాల నెపంతో జరుగుతున్న హత్యల్లో ఎక్కువ మంది మహిళలే బాధితులుగా మారుతుండటం గమనార్హం. మూఢనమ్మకాల తీవ్రతను పరిశీలిస్తే... అత్యధికంగా ఝార్ఖండ్‌, ఒడిశాలతో పాటు ఉత్తర భారత్‌లోని కొన్ని వెనకబడిన రాష్ట్రాల్లోనూ ఎక్కువగానే ప్రబలుతున్నట్లు అధికార గణాంకాలు వెల్లడి స్తున్నాయి. ప్రస్తుతం అభివృద్ధి పరంగా కొంత ముందంజలో ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో సైతం మూఢత్వ ఆనవాళ్లు కనబడటం శోచనీయం. దేశవ్యాప్తంగా మంత్ర విద్యను నేరాల కింద పరిగణించకపోవడం వల్ల సదరు ఆరోపణలతో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల గణాంకాలు అధికారికంగా లేవు. అనాగరిక విశ్వాసాలకు అవిద్య, పేదరికంతో కొరవడిన వైజ్ఞానిక వైఖరి, వైద్య సదుపాయాల లేమి, చట్టపరమైన లొసుగులు ముఖ్య కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ విషయంలో 2013లో మహారాష్ట్ర మూఢనమ్మకాల వ్యతిరేక చట్టాన్ని తీసుకువచ్చి గొప్ప మార్పునకు నాంది పలికింది. ఇటీవల కర్ణాటక సైతం ఇదేతరహాలో ముందడుగు వేసింది. కేరళ సైతం అదేబాటన నడుస్తూ చట్టం దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.

చర్యలు అవసరం..

మూఢనమ్మకాలనేవి దేశ సామాజిక సమస్యగా మారిన నేపథ్యంలో వాటి నిర్మూలనపై అవగాహనతోపాటు విధాన పరమైన చర్యలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. సామాజిక అభివృద్ధితో పాటు వైజ్ఞానిక దృక్పథానికి పెద్ద పీట వేసే కార్యక్రమాలను చేపట్టాలి. వయోజన విద్యా కార్యక్రమాలను మళ్ళీప్రారంభించాలి. దేశవ్యాప్తంగా ఉమ్మడి మూఢనమ్మకాల నిరోధక చట్టాన్ని తీసుకురావాలి. హేతువాద దృక్పథాన్ని పెంపొందించే పాఠ్యాంశాలను పుస్తకాల్లో చేర్చాలి. జన విజ్ఞాన వేదిక, కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్‌ వంటి ప్రజాసైన్స్‌ ఉద్యమ సంస్థలతో ప్రజల్లో శాస్త్రీయ వైఖరిపై అవగాహన పెంపొందించాలి. కొవిడ్‌ మహమ్మారి విషయంలోనూ మూఢత్వ భావాలను చెదరగొట్టడంలో ప్రజలు, పౌర సంఘాలు, మీడియా సామాజిక బాధ్యతతో ముందుకు రావాలి. ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం అవగాహన పెంచాలి. అప్పుడే ప్రజలు అంధవిశ్వాసాలకు దూరంగా, వైజ్ఞానిక భారత్‌ వైపు అడుగులు వేసేందుకు అవకాశం ఏర్పడుతుంది.

- సంపతి రమేష్‌ మహారాజ్‌, సామాజిక విశ్లేషకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.