ETV Bharat / opinion

సౌర విద్యుత్తుతో వ్యవసాయంలో వెలుగులు - భారతదేశంలో వ్యవసాయం

ఏటా పెరుగుతున్న మోటార్లు, విద్యుత్‌ ధరలతో రాబోయే పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యవసాయ రాయితీ తలకు మించిన భారం కానుంది. ఇంత పెద్ద ఎత్తున ఖర్చు భరించినప్పటికీ, తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాల్లో విడతలవారీగా పగలు రాత్రివేళల్లో పరిమిత గంటలు కరెంటు ఇస్తున్నారు. దీంతో రైతులకు అవసరమైన సమయంలో విద్యుత్తు అందక వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలన్నింటికీ ఒకే పరిష్కారం- అనూహ్యంగా ధరలు దిగివచ్చిన సౌర విద్యుత్తే అవుతుందని అంచనా వేస్తున్నారు.

AGRICULTURE
సౌర విద్యుత్తు
author img

By

Published : Aug 6, 2020, 10:09 AM IST

గ్రామీణ భారతంలో వ్యవసాయమే ప్రధాన వృత్తి. ఒకవైపు వ్యవసాయ భూ విస్తీర్ణం తరుగుతోంది. మరోవైపు పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలు తీర్చాలి. అందుకోసం వ్యవసాయ ఉత్పత్తులను పెంచాలి. ప్రస్తుతం మూడింట రెండొంతుల వ్యవసాయం భూగర్భ జలాలపై ఆధారపడే సాగుతోంది. కేంద్రప్రభుత్వ ‘సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ’ గణాంకాల ప్రకారం, దేశంలో 2.2 కోట్ల వ్యవసాయ విద్యుత్‌ మోటార్లు ఉన్నాయి. అవి 2.1 లక్షల కోట్ల యూనిట్ల విద్యుత్తును వాడుతున్నాయి. మొత్తం వినియోగంలో ఇది 18శాతం వరకు ఉంది. తెలంగాణలో 24.31 లక్షల పంపుసెట్లకు, 2,036 కోట్ల యూనిట్లు (మొత్తం వినియోగంలో 36శాతం), ఆంధ్రప్రదేశ్‌లో 18.37 లక్షల పంపుసెట్లకు, 1,200 కోట్ల యూనిట్లు (మొత్తం వినియోగంతో 29 శాతం) వాడుతున్నారు.

పలు ప్రయోజనాలు

వ్యవసాయానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా, దేశంలోని అన్ని రాష్ట్రాలు విద్యుత్తును ఉచితంగానో, తక్కువ ధరకో ఇస్తున్నారు. ఈ భారంలో కొంత ఇతర వినియోగదారులనుంచి సర్దుబాటు చేస్తున్నారు. సింహభాగం రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ రూపంలో భరిస్తున్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తంలో వ్యవసాయ విద్యుత్తు రాయితీ విలువ రూ.1.10 లక్షల కోట్లు ఉండగా, తెలంగాణ రూ.10 వేలకోట్లు, ఆంధ్రప్రదేశ్‌ రూ.6,000 కోట్లు మించి భరిస్తున్నాయి. ఏటా పెరుగుతున్న మోటార్లు, విద్యుత్‌ ధరతో, రాబోయే పదేళ్లలో ఈ వాడకం రెండింతలయ్యే అవకాశం ఉంది. దీంతో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యవసాయ రాయితీ తలకు మించిన భారం కానుంది. ఇంత పెద్దయెత్తున ఖర్చు భరించినప్పటికీ, తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాల్లో విడతలవారీగా పగలు రాత్రివేళల్లో పరిమిత గంటలు కరెంటు ఇస్తున్నారు. దీంతో రైతులకు అవసరమైన సమయంలో విద్యుత్తు అందక వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలన్నింటికీ ఒకే పరిష్కారం- అనూహ్యంగా ధరలు దిగివచ్చిన సౌర విద్యుత్తు కాగలదు.

ప్రధానమంత్రి కుసుమ్‌ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 60శాతం రాయితీతో, 2021నాటికి 10 లక్షల మోటార్లకు సౌర విద్యుత్‌ కల్పించాలని సంకల్పించారు. కానీ, కొత్త పెట్టుబడి, సౌర ఫలకాలకు నిరంతర భద్రత, నిర్వహణ, తదితర సమస్యలవల్ల రైతులు ఈ పథకంపై అంతగా ఆసక్తి చూపడం లేదు. గుజరాత్‌ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, హరియాణా తదితర రాష్ట్రాలు ఎంతో ప్రయత్నించి కేవలం 1.42 లక్షల మోటార్లను మాత్రమే సౌర విద్యుత్తుకు మార్చగలిగాయి. ప్రతి 11 కేవీ వ్యవసాయ ఫీడర్‌ పరిధిలోని మోటార్లన్నింటికీ సరిపడా ఒకేచోట 0.5 నుంచి రెండు మెగావాట్ల సామర్థ్యం గల చిన్న సౌర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను స్థాపించి ఎక్కడికక్కడ సౌర విద్యుత్‌ పంపిణీ చేయడం ఈ పథకం ఉద్దేశం. ఈ కొత్త విధానంవల్ల వ్యక్తిగత విద్యుత్‌ మోటార్లను సౌర విద్యుత్తుతో అనుసంధానం చేయడంలోగల అనేక సమస్యలను అధిగమించవచ్చు.

ఈ సౌర విద్యుత్తు కేంద్రాలు, వినియోగం వద్దే ఉత్పత్తి అవుతుండటంతో సరఫరా పంపిణీ నష్టాలు దిగివస్తాయి. అదనపు లైన్ల అవసరం ఉండదు కనుక పెట్టుబడులూ తగ్గుతాయి. సౌర విద్యుత్తు ఉత్పత్తి, వాడకం ఒకే సమయంలో ఉండటంతో గ్రిడ్‌పై భారం ఉండదు. అన్నింటికి మీటర్లు ఏర్పాటు చేయడం ద్వారా వ్యవసాయ వినియోగాన్ని కచ్చితంగా లెక్కించవచ్ఛు అనధికార సర్వీసులనూ గుర్తించవచ్ఛు ఈ విధంగా ఎక్కడికక్కడ అవసరం మేరకు, చిన్న సౌర విద్యుత్తు కేంద్రాలను వ్యవసాయ ఫీడర్లలో ఏర్పాటు చేయడంవల్ల ప్రభుత్వాలకు ఏటా వేలకోట్ల రూపాయల మేర వ్యవసాయ విద్యుత్‌ రాయితీ భారం నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్రామాల్లో వీటి స్థాపన నిర్వహణల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. కేంద్ర ప్రభుత్వ నిర్దేశిత 8.75 శాతం సౌర విద్యుత్‌ ఉత్పత్తిని చేరుకోవడం ద్వారా సంబంధిత పంపిణీ సంస్థలు అపరాధ రుసుం కూడా తప్పించుకోవచ్ఛు

అవకాశాల వెల్లువ

ఓ మెగావాట్‌ సామర్థ్య సౌరకేంద్రం 350 ‘ఫైవ్‌హెచ్‌పీ’ మోటార్లకు విద్యుత్‌ అందించగలదు. వీటి స్థాపనకు ఎకరం భూమి, సౌర ఫలకాలకు రూ. 3.5 కోట్లు ఖర్చు అవుతుంది. పెట్టుబడి అయిదేళ్లలోపు తిరిగి పొందవచ్ఛు అంటే అదనంగా ఇరవై ఏళ్లు ఉచితంగా విద్యుత్తు పొందవచ్ఛు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఫీడర్లలో సౌర విద్యుత్‌ కేంద్రాల స్థాపనకు అవసరమైన పెట్టుబడిలో 30 శాతం రాయితీ ఇవ్వనుంది. మిగతా మొత్తాన్ని ప్రభుత్వరంగ సంస్థలు స్వల్ప వడ్డీతో రుణంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.

సౌర విద్యుత్‌ కేంద్రాల స్థాపన ఆయా ఫీడర్ల పరిధిలో గల ప్రభుత్వ లేదా వ్యవసాయానికి అనువుగాలేని చౌడు బీడు భూముల్లో ఏర్పాటు చేసుకోవచ్ఛు ఇది ప్రభుత్వ పంపిణీ సంస్థలు, రైతు సహకార సమాఖ్యలు, స్వచ్ఛంద సంస్థలు, నిరుద్యోగ యువత, భూస్వాములకు సదవకాశం. రైతులు లేదా సంస్థలు, ఉత్పత్తి చేసిన విద్యుత్తును సంబంధిత పంపిణీ సంస్థకు అందజేయడం ద్వారా, నెలవారీగా, 25 ఏళ్లపాటు నికర ఆదాయం పొందవచ్ఛు వ్యక్తిగత సౌరవిద్యుత్‌ మోటార్లతో పోలిస్తే ఖర్చు, భద్రత నిర్వహణాపరంగా ఇదెంతో ఉత్తమమైనవి.

గ్రిడ్‌ అనుసంధానం వల్ల వర్షకాలంలో, అవసరం లేనప్పుడు విద్యుత్తును సంబంధిత పంపిణీ సంస్థకు సరఫరా చేయవచ్చు, ఏదైనా కారణంవల్ల సరిపడా విద్యుత్‌ ఉత్పత్తి కానప్పుడు గ్రిడ్‌ నుంచి నేరుగా సరఫరా పొందవచ్ఛు మహారాష్ట్ర ప్రభుత్వం 2018లోనే ముఖ్యమంత్రి సౌర కృషి వాహిని యోజన ద్వారా పైలెట్‌ ప్రాజెక్టును విజయవంతంగా స్థాపించింది. ఆపై కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ‘ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌’తో 500 మెగావాట్లకు ఒప్పందం కుదుర్చుకుని ఇప్పటికే, 100 మెగావాట్లమేర కేంద్రాలను వ్యవసాయ మోటార్ల కోసం స్థాపించింది.

తెలుగు రాష్ట్రాల్లో...

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’ అనే సంస్థను స్థాపించింది. రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ పంపుసెట్లకు పగటిపూట తొమ్మిది గంటల నాణ్యమైన, ఉచిత విద్యుత్‌ సరఫరా లక్ష్యంతో, 10వేల మెగావాట్ల సౌర విద్యుత్తుకు ప్రణాళిక సిద్ధం చేసింది. వికేంద్రీకరణ చిన్న కేంద్రాల స్థాపన ద్వారా పూర్తి లాభాలు పొందవచ్ఛు రైతులకు లాభదాయక వ్యవసాయమే లక్ష్యంగా నియంత్రిత సాగు విధానంతో ముందుకు వెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం, సాగుకు అనువుగా లేని భూముల్లో సౌర విద్యుత్తు వినియోగ పంటల్ని ప్రోత్సహించినట్లయితే, సంబంధిత రైతులకు లబ్ధి చేకూరుతుంది. ఈ తరహాలో మిగతా రాష్ట్రాలూ అవకాశాలను అందిపుచ్చుకోవాలి. రైతుల సహకారంతో పకడ్బందీగా వ్యవసాయ ఫీడర్లలో సౌర విద్యుత్తు కేంద్రాలు స్థాపించాలి. అప్పుడే ఆకలి తీర్చే రైతులు స్వచ్ఛమైన విద్యుత్‌ ఉత్పత్తికి దోహదపడతారు. విద్యుత్‌ రంగంలో దేశం స్వయంసమృద్ధికి తోడ్పడతారు.

(రచయిత- ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఇంధనరంగ నిపుణులు)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.