ETV Bharat / opinion

సామాజిక మాధ్యమాల వేదికగా రాజకీయ పోరు

కొన్నేళ్లుగా దేశంలో అంతర్జాలం వాడేవారి సంఖ్య బాగా పెరిగింది. స్మార్ట్‌ఫోన్లు, డేటా ప్యాకేజీలు అందుబాటులోకి రావడంతో ఇప్పుడు దాదాపు ప్రతి ఇంట్లో అంతర్జాలంతో కూడిన కనీసం రెండు ఫోన్లు ఉంటున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా డిజిటల్‌ ప్రచారంతో ప్రతిపక్షాలను మట్టి కరిపించే నాటికి దేశంలో కేవలం 30 కోట్ల మందికి మాత్రమే అంతర్జాలం అందుబాటులో ఉండగా, ఇప్పుడా సంఖ్య 70 కోట్లకు చేరుకుంది. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్న విషయాన్ని అర్థం చేసుకున్న ఇతర పక్షాలు క్రమంగా సామాజిక మాధ్యమాల్లోకి ప్రవేశించడం మొదలుపెట్టాయి.

author img

By

Published : Oct 7, 2020, 7:10 AM IST

social media becoming political war for parties
సామాజిక మాధ్యమాల వేదికగా రాజకీయ పోరు

సామాజిక మాధ్యమాల ద్వారా తన వాదనను, భావజాలాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెబుతూ, వాటిని సమర్థంగా ఉపయోగించుకోగలిగిన తొలి రాజకీయ పక్షం... భాజపా. దేశంలోని ఇతర పార్టీలన్నింటికంటే వేగంగా సామాజిక మాధ్యమాల్లోకి ప్రవేశించి తన 'సోషల్‌ ప్రెజెన్స్‌'ను పెంచుకుంది. ట్విటర్‌, ఫేస్‌బుక్‌ లాంటి మాధ్యమాల ద్వారా యువతను ఆకర్షించింది. దాని ఫలితాలు గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో స్పష్టంగా కనిపించాయి. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్న విషయాన్ని అర్థం చేసుకున్న ఇతర పక్షాలు క్రమంగా సామాజిక మాధ్యమాల్లోకి ప్రవేశించడం మొదలుపెట్టాయి. ప్రధాని నరేంద్రమోదీని వ్యతిరేకించేందుకు, తమ వాదన వినిపించేందుకు ఇదే మంచి మార్గమని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 31న ప్రసారమైన ప్రధాని ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమాన్ని పీఎంఓ ఇండియా అధికారిక యూట్యూబ్‌ ఛానల్లో 19 లక్షల మంది చూశారు. దాన్ని 'లైక్‌' చేసినవారు 1.1 లక్షల మంది. డిజ్‌లైక్‌ చేసినవారు 1.9 లక్షల మంది. సామాన్య ప్రజలే తమ అభిప్రాయాలను ఇలా వ్యక్తం చేశారా అనేది సందేహాస్పదమే! భాజపా రాజకీయ ప్రత్యర్థులు తమ సామాజిక మాధ్యమ సైన్యాన్ని బలోపేతం చేసుకుని, ఈ 'డిజ్‌లైక్‌' యుద్ధం మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. ట్విటర్‌లోనూ మోదీ పుట్టినరోజును జాతీయ నిరుద్యోగ దినం అనే హ్యాష్‌ట్యాగ్‌తో మోతెక్కించారు. ఇలాంటి చర్యల ద్వారా నిజంగానే భారతీయుల రాజకీయ దృక్పథాలను మార్చగలిగే పరిస్థితి ఉంటుందా, ప్రతిపక్షాలు ఈ తరహా ప్రచారాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకోగలవా అనే ప్రశ్నలకు కచ్చితంగా అవుననే సమాధానాలు రావడం లేదు. అయితే, సామాజిక మాధ్యమాల్లో భాజపాకు గతంలో ఉన్నంత ఏకస్వామ్యం ఇప్పుడు లేకపోయినా, మోదీకి దీటుగా ప్రతిపక్షానికి గట్టి నాయకుడంటూ లేకపోవడం కమలదళానికి కొంత సానుకూలమని చెప్పక తప్పదు.

పెరిగిన అంతర్జాల వినియోగం

కొన్నేళ్లుగా దేశంలో అంతర్జాలం వాడేవారి సంఖ్య బాగా పెరిగింది. స్మార్ట్‌ఫోన్లు, డేటా ప్యాకేజీలు అందుబాటులోకి రావడంతో ఇప్పుడు దాదాపు ప్రతి ఇంట్లో అంతర్జాలంతో కూడిన కనీసం రెండు ఫోన్లు ఉంటున్నాయి. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాలు అందరికీ పరిచయమయ్యాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా డిజిటల్‌ ప్రచారంతో ప్రతిపక్షాలను మట్టి కరిపించే నాటికి దేశంలో కేవలం 30 కోట్ల మందికి మాత్రమే అంతర్జాలం అందుబాటులో ఉండగా, ఇప్పుడా సంఖ్య 70 కోట్లకు చేరుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ సంఖ్య దాదాపు 93 కోట్లకు చేరువవుతుందని అంచనా. సామాజిక మాధ్యమాలను వాడేవారు సైతం 2014తో పోలిస్తే ఇప్పుడు రెట్టింపు అయ్యారు. అప్పట్లో ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వాడే భారతీయులు కేవలం 14.22 కోట్ల మందే. ఇప్పుడా సంఖ్య 38 కోట్లకు చేరింది. 2024 ఎన్నికల నాటికి మరో పదికోట్ల మంది సామాజిక మాధ్యమాల్లో చేరతారని అంచనా. ఫేస్‌బుక్‌ జన్మించిన అమెరికాలో ఇప్పుడు దాన్ని 19 కోట్ల మంది వాడుతుంటే, మనదేశంలో 29 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. ట్విటర్‌ వాడకంలో అమెరికా, జపాన్‌ల తరవాత 1.7 కోట్ల మందితో భారత్‌ మూడోస్థానంలో ఉంది.

కులాలు, మతాలు, భాషలు, పట్టణ-గ్రామీణ ప్రాంతాలు, ధనిక-పేద-మధ్యతరగతి... ఇలా విభిన్న రకాల ఓటర్లుండే భారతదేశంలో ఎన్నికలను ఏయే అంశాలు ప్రభావితం చేస్తాయని గంపగుత్తగా లెక్కలేయడం కష్టం. ఇలాంటి భేదాలన్నింటినీ అధిగమిస్తున్నవే సామాజిక మాధ్యమాలు. ఇవి అన్ని ప్రాంతాల్లో వివిధ భావజాలాలు కలిగిన వారందరినీ ఒక్కతాటిపైకి తెస్తున్నాయి. దిల్లీలో ఉండే ప్రశాంతభూషణ్‌ అనే న్యాయవాదిపై కోర్టుధిక్కార కేసులో రూపాయి జరిమానా విధించడం లాంటి అంశాలపై దక్షిణ భారతంలోని మారుమూల ప్రాంతాల్లోనూ విస్తృత చర్చలు జరిగి, కొన్నిచోట్ల ఆయనకు మద్దతుగా ప్రదర్శనలు సైతం నిర్వహించడమే ఇందుకు నిదర్శనం.

ఎన్నికలపై ప్రభావం సందేహాస్పదమే...

వార్తా మాధ్యమాల ద్వారా సమాచారం అందుతుండగా- సామాజిక మాధ్యమాలు మాత్రం ఒక అంశంపై నిర్దిష్ట అభిప్రాయం ఏర్పడేలా చేయగలుగుతున్నాయి. 2018 నుంచి ఇటీవలి కాలం వరకు అనేక నిరసన కార్యక్రమాలకు సామాజిక మాధ్యమాలే ఊతమిచ్చి, దేశవ్యాప్తంగా వెల్లువెత్తేలా చేశాయి. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలో మార్పులు ప్రవేశపెట్టాలని భావించినప్పుడు సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారంతోనే దేశవ్యాప్తంగా పెద్దయెత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. వీటికి నాయకత్వం వహించిన వారెవరూ బయటికి కనిపించరు. వాట్సాప్‌ గ్రూపులు, ఫేస్‌బుక్‌ ద్వారా విషయం తెలుసుకుని ఎవరికి వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఉద్యోగాలు పోవడం, వ్యాపారాలు మూతపడటం, సామాన్యుల నుంచి ప్రభుత్వాల వరకు అందరి ఆర్థిక స్థితిగతులు తలకిందులు కావడంపై సామాజిక మాధ్యమాల్లో పెద్దపెట్టున ప్రచారం సాగుతోంది. కేంద్రానికి ఇవన్నీ పంటికింద రాళ్లే అయినా- ఎన్నికల్లో ఇదంతా ప్రభావం చూపుతుందా అనేది సందేహమే. ఇంతకుముందు కూడా భాజపాకు, ప్రధానికి వ్యతిరేకులు లేకపోలేదు. కాకపోతే అప్పట్లో వాళ్లలో చాలామంది సామాజిక మాధ్యమాల్లో లేరు. ఉన్నా వాటిని ఈ తరహా ప్రచారానికి వాడుకోలేదు. ఇప్పుడు మాత్రం తమ సామాజిక ఉనికిని బలంగా చాటుతున్నారు. అప్పుడు, ఇప్పుడు ఇలాంటి ఉనికిని ఓట్లరూపంలోకి మార్చుకోవడం తేలికేమీ కాదన్నది సామాజిక మాధ్యమ విశ్లేషకుల మాట. ఈ మాత్రం ఉనికినైనా ఎదుర్కోవడానికి భాజపా సామాజిక మాధ్యమ సైన్యం ఎలాంటి కొత్త ఎత్తులు వేస్తుందో చూడాలి. అన్ని పక్షాలూ తమ నిరసనలు, ఆందోళనల యుద్ధానికి సామాజిక మాధ్యమాలనే వేదికలుగా మలచుకుంటూ వాటిని వేడెక్కిస్తున్నారనేది కాదనలేని వాస్తవం!

- పువ్వాడ రఘురామ కామేశ్వరరావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.