ETV Bharat / opinion

కరోనా వేళ ముంచుకొస్తున్న సాంక్రామిక వ్యాధులు - కరోనా వైరస్​

భారత్​లో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. అదే సమయంలో సాంక్రామిక వ్యాధుల ముప్పు ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఒక్క కరోనాపైనే దృష్టి కేంద్రీకరించి, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని, ఇతర రోగ నిరోధక చర్యల్నీ వాయిదా వేయడం ప్రమాదకరమన్న హెచ్చరికలు, కొవిడ్‌ సైతం సీజనల్‌ వ్యాధిగా మారుతుందన్న అధ్యయనాలు ఆందోళన కలిగిస్తున్న వేళ- సాంక్రామిక రోగాల ముసురు మొదలైంది.

seasonal disease are causing fear among people
కరోనా వేళ ముంచుకొస్తున్న సాంక్రమిక వ్యాధులు
author img

By

Published : Jun 23, 2020, 7:54 AM IST

ఇండియాలో దాదాపు నాలుగు లక్షల 25వేల మందికి సోకి 13,700 నిండు ప్రాణాల్ని కబళించిన కరోనాకు కళ్ళెం వెయ్యడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శక్తి యుక్తులు కూడదీసుకొంటున్న వేళ- వానకాల సాంక్రామిక వ్యాధుల ముప్పు నడినెత్తిన ఉరుముతోంది. ఏటా తప్పని పీడగా దాపురించి రెండు విడతలుగా చెలరేగుతున్న స్వైన్‌ఫ్లూ (హెచ్‌1ఎన్‌1) నిరుటి కంటే ఉద్ధృతంగా ఉందని కేంద్రం పార్లమెంటుకు నివేదించిన నేపథ్యంలోనే కొవిడ్‌ కోరసాచింది. స్వైన్‌ఫ్లూ కేసులు అత్యధికంగా నమోదైన మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌, దిల్లీ, తమిళనాడు రాష్టాల్లో కరోనా విలయతాండవం విస్తుగొలుపుతోంది. ఒక్క కరోనాపైనే దృష్టి కేంద్రీకరించి, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని, ఇతర రోగ నిరోధక చర్యల్నీ వాయిదా వేయడం ప్రమాదకరమన్న హెచ్చరికలు, కొవిడ్‌ సైతం సీజనల్‌ వ్యాధిగా మారుతుందన్న అధ్యయనాలు ఆందోళన కలిగిస్తున్న వేళ- సాంక్రామిక రోగాల ముసురు మొదలైంది. డెంగీ, చికున్‌ గన్యా, మలేరియా, డయేరియా, టైఫాయిడ్‌, విషజ్వరాలు, కలరా, మెదడువాపు, పచ్చ కామెర్లు వంటివి సాధారణంగా వాన కాలంలో విజృంభించి అభాగ్యుల ప్రాణాలు తోడేస్తుంటాయి. డెంగీ, కొవిడ్‌ లక్షణాలు దాదాపు ఒక్క తీరుగా ఉండి, కరోనా పాజిటివ్‌ తేలిన వాళ్లలోనూ డెంగీ కనపడిన కేసులు ముంబయిలోనే నమోదయ్యాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటివి వానకాలంలో సర్వసాధారణమైన దేశంలో కరోనా ప్రాథమిక లక్షణాలూ అవే కావడం- ప్రజానీకంలో భయాందోళనలు పెంచుతోంది. వానకాలం ముంచుకొస్తున్నందున కరోనాయేతర వ్యాధుల కట్టడికోసం వైద్య ఆరోగ్య వ్యవస్థల్ని పటిష్ఠీకరించి సిద్ధం చేయాలని అయిదు వారాల క్రితం ప్రధాని సూచించారు. కొవిడ్‌ కేసులు పుంజాలు తెంచుకొంటున్న సమయంలో- విష జ్వరాల కట్టడి ప్రభుత్వాలకు పెను సవాలు రువ్వుతోందిప్పుడు!

కలుషిత నీరు, ఆహారం, గాలి, దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగీ, మలేరియా, గన్యా, డయేరియా, కామెర్లు, టైఫాయిడ్‌ వంటి వ్యాధుల నివారణకు క్షేత్ర స్థాయినుంచి రాష్ట్ర స్థాయిదాకా ప్రత్యేక వ్యవస్థ నెలకొల్పాల్సిన అవసరం ఉందని కేంద్రం మొన్న జనవరిలోనే అభిప్రాయపడింది. ప్రజారోగ్యంలో డిగ్రీ పూర్తి చేసిన వైద్యులకు నాన్‌ క్లినికల్‌ విభాగంలో బాధ్యతలు అప్పగించడం ద్వారా అంటువ్యాధుల నివారణతోపాటు రక్తపోటు, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధుల కట్టడీ సులభతరమవుతుందని జాతీయ ఆరోగ్య మిషన్‌ అప్పుడే సూచించింది. కొవిడ్‌ కల్లోలంతో ఆ తరహా మేలిమి సూచనలు, కాలా అజార్‌ బోదకాలు వ్యాధుల సమూల నిర్మూలన లక్ష్యాలు కొట్టుకుపోగా- దీర్ఘకాలిక లాక్‌డౌన్‌తో అంటువ్యాధుల నివారణ చర్యలు అటకెక్కాయి. ఇప్పటికీ క్షయ ఏటా నాలుగు లక్షలమందికిపైగా అభాగ్యుల ఉసురు తీసేస్తుంటే, మలేరియా సైతం విస్తృతంగా మరణ మృదంగం మోగిస్తోంది. ప్రాణాంతక జాబితాలో ఉన్న తొలి అయిదు వ్యాధులు రోజూ 11వేల మంది భారతీయుల్ని బలిగొంటున్నాయని, అందులో మూడు అంటువ్యాధులేనని గ్లోబల్‌ బర్డెన్‌ ఆఫ్‌ డిసీజ్‌ (జీబీడీ) అధ్యయనం చాటుతోంది. నిరుడు డెంగీ కేసులు వేలల్లో నమోదు కావడాన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ హైకోర్టు- ప్రతి మరణానికీ మూల్యం చెల్లించాల్సిందేనంటూ సూటిగా స్పందించడం తెలిసిందే. ఎక్కడికక్కడ దోమల బ్రీడింగ్‌ కేంద్రాల నిర్మూలన, పరిసరాల పరిశుభ్రత వంటివి వ్యాధుల సీజన్‌ ఆరంభానికి ముందే నిష్ఠగా సాగాల్సిన పనులు కాగా, వాటికి ఏర్పడిన ఆటంకం- ముప్పు తీవ్రతను పెంచుతుందన్నది నిజం. ప్రభుత్వ దవాఖానాల్లో డాక్టర్లు, నర్సింగ్‌ సిబ్బంది కొరత- మరో చేదు వాస్తవం. కరోనా తప్పనిసరి చేసిన చేతుల పరిశుభ్రత, మాస్కుల ద్వారా కొంత రక్షణ పొందగల వీలున్నా, పరిసరాలు దోమల ఆవాసాలు కాకుండా కాచుకోవడం- ఇక అందరూ నిష్ఠగా పాటించాల్సిన ఆరోగ్య నియమం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.